3) Ugadi (Parabhava 19.03.2026)

⚛️🪷☀️🍃@🌳 

సహజంగా సంప్రాప్తించే 
ప్రకృతి పదార్థాలు,
ఆరగించే ఆహార
షడ్రుచుల సమ్మేళనాన్ని
వుడికించడం, వేయించడం,
కాల్చడంతో కాకుండా, 
కేవలం కలపడంతో
మధురంగా మలుచుకుని 
సమభావనతో స్వీకరించి 
సేవించగలిగే, సమతుల్య 
సచ్చిదానందా సకామక్రియ 
ఉగాది పచ్చడి 
సానుకూల సారంతో
ఉగాది ఉత్తేజానికీ 
ఊతమైన ఉదాహరణ.

ఆప్తులు అందరికీ
హార్దిక హృదయపూర్వక 
శ్రీ పరాభవ సంవత్సర 
శోభమైన శుభాకాంక్షలు.

 💭⚖️🙂📝@🌳 
 📖 19.03.2026 ✍️




కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)