Self Letter (Telugu 14.04.2026)

⚛️🪷☀️🍃@🌳 

నాలో నేను నాతో నేను 

పరిధి అత్యల్పం 
కావచ్చు కానీ 
పరిధిలోని ఆలోచనలను
వాస్తవంగా వ్రాస్తున్నాను

అతిరథుడిని కాను
అధముడిని కాను 
అందరిలానే 
ప్రత్యేకమైనవాడిని‌.

అమ్మ అనురాగంతో
నాన్న నీడలో 
తోబుట్టువుతో తీపిగా
పుట్టి పెరిగినవాడిని
పరివార ప్రేమలలో
మన్నికగా మునిగి
భవ భావాజాల భావనలో 
స్వీయ కేంద్రీకృత సంచారిని..

అపేక్ష అలజడులు 
లేని లాలించే
అంతరంగానా ఆనందంగా 
ఆలోచనలను ఆలకిస్తు, 
అనుభూతులను ఆస్వాదిస్తూ 
ఆసక్తితో అక్షరాన్ని
అందుకుంటూ ఆసీనుడై 
ఆనందంతో అనుసంధానమై
రాస్తున్న రమణీయ 
లక్షణమైన లేఖ

నియంత్రణలేని నైరూప్యమైన 
అనాలోచిత అలజడులు
ఎలాగున్న ఎదురీదుతూ  ఏలుబడిగా
ప్రశాంత పలుకులతో
పరిసర ప్రపంచం
ప్రశాంతంగా ప్రమోదాన్ని
అందుకోవాలని ఆకాంక్షించేవాడిని.

కుటుంబంపై కొంత 
ఆధారపడిన, ఆపేక్షలు
అభ్యంతరాలులేనీ ఆలోచనల
స్థితిలో స్థిరంగా సాగుతూ 
పరస్పర ప్రశాంతత పొందుతున్న
భవ భావ బాటసారిని.

అతిథిగా 
మీరు నాకు 
నేను మీకు 
సముద్ర సమక్షంలో 
అడుగులోనే అక్కడ 
నిలబడి నిర్మలంగా 
చూస్తే చుట్టూ 
వు(ఉ)న్నా విశేష 
ప్రదేశ పరిధి 
అతిశయంగా అత్యంత 
విశాలంగా విసృతంగా 
ఉన్నతంగా ఉన్నట్టు
అనిపిస్తుంది. అలా
సంక్షిప్తంగా సంప్రాప్తించిన 
వ్యక్తుల విశేషాలు, విషయాలను 
ప్రశాంతత ప్రాప్తికై,
సానుకూల స్పూర్తికై
చెంత చేరుతాము‌.

అక్షరంలో అనతికాలం
చాలాకాలం చిరస్మరణీయంగా 
ఉండి ఉంటుంది.
అందుకని 
జ్ఞాపకంగా జ్ఞప్తి
చేసుకోవడానికి చిద్విలాసంగా
రచనలు రాస్తూన్నాను.
అద్భుతంగా అనిపించడానికి 
కవితగా కృతి
పరుస్తూ పరవశుడవుతున్నాను.

నన్ను నేను, నా
ఆలోచనల ద్వారా అంచనా
వేస్తున్నాను, కానీ వాస్తవంగా 
చర్యలే నా చరిత్ర/భవితన
నిర్ణయిస్తాయి.

💭⚖️🙂📝@🌳
📖14.04.2026✍️







కామెంట్‌లు

  1. భవ బాటసారి, బహు బాగు బాగు.
    చిరంజీవివై సదా చిన్మయానందంగా వర్ధిల్లు భార్గవ్ శ్యామ్.
    🙌🙌🙌🙌

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి