పోస్ట్‌లు

కవిత్వం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Vivekananda Kendra KPS (Telugu 14.05.2026)

చిత్రం
⚛️🪷🌳  వివేకానంద కేంద్ర కన్యాకుమారి వారు  దేశ ధార్మిక సేవకై సంకల్పంగా నియమాలతో నిశ్చలంగా నిర్వహించే  కార్యక్రమాల ప్రస్ఫుట శిక్షణకై  “కార్యకర్తల ప్రశిక్షణ శిబిరం”లో పరస్పర పరిచయాలతో  సమూహ స్ఫూర్తితో అహం ఆదమరిచి అండదండగా వినమ్రంగా విలక్షణంగా ఒకరికొకరుగా ఒక్కటై  తెల్లవారుజామన తొందరగా  లేచి, లయగా ప్రాతఃకాల ప్రార్థనలు వివిధ వ్యాయామాలు,  నియుద్ధ నైపుణ్యాలు, యోగాసనాలను యత్నించి, సమిష్టిగా శ్రమ సంస్కారాలు  గీతా గానం భగవద్గీత పారాయణం,  భజనలు పాడడం తాత్విక తరగతులు  చింతనల చర్చలు  ప్రకటిత ప్రదర్శనలు  ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందపరిచే ఆటలు, ధారావాహికగా దాఖలు  చేసిన చారిత్రాత్మక  కథా కథనాల తీరుతో తృప్తిగా సంతోషంగా సాగింది.  -------- కేంద్ర కౌశలంలో నిర్వహణాధికారిగా నిల్చుని రాణిస్తూ రామకృష్ణగారి ఆధ్వర్యంలో జరిగినకానీ సమక్షంలో జరిగినట్లుగా నిశ్శబ్దంగా నిర్విరామంగా  శ్రమించే శ్రామికడు.  కేంద్ర కౌశలానికి  సగర్వంతో సగౌరవంగా  హార్థిక అతిథులుగా హాజరైన ఆహ్వానించిన అతిథులు  అరుణ్ జీ, అమరేష్  విశ్రాంత న్...

Sanihit Upanayanam (Telugu 13.05.2026)

చిత్రం
⚛️🪷🌳   ఉపనయన ఉత్సవంతో సపరివార సమక్షంలో  భవ్య బ్రహ్మాణ  విశేష వేదమంత్రాలు  హొమాగ్ని సాక్షిగా హామీగా  ఉన్నతమైన ఉపవీతం ధరించి ధన్యుడవై నాన్న ద్వారా నిర్మలంగా  బ్రహ్మాండమైన బ్రహ్మోపదేశం పొందికగా పొంది  సంధ్యావందన సంస్కారానికి తద్వారా తక్కిన  ఆచారాలుకు అర్హత  సాధించే సమూపార్జన దిశగా దివ్యంగా  దిగ్విజయంగా ద్విజుడవుతున్న సుహాసినిహరిల సంతానం  సన్నిహిత్.కు సంతోషంగా  హార్దిక హృదయపూర్వక  శుభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖13.05.2026✍️

Dr Virinchi Birthday (Telugu 09.05.2026)

చిత్రం
⚛️🪷🌳   వైద్య వృత్తిలో  హిత హృదయ  నిపుణునిగా నిలిచి  స్వీయ సంకల్పంతో,  సామాజిక స్పృహతో,  సమాజ సేవకై సాహితీకృతిని స్వావలంబన  చేసుకుని చిత్తశుద్ధితో తర్క తాత్విక  విశేష విషయాలను  రచనలతో రాణిస్తూ  సారవంత సమూహం  సృష్టించుకుని,  సాహితి సభ్యులను విలక్షణమైన వ్యక్తులను చేర్చుకుని చక్కగా  నిర్వహిస్తూ నడుస్తూన్న వైద్యులు విరించి గారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️📝🙂@🌳 📖09.05.2026✍️

VIP పాండు గారు (Telugu 07.05.2026)

