పోస్ట్‌లు

😮Blissful Birthday👍 (పరమానందమైన పుట్టినరోజు) లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Vamsi Annaiya (Telugu 21.03.2026

చిత్రం
⚛️🪷🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల అత్మజునిగా ఆనందనామ సంవత్సరంలో సంతసమైన పుత్రునిగా ఫాల్గుణ  శుద్ధ అష్టమి,  శుక్రవారం, ఆరుద్ర  నక్షత్రం నాడు  గూడూరు గడ్డపై పుట్టి  వరంగల్లు వంటి  ఊర్లలో ఉండి నెల్లూరు నేపథ్యంగా పెరిగి మద్రాసులో మొదటి  ఉద్యోగంలో ఉండి  విశాఖపట్నం వనిత కవిత(వదిన)ను కళ్యాణం చేసుకుని చక్కగా  అన్షు ఆర్యలకు  తండ్రివై, తోడుగా  తల్లి చెంత తృప్తిగా గడిపి గడించిన  జ్ఞాపకాలను జప్తుచేసి వృత్తిలో వృద్ధి చెందుతూ చక్కగా  భర్తగా భార్యకు అల్లుడిగా అత్తకు తనయునిగా తండ్రికి భవ్యంగా బాధ్యతలను నిర్వహిస్తూ నడుస్తూ "నిర్వహణ నక్షత్రం"  అయన అన్నయ్య...  "సానుకూల సాటి"గా  విషయ విజ్ఞానం,  విధేయత విధానం వినే విలువ,  ప్రశాంత పలుకులు,  సమగ్ర స్ఫూర్తి,  స్వతంత్ర స్వరం, పోడుగైన పోందిక,  పాకశాస్త్ర ప్రావిణ్యం  కలిగి కదిలే  అన్నయ్య  మనం మౌనంగా  ఆపేక్షలేని అంతరంగాన  నైరూప్యంగా నిర్విరామంగా  ఒకరికి ఒకరం ఆలోచనల్లో అనుసంధానం అయ్యే అన్నదమ్ములం. నాలోన లోలోన...

Chandu Mama (Telugu 23.02.2026)

చిత్రం
⚛️🪷🌳  నిదానమైన  నిర్మాణాత్మకంగా  నడుస్తూ నిలిచి, మాటల మాటున మేధోమథనంతో  మెదులుతూ మెరిసే మామయ్య మీరు .... తల్లితండ్రులకు  తేలికైన తనయుడిగా తమ్ముడికి తోడుగా చెల్లికి చక్కగా  ఆదర్శమైన అన్నయ్యగా అనువైన అర్ధాంగికి  అనుగుణంగా అడుగులేస్తూ, పెద్దనాన్నగా పుత్రులకు  ప్రేమ పెంచుతూ, మేనల్లుడ్ల ముందు  మధురమైన మేనమామగా ఉంటూ ఉన్న  చందుమామకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖23.02.2026✍️ "All Humans are Potentially Unique" Chandu Mamaiya,  You manifested-(ing) your specialty with  Analytical thoughts, Diplomatic words and Calm actions,  with these characteristics in your unique style  You became an influential (Special) person.  💭⚖️🙂📝@🌳 📖23.02.2019✍️ https://bharghavashyam.blogspot.com/2023/02/chandu-mamaiya.html ⚛️🪷🌳 "మానవులందరూ వారి శైలిలో వారు ప్రత్యేకమైన వారు" చందు మామయ్య  మీరు మీ జీవిత ప్రక్రియలో  విశ్లేషణాత్మక ఆలోచనలు,  దౌత్య పదాలు మరియు  ప్రశాంతమైన చర...

Shripad (Telugu 12.02.2026)

చిత్రం
⚛️🪷🌳   'చంద్ర రమ'ణీయ తల్లి తండ్రులకు కనిష్ట కుమారుడివై పెద్ద పుత్రునితో సమానంగా సంకల్పంగా లౌక్య లయతో ధైర్యం ధారణజేసి బాధ్యతల బరిలో  దిగి దూసుకుపోతూ ఉంటూ, ఉమ్మడిగా  కుటుంబంలో కలిసి కుటుంబానికి కవచంగా  సాగుతున్న శ్రీపాద  మహిదరుకు మోహనమైన హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖12.02.2026✍️

Subbarao Mamaiya (Telugu 10.02.2026)

చిత్రం
⚛️🪷🌳  పరిపక్వత పండిన  ప్రస్తుత పాతపాటి  ప్రియమైన పెద్దవారు" కోమల కాఠిన్యం,  లౌకిక లయ,  సమతుల్య స్థిరత్వం సమయ స్ఫూర్తితో గుణ గంభీరంగా  హుందాగా హుషారుగా   సాగే సుబ్బారావు  మామయ్యకు మనసారా  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖10.02.2026✍️

