పోస్ట్‌లు

📧 Emphasis (ఉద్ఘాటన) 🤗 లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

APU Alumni (Telugu 29.03.2026)

చిత్రం
⚛️🪷🌳  విశ్వవిద్యాలయం వారు  ఉన్నత ఉద్దేశాలతో, నిండైన నిధులతో  ఏకమయ్యేందుకు ఏర్పాటుచేసిన సమ్మేళనంలో సంతోషంగా విచ్చేసిన విద్యార్థులు  ఆచార్యులు, అందరం  కలిసి కాలక్షేపం, విలక్షణమైన విశ్లేషణలు  సరికొత్త సంపర్కాలు, సంబంధిత సంభాషణలు  చక్కగా చేసుకుని  చక్కని చిత్రాలు  తీసుకొని, తీపి జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకొని తృప్తిగా మళ్ళీ మా  మార్గంలో మమేకమయ్యాము 💭⚖️🙂📝@🌳 📖 29.03.2026 ✍️

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

చిత్రం
⚛️🪷🌳  వడ్రంగి వృత్తిలో వున్న (నాగ) లింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు దైవానుగ్రహంతో చక్కగా చాగంటివారిపాలెంలో  పురుడు పోసుకుని  సత్తనపల్లి శరభయ్య పాఠశాలలో పదవతరగతి వరకు విద్య  పొంది, పశ్చిమగోదావరి  భీమవరంలో బసచేసి  ఇష్టంగా ఇంటర్మీడియట్  డిగ్రీ దాక  పూర్తిచేసుకున్న ‌పిమ్మట గాఢంగా గుంటూరులో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొంది అత్తిలిలో అధ్యాపకునిగా  కుదురుకున్న కాలంలో  కళాశాల కార్యక్రమాలలోని సాంస్కృతిక బృందాలలో స్వర అనుకరణలు  చేస్తూ చురుకుగా  పాల్గొంటూ, ప్రశంసలు పొంది  స్నేహితుడి సిఫార్సుతో దూరదర్శన్ ధారావాహిక “పకపకలు”లోని ప్రదర్శనతో ప్రేక్షకాదరణ పొంది,  గాఢమైన ప్రతిభను గుర్తించిన చలనచిత్ర దర్శకులు  “సుబ్రహ్మణ్య శాస్త్రి (జంధ్యాల)” “వేజళ్ల సత్యనారాయణ” చెల్లిన దారిలో  తొలిసారిగా శ్రీ తాతావతారంలో నరేష్ నలుగురు నేస్తాలలో  ఒక్కడిగా ఒదిగి నటించినా… మొట్ట మొదట  విడుదలైన విశేష  చిరస్మరణీయ చిత్రం “ఆహనా పెళ్ళంట”తో  అరగుండుగా అద్భుతమైన  ప్రశంసలు పొంది, పరిశ్రమలో  సుస్థిర స్థానానికి శ్రీకారంచు...

Dhruthi Sri Birthday (Telugu 31.01.2026)

చిత్రం
⚛️🪷🌳  పరవళ్ళుగా పారే పసి ప్రాయపు  పరమానందాన్ని పరిధిలోని ప్రతి ప్రపంచానికి  పారవశ్యంగా పంచే  విశదమైన విశేష  శైశవ శక్తితో ఉండి ఉన్నతంగా  ఆకర్షించే అస్తిత్వం ధృతిశ్రీ‌ నీ పరమానందం  మాలో ప్రసారమవ్వాలని పరమాత్ముని ప్రార్థిస్తూ హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖31.01.2026✍️ ------------ నిర్మలమైన నారాయణుని, అరుణాచల (రమణ), ఆదిశేషుని,  నయన నీడలో నవ్వుతూ  నిండుగా నడిచిన నానమ్మ శతజయంతి నాడు నివాళర్పిస్తు........  జనవరి 31న జన్మించిన నిర్వికల్పమైన నానమ్మ  నిర్మలమైన నాన్న  మధురమైన మేనకోడలు ధృతిశ్రీ,  ముగ్గురికి మనసారా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు ------- నానమ్మ దివ్య అస్తిత్వాన్ని అంతర్లినం చేసుకొని నానమ్మ జన్మించిన తేదీ నాడే జన్మించిన  నానమ్మ వారసుడు నాన్నకు మరియు  నాన(మ్మ) ముని(మనవరాలు) అయిన  నా మేనకోడలు ధృతికు జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖31.01.2026✍️