చిత్రం
⚛️🪷🌳 వేముల(వాడ) పాండు  గారు, గణనీయమైన గత అనుభవంతో ఆంధ్రజ్యోతిలో పునఃప్రవేశించి ప్రవాహంగా  ప్రకటనలను ప్రీతిగా పోటీగా  రమణీయంగా రచిస్తూ  అలకరాని, అలసిపోని  అనువాదాన్ని ఆనందాన్ని అందించే అస్తిత్వం.. ఆంధ్రజ్యోతిలో నా ఆనందాన్ని  ప్రదర్శించేందుకు అందరి ప్రతిరూపంగా  పాండుగారి పక్కన చేరి, చేయి  నిమిరేవాడిని నేను. తపనగల తండ్రిగా తనయ తనయులకు  పాండు గారు  పాండవులు (పాండు సంతానం)కు మూస మార్గంలో కాకుండా, కళగా  సహజదారిలో స్థిరంగా  సాగేందుకు సహకరిస్తు చక్కని చదువు  అభినయం అందించిన వేముల పాండుగారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖06.05.2026✍️

Sai Birthday (Telugu 04.05.2026)

చిత్రం
⚛️🪷🌳   పశ్చిమ గోదావరిలో పుట్టి  అనంతపురంలో ఆవాసం ఏర్పచుకుని, ఎదిగి  ధైర్యం ధారణగావించి విరివిగా వివిధ ప్రముఖ పత్రికలలో  చేరి, చివరకు  ఆంధ్రజ్యోతిలో ఆసీనుడివై సవాళ్లను స్వీకరిస్తూ సాంకేతిక ప్రచురణతో  సహవాసం (చేస్తు) ప్రదర్శిస్తూ ఎదుగుతూ ఎగురుతూ  సినిమా పేజీ  రూపకర్తగా రాణిస్తున్న  సాయికి  హార్దిక హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖04.05.2026✍️

May Day (Telugu 01.05.2026)

చిత్రం
 ⚛️🪷🌳 ముందుగా ఉద్యోగస్తులు కూడా కార్మికులే అనే విషయాన్ని తెలియజేయాలని అని అనుకుంటున్నాను. ఈనాడు ప్రతి ఉద్యోగస్తుడు అనుభవించే వారాంతర సెలవులు, 8 గంటల పని, గౌరవ వేతనాలు ఇంకా సంస్థ, అదనపు ప్రయోజనాలు (రవాణా, భోజనాలు వగైరా), భత్యాలు, ఇంకా సంస్థ, ప్రభుత్వం అందించే సంక్షేమాలు (ఆరోగ్యం మొదలైనవి) ఇవన్నీ అనేక దేశాల్లో, అనామకులైన లక్షలాది కార్మిక స్త్రీ పురుషులు, కమ్యూనిస్టులు, తదితరుల నిరంతర పోరాటంతో  లభించినవి.  ఈ విజయాలు ఏ ఒక్కరో ఒక్క  సంస్థ నో సాధించినవి కాదు. అది మార్క్స్ గానీ,  కమ్యూనిస్టు పార్టీ గానీ ఇలా ఒక్కరికి లేదా ఒక్క సంస్థకు మాత్రమే కట్టబెట్టలేము. అలా చేయడం అనేది కార్మికుల సమిష్టి త్యాగాన్ని ఒకరికి పరిమితం చేసినట్లు అవుతుంది. కార్మికులు కాలంలో కలిసున్న కరుణా కాఠిన్యాలతో కడలిలో కదులుతూ  కష్టం కొట్టినా,   కరుణ కురిసిననా కళ్ళు కాంతినన్వేషిస్తూ కమనీయ కలలు కంటూ కాళ్లతో కదులుతూ  కట్టే కట్టడాలు కృషిగా కనిపిస్తాయి. ఉన్నత ఉద్యోగస్తులు  కూడా కార్మికులే, అందరూ అనుభవించే సంతోష వారాంత సెలవులు పద్ధతిగా 8 గం.ల పని, గౌరవ వేతనంగా గణమొత్తం  అదనపు...