Hymavathi Nannamma (Telugu 09.02.2026)

చిత్రం
⚛️🪷🌳  ప్రపంచమే గ్రామం అవుతున్న అప్పుడు గ్రామమే (ఇల్లే) ప్రపంచంగా  భావించి భవ్యంగా నిలయంలో నిత్యం  నిలిచి నిలకడగా  పాకశాస్త్రంలో ప్రావిణ్యం  పొంది, ప్రతిభగా ప్రతి పూట  వంటల వ్యాపకాలతో గడిపే గృహస్థురాలుగా పుత్రపుత్రిక పౌత్రులకు ఇంటి వద్ద ఇష్టంగా  ఆనందంగా ఆరగించే ఆహారం అందించి ఆనందించే అన్నపూర్ణ  నిరవధికంగా నిత్యం  మెదడుకు మేతమైన పద వినోదినితో ప్రశాంతంగా పరవసిస్తూ హైమావతి నాన్నమ్మకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.02.2026✍️

Dhruthi Sri Birthday (Telugu 31.01.2026)

చిత్రం
⚛️🪷🌳  పరవళ్ళుగా పారే పసి ప్రాయపు  పరమానందాన్ని పరిధిలోని ప్రతి ప్రపంచానికి  పారవశ్యంగా పంచే  విశదమైన విశేష  శైశవ శక్తితో ఉండి ఉన్నతంగా  ఆకర్షించే అస్తిత్వం ధృతిశ్రీ‌ నీ పరమానందం  మాలో ప్రసారమవ్వాలని పరమాత్ముని ప్రార్థిస్తూ హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖31.01.2026✍️ ------------ నిర్మలమైన నారాయణుని, అరుణాచల (రమణ), ఆదిశేషుని,  నయన నీడలో నవ్వుతూ  నిండుగా నడిచిన నానమ్మ శతజయంతి నాడు నివాళర్పిస్తు........  జనవరి 31న జన్మించిన నిర్వికల్పమైన నానమ్మ  నిర్మలమైన నాన్న  మధురమైన మేనకోడలు ధృతిశ్రీ,  ముగ్గురికి మనసారా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు ------- నానమ్మ దివ్య అస్తిత్వాన్ని అంతర్లినం చేసుకొని నానమ్మ జన్మించిన తేదీ నాడే జన్మించిన  నానమ్మ వారసుడు నాన్నకు మరియు  నాన(మ్మ) ముని(మనవరాలు) అయిన  నా మేనకోడలు ధృతికు జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖31.01.2026✍️

Nannamma (Telugu 31.01.2026)

చిత్రం
⚛️🪷🌳 కనుపూరు కొలను  వద్ద విలక్షణంగా  సైకతలింగం సృష్టిస్తూ  శివారాధనను శ్రేయస్కరంగా చేస్తూ చక్కగా  కుశలంగా కపాల మోక్ష మార్గంలో పయనించిన పాతపాటి  లక్ష్మీ నరసయ్యను  గొప్పగా గౌరవిస్తూ  వెంకట నరసయ్య మహాలక్ష్మమ్మ  దంపతులు దివ్యంగా భావిస్తూ భాగ్యంగా పుత్రికకు పితృదేవుని  పేరుతో ప్రీతిగా  లక్ష్మీనరసమ్మ  పేరు పెట్టిన పెంచిన తల్లితండ్రుల ఆశల ఆకారమైన  తాదాత్మ్య తనయ పద్నాలుగేళ్ళ ప్రాయంలో ఆమంచర్ల ఆదిశేషునితో కమనీయంగా కళ్యాణంతో కలిసి కదిలి  ఇల్లాలుగా ఇంట్లోకి  ప్రవేశించి ప్రశాంతతతో భరోసాగా భర్త వృత్తిరీత్యా విస్తృతంగా    పయనించిన ప్రదేశాలలో   బాసటచ్చిన భార్య పుత్రులు పుత్రికలు  సప్త (షట్) సంతానానికి తల్లిగా తత్వాలతో ప్రయోజకులుగా పెంచి పిల్లలకు ప్రేరణైన మంచి మాత నియమ నిర్వహణ పరోపకార ప్రేమాభిమానాల ఆధ్యాత్మిక ఆలంబనలతో ఆనందరూపినిగా అజాతశత్రువైన  గొప్ప గృహలక్ష్మి కడకు కడపలో  రామ నామంతో రామ నాథునిలో సంగమించిన సాధ్విమణి శోభమైన శతజయంతి  (1926-2026) సందర్భంగా స్మృతిలో  లక్షణమైన లక్ష్మీ  నర...