Atal Bihari Vajpayee (Telugu 25.12.2025)

చిత్రం
⚛️🪷🌳 ప్రతిపక్షంలో ఉన్న వాజపేయిపై అధికార పక్షంలో ఉన్న అప్పటి ప్రధానమంత్రుల ఆలోచనలు అనగా నెహ్రూ ఆశ, రాజీవ్ గాంధీ ఉపకారం, నరసింహారావు గారి నమ్మకం, అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచిన ప్రతిపక్ష ప్రముఖుడు వాజపేయి నెహ్రూ దృష్టి:  1957లో అటల్ బిహారీ వాజపేయి గారు మొదటిసారి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. వాజపేయి గారు హిందీలో మాట్లాడే అనర్గళమైన ప్రసంగాలు, విదేశీ విధానాలపై ఆయనకున్న పట్టు చూసి నెహ్రూ ముగ్ధులయ్యేవారు. ఒకసారి విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చినప్పుడు, నెహ్రూ గారు వాజపేయిని పరిచయం చేస్తూ.. "ఈ యువకుడు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు" అని చెప్పారు. రాజీవ్ గాంధీ మానవీయత:  మరో సంఘటన 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి భారత ప్రతినిధి బృందంలో అటల్ బిహారీ వాజపేయిని చేర్చారు. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు, కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి...

Eknath Ranade (Telugu 19.11.2025)

చిత్రం
⚛️🪷🌳    రామకృష్ణ రమాబాయి  ధార్మిక దంపతులకు  ప్రార్ధన ఫలితంగా  ఎనిమిదివవానిగా ఏకనాథ్ రానాడే జన్మించి రాణిస్తూ,  దైవ రూపంలో దర్శించిన లోకమాన్య చిత్రం చూసి లోతుగా  ప్రేరణ పొంది  సమాజ సంక్షేమానికి  నిలబడాలని నిర్ణయానికి  వచ్చిన వాడై  తత్వచింతనతో తాత్వికశాస్త్రంలో  పట్టా పొంది  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో రాణించి సర్వసంఘ సంచాలక కార్యదర్శిగా ఎదిగి ఒదిగి సాగుతున్న సమయంలో స్వామి వివేకానంద శతాబ్దుత్సవాలలో వివేకానందునికి వ్యక్తిగత  నివాళిగా నిలిచే హిందూజాతికి మేలుకోలుపు పుస్తకం ప్రారంభించి పూర్తిచేస్తున్న  సమయంలో కన్యాకుమారి స్థానిక  వ్యక్తులు వివేకానంద విగ్రహావిష్కరణకై  రామకృష్ణమఠం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సంప్రదించిన సమయంలో  ఆచార్యుల ఆదేశానుసారం  కన్యాకుమారి కడలి వద్ద వివేకానందుని  శిలా స్మారక స్థాపన స్వప్న సాకారనికై సంకల్పించి సాధికారతతో సాగిన  ప్రామాణిక ప్రయత్నాలలో ప్రతికూల పరిస్థితులను  దాటుకుంటూ దృఢంగా నిర్మాణానికై నిల్చుని  రాష్ట్రీయ రాష్ట్రాలును ప్రభుత్వాధికారులు  ప...

Deepavali 2025 (Telugu 20.10.2025)

చిత్రం
⚛️🪷🌳  దేవాలయాన దేదీప్యమాన దీపావళి దీపాల దగ్గర  వెదజల్లుతున్న వెలుగుల  చెంత చేరి  కూర్చుని కాంతులను చూస్తూ చక్కగా  తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖20.10.2025✍️ సంవత్సరం తర్వాత సరదాగా  కాల్చిన కాకరపువత్తులు చాంతాడ్లు చిచ్చుబుడ్లు    💭⚖️🙂📝@🌳 📖 20.10.2025 ✍️

Varanasi (Telugu 11.10.2025)