Saketh Sowmya Marriage (Telugu 30.04.2026)

చిత్రం
⚛️🪷🌳   “(కొన్ని కారణాలరిత్య బృహత్ బెంగళూరులో  వివాహానికి విచ్చేయలేక  తిరు తిరుపతిలో  విందుకు విచ్చేయలేక చాలా చింతిస్తూన్నాను)”  బృహత్ బెంగళూరు  కళ్యాణం కార్యక్రమం  నిర్వహించి, నేడు  తిరు తిరుపతిలో  విందు వేడుకిస్తున్న మృత్యుంజయ మాధురి  బాబాయి పిన్నిలకు అభినందనలు.  మృత్యుంజయ మాధురి  బాబాయి పిన్నిల భవ్యమైన కనిష్ట కుమారుడైన  సాకేత్ సౌమ్యతో  వైభవంగా వివాహం చేసుకుని చిద్విలాసంగా  ఏడడుగులతో ఏకమై వైవాహిక వ్యవస్థలో  బాధ్యతగా బరిలో  దిగి ధైర్యంగా ప్రయాణం ప్రారంభించిన ఇంపైన ఇరువురికి  హార్థిక హృదయపూర్వక  శుభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖30.04.2026✍️

Earth Day (Telugu 22.04.2026)

చిత్రం
⚛️🪷🌳  భవ్యమైన భావనలతో భీషణమైన భూమికతో భూమి(తన)లో భాగమైనవారిని భవదీయులుగా భావిస్తూ భూస్వామిగా భిక్షగాకాక భూదాతగా బాసటగా బాధ్యతతో భారీవి బలమైనవి బలహీనమైనవి భరిస్తూ బంధాలకు బాసటై బహుళ బృందావనాలనను బహుమతిస్తూన్న భూమికి భావనలమాల అ'భి'వ్యక్తీకరిస్తున్నాను దివ్యమైన ధరిత్రి ధార్మిక ధోరణితో దయగల దీప్తిగా దిగువ దారిచూపిస్తూ దప్పిక తీరుస్తున్న ధరణికి ధన్యవాదాలు 💭⚖️🙂📝@🌳 📖22.04.2026✍️

3) On Indian Railways (Telugu 16.04.2026)

చిత్రం
⚛️🪷🌳  దేశంలోని దిశలన్ని  సమైక్యత సిద్ధాంతంతో  సంస్కృతుల సంగమంతో కలిపే కీలకమైన  విశేష వ్యవస్థగా భారతీయ రైల్వే  ఇంకా ఇది  సంప్రదాయ సాంకేతికతను,  సాధారణ సంపన్నులను సంధానిస్తూ సాగుతూ  సంకీర్ణంలో సమతుల్యంతో   సమాజ సౌలభ్యానికి సాధికారత సాధించిన సమగ్ర సంకల్పం సామాజిక సేతు  భవదీయ రాగం  భారతీయ రైల్వే  భారతీయులందరికి భారతీయ రైల్వే  దినోత్సవ శుభాకాంక్షలు రమణీయ రైల్వే దీర్ఘమైన దారిలో సుందర సోయగాలలో మార్గాన్ని మలుచుకొని ప్రకృతి పరిసరాలలో  ప్రాంతాలును పర్యటించే  ప్రయాణికుని ప్రయాణం  ప్రహ్లాదంతో ప్రమోదం.....   --------------- వివిధ సమయాల్లో  వివిధ స్థలాల్లో  రాష్ట్రాల రాజధానులు &  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.లో ఉన్న  జిల్లాల ప్రధానకేంద్రాల్లో జ్ఞాపకంగా  తీసుకున్న తీపి  చిద్వివిలాస చిత్రాలు 💭⚖️🙂📝@🌳  📖16.04.2023(4&6)✍️

Self Letter (Telugu 14.04.2026)

చిత్రం
⚛️🪷🌳  అతిరథుడిని కాను అధముడిని కాను  అందరిలానే  ప్రత్యేకమైనవాడిని‌. అపేక్ష అలజడులు  లేని లాలించే అంతరంగానా ఆనందంగా  ఆలోచనలను ఆలకిస్తు,  అనుభూతులను ఆస్వాదిస్తూ  ఆసక్తితో అక్షరాన్ని అందుకుంటూ ఆసీనుడై  ఆనందంతో అనుసంధానమై రాస్తున్న రమణీయ  లక్షణమైన లేఖ నియంత్రణలేని నైరూప్యమైన  అనాలోచిత అలజడులు ఎలాగున్న ఏలుబడిగా ప్రశాంత పలుకులతో పరిసర ప్రపంచం ప్రశాంతంగా ప్రమోదాన్ని అందుకోవాలని ఆకాంక్షించేవాడిని. కుటుంబంపై కొంత  ఆధారపడిన, ఆపేక్షలు అభ్యంతరాలులేనీ ఆలోచనల స్థితిలో స్థిరంగా సాగుతూ  పరస్పర ప్రశాంతత పొందుతున్న భవ భావ బాటసారిని. అతిథిగా  మీరు నాకు  నేను మీకు  సముద్ర సమక్షంలో  అడుగులోనే అక్కడ  నిలబడి నిర్మలంగా  చూస్తే చుట్టూ  వు(ఉ)న్నా విశేష  ప్రదేశ పరిధి  అతిశయంగా అత్యంత  విశాలంగా విసృతంగా  ఉన్నతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా సంక్షిప్తంగా సంప్రాప్తించిన  వ్యక్తుల విశేషాలు, విషయాలను  ప్రశాంతత ప్రాప్తికై, సానుకూల స్పూర్తికై చెంత చేరుతాము‌. అక్షరంలో అనతికాలం చాలాకాలం చిరస్మరణీయం...

