On K9-DM Course Experience (Telugu 15.04.2026)
⚛️🪷🌳 కేరీర్-9 కాలంలో నేను నేర్చుకున్న అంకాత్మక అమ్మకాల ప్రచారం, ప్రచురణ విషయాలు ఎలా వు(ఉ)న్న నిశ్శబ్దంగా నిర్మలంగా వృత్తిపరంగా కన్న కొంచెం వ్యక్తిగతంగా మీరందరి నుంచి నా మదిలో అందుకున్న అనుభూతులు అసాధారణంగా అనిపించింది. విస్తృత విశాల అనుభవాలు అందుకుని పరిణితి చెంది పరిపక్వతతో నైపుణ్యాలు నేర్పే ఆసక్తి గల అధ్యపకురాలిగా లక్షణమైన లక్ష్మిగారి విద్యార్థి విద్యార్ధినిలుగా.... వచ్చిన విషయాలను మరింత మెరుగుపరచుకొన్న నేపథ్యంతో నేర్పుగా సాయి శామ్యూల్ ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు త్వరితగతిన తరగతి పాఠాలను పాటిస్తూ సాధన చేసే శివ, పెళ్లై పెద్దవారిగా పతి, పిల్లల భవ బాధ్యతలను నేరవేరుస్తూ, నైపుణ్యాలు నేర్చుకునేందుకు, నిండైన హృదయంతో హాజరైయ్యే స్వాతి సంధ్య నియతి రాజ్యలక్ష్మి గార్లు... వృత్తి వృద్దికై వచ్చిన రమ్య రింకీ... అందరు ఆనందంగా భవిష్యత్తుకై భరోసాగా ఆశ ఆశయాలతో సిద్ధమై సానుకూలతతో హార్దికంగా హాజరవుతూ నేర్చే నైపుణ్యాలను, అప్పటికప్పుడు ఆరోజే సాధన సే(చే)స్తూ పాఠాలను పాటిస్తూ...