చిత్రం
⚛️🪷🌳  కాశీ క్షేత్రమున క్షేత్రపాలకుడు  కాలభైరవుడు,  అన్నపూర్ణ అమ్మ  దర్శనం ద్వారా  తృష్ణ తీర్చుకొని  మార్గం మధ్యలో సాక్షిగణపతికి సుమాంజలులు  తెలిపి తర్వాత  విశ్వనాథుడు & విశాలాక్షి  ఆలయ ఆవరణలో  నిర్మలంగా నిలుచుని  తల్లి తండ్రితో తృప్తిగా తీసుకున్న  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖11.10.2025✍️ ⚛️🪷🌳 కాశీ క్షేత్రామున గంగాయానంలో గడుపుతూ  తృప్తిగా తీసుకున్న  చక్కని చిత్రాలు  💭⚖️🙂📝@🌳 📖11.10.2025✍️

Dhruthi PuttiVentrukalu (Telugu 06.10.2025)

చిత్రం
⚛️🪷🌳 మేనకోడలుకు మేనమామగా తిరుమలలో తలనీలాలు తీయించి (పుట్టువెంట్రుకలు) చెవి కుట్టించి చెవిపోగు పెట్టించి తదనంతరం తీసుకున్న చక్కని చిత్రం 💭⚖️🙂📝🌳 📖06.10.2025✍️  సపరివార సమేతంగా సాగిన తిరుమలేశుని దర్శన దారిలో తీరికగా తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖06.10.2025 ✍️  

Kota Srinivasa Rao (Telugu 13.07.2025)

చిత్రం
⚛️🪷🌳 సమన్యాయంతో సినిమాలలో  వైవిద్యమైన విలక్షణ  పాత్రలలో పరకాయ ప్రవేశమై పాత్రలకు ప్రాణం పోసి పాత్రకు పాత్రకు పోలిక  లేకుండా, లక్షణమైన తపించే తండ్రిగా, నేపథ్య నటుడిగా, ప్రతినాయకుడి పాత్రలలో నమ్మసక్యం కానీ నటనతో  నటనకు నిఘంటువుగా  ఉన్న ఉన్నతమైన  కోటా శ్రీనివాసరావు గారు కన్నుమూసిన కారణంగా  అంజలి అర్పిస్తున్నాను మృత్యోర్మ అమృతంగ మయ  ఓం శాంతిః శాంతిః శాంతిః  💭⚖️🫡📝@🌳 📖13.07.2025✍️

Both Bharghav's Bhargava G (Telugu 06.07.2025)

చిత్రం
⚛️🪷🌳 భిన్నమైన భార్గవులం భిన్న ధ్రువాలమైన భవ ధోరణిలో  వున్న వాళ్లం కలిసి కూర్చుని  మరి మాట్లాడుకున్నాం, ఉపన్యాసంలో ఉన్న  సిద్ధాంతాలపై సంభాషణలు జరుపుకొని, జ్ఞాపకంగా తరువాత తీసుకున్న   చక్కని చిత్రం.  💭⚖️🙂📝@🌳 📖06.07.2025✍️ వ్యక్తి (Being) గురించి రాయడానికి అనుభవాలు చాలు. అనుకున్నవి చాలు.  అవ్వాలి అనుకున్నదాని (Becoming) గురించి రాయడానికి మాత్రం, నిన్ను నీవు సౌకర్య పరిధి లోంచీ తోసేసుకుని తాత్విక అగ్నిగుండం లోకి దూకవలసి వుంటుంది. ------------ అనుభూతిని ఆలోచనకు వ్యతిరేకంగా.. అనుభవాన్ని సిద్ధాంత స్పష్టతకు వ్యతిరేకంగా.. కల్పనా శక్తిని హేతుబుద్ధికి వ్యతిరేకంగా... నిలబెట్టడం నిష్ఫల క్రియ. ఒక తాత్విక బాల్య చేష్ట. -------- తెలివైన సేనాధిపతులు యుద్ధాన్ని (War) గెలవడం కోసం  చిన్న చిన్న పోరాటాల్లో (battles) ఓడిపోతారు. దేశమంతా హిందీ భాషే ఉండాలనే అమిత్ షా వ్యాఖ్యలను ఈ కోణంలోంచే చూడాలి. ఈ battle లో ఓడిపోతామని BJP కి తెలుసు.  కానీ హిందీ ప్రాంతంలో జరిగే కీలక యుద్ధంలో గెలవడం వారి అసలు లక్ష్యం. -------- మేడే అన్నది అంతర్జాతీయ కార్మిక హక్కుల పోరాట దినం. దేశద...

Ahmedabad Aeroplane Accident (Telugu 12.06.2025)

చిత్రం
⚛️🪷🌳 విమానం విహంగమైన  వెంటనే వైఫల్యం వల్ల  వైద్య కళాశాలపై కూలి వందల్లో  ప్రయాణికులు వారి ప్రాణాలు  కోల్పోవడం విషాదం కలిగిస్తోంది.  ఓం శాంతి శాంతి శాంతిః  💭⚖️😐📝@🌳 📖12.06.2025✍️

Dhruti Naming Ceremony (Telugu 08.06.2025)

చిత్రం
⚛️🪷🌳 స్వాతిఅభిరామ సుపుత్రికగా  మాధవి మల్లికార్జున, సుధ ప్రకాశ్ పౌత్రురాలిగా, ప్రేమతో మేనకోడలిగా అఖిల చైతన్యల, మేనమామ భార్గవ మధుర మమతలతో బుజ్జి బంగారం అంటూ అందరి  ఆశీస్సులను, ఆప్యాయతను  ఆనందంగా అందుకున్న  నేను, నా నామకరణ మహోత్సవానికి మిమ్మల్నందరిని "కడప"కు కుతూహలంగా ఆనందంతో ఆహ్వానించి  వేడుక వేళ ధృతిశ్రీ నామ ధారణతో  పేరును  ప్రకటించారు 💭⚖️🙂📝@🌳 📖08.06.2025✍️

Letter to ICC & BCCI (IPL) English (05.06.2025)

చిత్రం
⚛️🪷🌳 Dear ICC - International Cricket Council & IPL - Indian Premier League  I want to propose an new approach i;e introducing a medal system to replace the traditional 1st to 4th position rankings. And also want to upgrade the previous positions with new medal system. This system will elevate the prestige and competitiveness of ICC tournaments, including the World Cup, World Test Championship, Champions Trophy, and T20 World Cup. The ICC Medal System- A Symbol of Excellence: Gold Medal:  Awarded to the winner of each tournament, symbolizing the ultimate achievement in international cricket. Silver Medal:  Presented to the runner-up, acknowledging their exceptional performance and sportsmanship. Bronze Medal: Awarded to the third-placed team, recognizing their outstanding efforts and dedication. Copper Medal:  Awarded to the Fourth Placed team in Tournament.  Benefits of the ICC Medal System Enhanced Prestige: Medals will add a new level of prestige to ICC...

RCB: Rajat, Kohli & Co. (Telugu 03.06.2025)

చిత్రం
⚛️🪷🌳 పద్దెనిమిది సార్లు పడిన, పోటీగా  పతాక స్థాయికి ప్రయాణం సాగించి నిదానమైన నిశ్చయంగా నిలిచి  నిరీక్షణను నిలిపి నిర్మలంగా,  భావోద్వేగ భావాలను  మలచి మురిపెంగా బాగా బాధి భవ్యంగా  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  రజత్ అడుగుజాడల్లో రూపొందిన ఆటలో  కొనసాగుతున్న కోహ్లీ కోసం కృషితో కష్టపడి కప్పును కుతూహలంగా  అందుకున్న ఆనందంతో వున్న వారికి  హార్దిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖03.06.2025✍️ బెంగళూరులో బాధ  కలిగించిన ఆ కుతూహల  సందర్భమున సంభవించిన తొక్కిసలాటలో పోయిన  ప్రాణాలను తలచుకుంటూ  చీకుచింతా చెందుతున్నాను  ఓం శాంతి శాంతి శాంతిః 💭⚖️😐📝@🌳 📖04.06.2025✍️

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

చిత్రం
⚛️🪷🌳 విరాట్ వీడ్కోలు వర్ణించడానికి  పదాలు పలకలేకపోతున్నాను కానీ క్రికెట్టుకు మించి, ఓ మంచి మహా మనిషి  ------ శ్వేతవస్త్రంలో శౌర్యంగా  క్రికెట్ క్రీడా క్షేత్రమున పొరాట పటిమతో  నిదానంగా నిలకడగా  పరాక్రమంతో పరుగుల  ప్రవాహం పారించి  మైదానంలో మార్గదర్శిగా  సహచర సభ్యులకు స్ఫూర్తిగా జ్వలించే ఆ జయగర్జనుడు విరాట్ కోహ్లీ వీడ్కోలుకు  భావోద్వేగంతో భావాలను  విచారంతో వ్యక్తపరుస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️