Health Day (Telugu 07.04.2026)

చిత్రం
⚛️🪷🌳 అమూల్యమైన ఆరోగ్యం  అపురూపమైన ఆస్తిగా అందరికీ అందింది.  ఆరోగ్యాన్ని అలానే  అంటిపెట్టుకోవడానికి  ఆసక్తిగా అలవాట్లతో ఆహారం, ఆహ్లాదంతో అనుసంధానమై అందరూ  ఆనందాన్ని అందుకోవాలని  ఆకాంక్షిస్తూ అక్షర ఆకారంలో  ఆలోచన అనుభూతిని  అభివ్యక్తీకరిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖07.04.2026✍️

APU Alumni (Telugu 29.03.2026)

చిత్రం
⚛️🪷🌳  విశ్వవిద్యాలయం వారు  ఉన్నత ఉద్దేశాలతో, నిండైన నిధులతో  ఏకమయ్యేందుకు ఏర్పాటుచేసిన సమ్మేళనంలో సంతోషంగా విచ్చేసిన విద్యార్థులు  ఆచార్యులు, అందరం  కలిసి కాలక్షేపం, విలక్షణమైన విశ్లేషణలు  సరికొత్త సంపర్కాలు, సంబంధిత సంభాషణలు  చక్కగా చేసుకుని  చక్కని చిత్రాలు  తీసుకొని, తీపి జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకొని తృప్తిగా మళ్ళీ మా  మార్గంలో మమేకమయ్యాము 💭⚖️🙂📝@🌳 📖 29.03.2026 ✍️

Vamsi Annaiya (Telugu 21.03.2026

చిత్రం
⚛️🪷🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల ఆత్మజునిగా ఆనందనామ సంవత్సరంలో సంతసమైన పుత్రునిగా ఫాల్గుణ  శుద్ధ అష్టమి,  శుక్రవారం, ఆరుద్ర  నక్షత్రం నాడు  గూడూరు గడ్డపై పుట్టి  వరంగల్లు వంటి  ఊర్లలో ఉండి నెల్లూరు నేపథ్యంగా పెరిగి మద్రాసులో మొదటి  ఉద్యోగంలో ఉండి  విశాఖపట్నం వనిత కవిత(వదిన)ను కళ్యాణం చేసుకుని చక్కగా  అన్షు ఆర్యలకు  తండ్రివై, తోడుగా  తల్లి చెంత తృప్తిగా గడిపి గడించిన  జ్ఞాపకాలను జప్తుచేసి వృత్తిలో వృద్ధి చెందుతూ చక్కగా  భర్తగా భార్యకు అల్లుడిగా అత్తకు తనయునిగా తండ్రికి భవ్యంగా బాధ్యతలను నిర్వహిస్తూ నడుస్తూ "నిర్వహణ నక్షత్రం"  అయన అన్నయ్య...  "సానుకూల సాటి"గా  విషయ విజ్ఞానం,  విధేయత విధానం వినే విలువ,  ప్రశాంత పలుకులు,  సమగ్ర స్ఫూర్తి,  స్వతంత్ర స్వరం, పొడుగైన పొందిక,  పాకశాస్త్ర ప్రావిణ్యం  కలిగి కదిలే  అన్నయ్య  మనం మౌనంగా  ఆపేక్షలేని అంతరంగాన  నైరూప్యంగా నిర్విరామంగా  ఒకరికి ఒకరం ఆలోచనల్లో అనుసంధానం అయ్యే అన్నదమ్ములం. నాలోన లోలోన...

