Vamsi Annaiya (Telugu 21.03.2026

⚛️🪷☀️🍃@🌳
 సుబ్బారావు పెద్దనాన్న 
సుందరి పెద్దమ్మల
ఆత్మజునిగా ఆనందనామ
సంవత్సరంలో సంతసమైన
పుత్రునిగా ఫాల్గుణ 
శుద్ధ అష్టమి, 
శుక్రవారం, ఆరుద్ర 
నక్షత్రం నాడు 
గూడూరు గడ్డపై పుట్టి 
వరంగల్లు వంటి 
ఊర్లలో ఉండి
నెల్లూరు నేపథ్యంగా పెరిగి
మద్రాసులో మొదటి 
ఉద్యోగంలో ఉండి 
విశాఖపట్నం వనిత
కవిత(వదిన)ను కళ్యాణం
చేసుకుని చక్కగా 
అన్షు ఆర్యలకు 
తండ్రివై, తోడుగా 
తల్లి చెంత తృప్తిగా
గడిపి గడించిన 
జ్ఞాపకాలను జప్తుచేసి
వృత్తిలో వృద్ధి
చెందుతూ చక్కగా 
భర్తగా భార్యకు
అల్లుడిగా అత్తకు
తనయునిగా తండ్రికి
భవ్యంగా బాధ్యతలను
నిర్వహిస్తూ నడుస్తూ
"నిర్వహణ నక్షత్రం" 
అయన అన్నయ్య... 
"సానుకూల సాటి"గా 
విషయ విజ్ఞానం, 
విధేయత విధానం
వినే విలువ, 
ప్రశాంత పలుకులు, 
సమగ్ర స్ఫూర్తి, 
స్వతంత్ర స్వరం,
పొడుగైన పొందిక, 
పాకశాస్త్ర ప్రావిణ్యం 
కలిగి కదిలే 
అన్నయ్య 
మనం మౌనంగా 
ఆపేక్షలేని అంతరంగాన 
నైరూప్యంగా నిర్విరామంగా 
ఒకరికి ఒకరం
ఆలోచనల్లో అనుసంధానం
అయ్యే అన్నదమ్ములం.
నాలోన లోలోన........
అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు  
హార్థిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు….
💭⚖️🙂📝@🌳
📖 21.03.2026 ✍️


కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)