Operation Sindoor (Telugu 07.05.2025)

చిత్రం
⚛️🪷🌳 పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు హరించిన  ఉన్మాద ఉగ్రవాద తీవ్రవాదులు తీరుకు  ప్రతిఘటనగా ప్రభుత్వం  ఆరంభించిన ఆపరేషన్  సింధూర్ ను సాయుధ బలగాలు బాధ్యతాయుతంగా  పాకిస్థాన్ పౌరులు &  సైనిక స్థావరాలపై  కాకుండా కేవలం ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదంతో  వ్యవహరిస్తూ వస్తున్న  సైన్యానికి సంపూర్ణ  మద్దతుగా మాట్లాడుతూ  జై జవాన్ అంటూ జేజేలు  పలుకుతున్నాను  💭⚖️🙂📝@🌳 📖07.05.2025✍️

Introvert's Day (English/Telugu 02.01.2025)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భవ భావజాల భావనలతో, స్వీయ సంచారంలో ఉన్నవాడిని. చాలా వరకూ, మాటలలో అంతర్ముఖుడిని రాతలలో బహిర్ముఖుడిని.  గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతున్నట్లుగా, ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను కొంచెం కవితాత్మకంగా వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులను వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తొంది. ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గమనిక: నా స్వాభావిక అంతర్దృష్టులు, నాలో నాకు అనిపించిన ఉత్తమ ఆలోచనలు క్షణికమైన కానీ, వాటిని కొంచెం మేధోమథనంతో దీర్ఘకాలం ఉండేలా, అక్షర రూపంలో అపురుమైన ఆకారం ఇస్తుంటాను.‌ రాసేటప్పుడు భావించిన భావాలలో ఉన్న గాఢతను, మంచిని, సౌందర్యాన్ని, అతిశయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. రాసిన తరువాత అనిపించిన ఉత్తమ స్థితి నుంచి సాధారణ స్థితికి అంటే మంచి పాత్రలు పోషించి బయటకు వచ్చే నటుల లాగానే వచ్చేస్తాను. వచ్చిన తరువాత నేనేనా అలా రాసి...

Manmohan Singh (Telugu 27.12.2024)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము మర మనిషి (రోబో) మన్మోహన్ సింగ్  తన నడక నడవిడి, నైపుణ్యం తీసిపోనివి, తన శక్తి సామర్థ్యాలు తలమానికమైనవి,  కానీ బలానికి బానిసత్వానికి కరిగినవాడు  అనిపించిన, కానీ  అసామాన్యమైన  కాంగ్రెస్సులో  కీలకమైన కిరణ కాంతి అధ్యాపకునిగా,  ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా ప్రధాన సలహాదారుగా,  ప్రణాళికసంఘ సభ్యుడుగా, ప్రధాన మంత్రిగా, ప్రామాణికమైన  బరువైన బాధ్యతలతో భారతదేశంలో  ప్రభుత్వ ప్రజాస్వామ్య  వ్యవస్థలోని విశేష వ్యక్తి. 💭⚖️🙂📝@🌳 📖27.12.2025✍️

Gukesh (Telugu 12.12.2024)

చిత్రం
⚛️🪷🌳 పిన్న వయస్కుడిగా  ప్రపంచ విజేత వై  చదరంగంలో చరిత్రగా   గెలిచిన గుకేష్ కు  ఆనందంగా అభినందనలు  💭⚖️🙂📝@🌳 📖12.12.2024✍️

Ratan Tata (Telugu 10.10.2024)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము రతన్ టాటా.. పారిశ్రామిక ప్రస్థానంలో  ఉప్పు ఉక్కు  వినోదం విద్యా  వసతి విమానం  ఆహారం ఆహ్లాదం సరదా సాంకేతికత వ్యాపారాలను విలువలతో  వికసింపజేసి విస్తరింపజేసి కంపెనీలను కొనుగోలుతో విలాసమైనవి విలీనంచేసిన దిగ్గజమైన ధీశాలి,  దాతృత్వ ధీర సంక్షోభ సమయాల్లో  సంక్లిష్ట సందర్భాలలో సంక్షేమానికి సంకల్పించిన టైకూన్ టాటాకు టాటా చెప్పడం చింతగా,   అనిపిస్తుంటుంది.  💭⚖️🙂📝@🌳 📖10.10.2024✍️