3) Ugadi (Parabhava 19.03.2026)

చిత్రం
⚛️🪷🌳  సహజంగా సంప్రాప్తించే  ప్రకృతి పదార్థాలు, ఆరగించే ఆహార షడ్రుచుల సమ్మేళనాన్ని వుడికించడం, వేయించడం, కాల్చడంతో కాకుండా,  కేవలం కలపడంతో మధురంగా మలుచుకుని  సమభావనతో స్వీకరించి  సేవించగలిగే, సమతుల్య  సచ్చిదానందా సకామక్రియ  ఉగాది పచ్చడి  సానుకూల సారంతో ఉగాది ఉత్తేజానికీ  ఊతమైన ఉదాహరణ. ఆప్తులు అందరికీ హార్దిక హృదయపూర్వక  శ్రీ పరాభవ సంవత్సర  శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳   📖 19.03.2026 ✍️

Karnakar Birthday (Telugu 12.03.2026)

చిత్రం
⚛️🪷🌳  కరుణాకర్ గా పరిచమమైన, కర్ణకర్ పేరున్నవాడు. వు(ఉ)మ్మడి వరంగల్  జిల్లాలో జన్మించి ఏకశిలా పాఠశాల ఫాతిమా కళాశాలలో  ఉత్తీర్ణుడై ఉండి ఉన్నత విద్య  ఉస్మానియా విశ్వవిద్యాలయ  పరిధిలోని ప్రఖ్యాత  నిజాం కళాశాలలో  ఆంగ్లభాష అంశాలు అభ్యసించి పట్టభద్రత పోంది జీవనోపాధికై జరిగిన  ప్రయాస ప్రయాణంలో  తేలికగా తొలిసారి  ఆంధ్రజ్యోతిలో అడుగేసి పరిక్షలో పరీక్షించిన  మీదట, మొదటిసారిగా విజయుడై వృత్తిలో  దృక్పథంతో ధృవీకరణకర్తగా  ఉంటూ ఉన్న  కాలంలో కుటుంబం కుదుర్చిన కళ్యాణంతో అఖిలను అర్ధాంగి  చేసుకుని చిద్విలాసంగా  సారాంశప్రాయంగా సంతోషంగా  కొనసాగుతున్న కర్ణకర్ కు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖12.03.2026✍️

On T20 World Cup 2026

చిత్రం
⚛️🪷🌳   ప్రఖ్యాత ప్రపంచకప్పు  విజేతగా వుంటూ  దానిని దృఢంగా  నిలుపుకోవాలనే నెపంతో   సానుకూల సంకల్పంతో  మెదులుతూ మొదలైన  ఆరంభ ఆటలలో  క్రికెట్ క్రీడలో  మౌలికసదుపాయాలు మెరుగుగాలేని  జట్లపై జారిన కుదురుకొని కష్టపడుతూ  ఒక్కొక్కరు ఒక్కొక్క  ఆటలో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ ఆడుతూ  వచ్చిన వేళ గెలిచిన గెలుపులతో  బృందదశలో బ్రహ్మాండమైన  అగ్రస్థానం అధిరోహించినా వెలతి వున్న విజయాలను పూర్ణంచేసే విధంగా   దక్షిణాఫ్రికా దృఢంగా ఓడించిన ఒక్క ఓటమితో  మేలుకొని మెరుగై కీలకమైన కాలంలో    కృషితో కలిసికట్టుగా జింబాబ్వే జుట్టుపై  గెలిచి ఘనంగా క్వార్టర్ ఫైనల్ కానీ క్వార్టర్ ఫైనల్లో  వెస్టిండీస్ ను వంచి  సాధికారంగా సెమీఫైనల్లో   హోరాహోరీ  ఆడిన ఆటోలో  ఇంగ్లాండును ఇంటికి  పంపి, ఫైనల్లో  పరుగుల పారించి బాగా బంతులేసి విజేతగా నిలిచి విజేత  బిరుదుని భవ్యంగా నిలుపుకొని నిలిచిన భారత క్రికెట్ క్రీడా బృందానికి  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు మరి ముఖ్యంగ...