Sudha Atta (Telugu 04.01.2026)

చిత్రం
⚛️🪷🌳   తల్లిగా తనయులతో తృప్తిగా తల్లి & తమ్ముడుతో తీపిగా, మరదలితో మందహాసంగా, అత్తవై అల్లుడ్లతో  అట్టహాసంగా   హుషారుగా, హార్దికంగా వున్న వ్యక్తిత్వం. సాంప్రదాయ సంస్కృతి  స్మృతిలో స్ఫూర్తిగా  తీర్థయాత్రలతో తాదాత్మ్యంగా  తిరిగే తారా   వస్త్ర వైఖరి వ్యాపారంలో  స్వయం సమృద్ధిగా  సాధికార స్వావలంబన  సాధించిన సాధ్వి  ఆధునికత ఆనందాన్ని  విస్తృత విశాల  ధృడ దృక్పథాన్ని అందుకున్న అత్తకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳 📖04.01.2026✍️

Jyothi Akka Birthday (Telugu 27.12.2025)

⚛️🪷🌳  పెద్దనాన్న పెద్దమ్మల కనిష్ట కుమార్తెగా  నెల్లూరు నేపథ్యన  జన్మించిన జ్యోతక్క తల్లిదండ్రులతో తూర్పుగోదావరి  జిల్లాలకు జాగ్రత్తగా  చిద్విలాసంగా చేరి గోదావరి గలగలల రాజమండ్రిలో రూపాంతరం చెంది చక్కగా  విద్యా & వృత్తిలో  వడివడిగా వృద్ధి అవుతూ, ఆతర్వాత  కడపకు కదిలి ఉపాధ్యాయురాలుగా ఉంటూ కుదురుకున్న కాలంలో హైదరాబాదులో హృద్యంగా  శంకరమఠంలో శుభశకున  సమయాన, స్వామి సమక్షంలో  భవ్యంగా భావించి  నిశ్చయమైన నిశ్చితార్థంతో నెల్లూరు నేలపై హాయిగా హరి బావతో కళ్యాణంతో  కలిసి భాగ్యనగరంలో భార్యాభర్తలుగా చేరి చక్కగా సాయిముకుంద్ శ్రీలహరి  సంతానంతో సానుకూలంగా  జీవిస్తున్న జ్యోతక్కకు  పుట్టినరోజు పండుగ  శోభనమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.12.2025✍️

Ravi Agraja's Birthday (Telugu 29.11.2025)

చిత్రం
⚛️🪷🌳 ప్రభాకరుని ప్రకాశం వసుమతి వర్చస్సులతో దంపతులకు దివ్య సంతానంగా సాధికారికంగా  నాగపూర్ నందు పుట్టి పెరిగి స్నేహితుడి సాంగత్యంలో  వివేకానంద కేంద్రకు క్రమంగా వస్తూ ప్రయత్నాలు, పద్ధతులకు ఆకర్షితుడై అంతర్లీనం  చేసుకుని, చేరి  నియమాల నిర్ణయంతో క్రమశిక్షణా కార్యదక్షుడివై బహు భాషావేత్తవై సుసంపన్నమైన సానుకూలతతో సైనికుని సౌష్టవం మానసిక నిపుణుడి మది కలిగి కోమల  పరిపక్వత ప్రయత్నాలతో పౌర ప్రజలకు  సున్నితులకు, సంపన్నులకు దగ్గరవుతూ దిగ్విజయంగా  వివేకానంద కేంద్రను వివిధ క్షేత్రాల్లో విస్తరణకు కీలకంగా ఉంటూ ఉన్నతంగా ఆజానుభాహుడిగా అజాతశత్రువై అందరివాడిగా అందనివాడిగా చిద్విలాసంగా చిరస్మరణీయంగా రాణిస్తున్న రవి అగ్రజులకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖29.11.2025✍️ x

2) Swarna Atta (Telugu 09.10.2025)

చిత్రం
⚛️🪷🌳  ఇంట్లో ఇల్లాలుగా పాఠశాల ప్రదేశంలో ఉపాధ్యాయురాలిగా ఉండి ప్రశాంతతను పండించిన  కమలతత్వ కోమల కాంత. గురువుగా గృహస్థిరాలిగా సంక్షేమాన్ని సంకల్పించి అన్నింటితో అనుసంధానమై  సాంఘిక శాస్త్రంలో  విద్యార్థి, విద్యార్థులను, సపరివార సంధాన సారధిగా అందరికి ఆనందాన్ని అందించి కొవ్వొత్తిలా కరిగి  కర్తవ్యాల కాంతి ప్రసరింపచేసిన ప్రకాశాన్ని   అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు. స్వర్ణ కమల లక్షణాలు కలిగిన  రాజహంస స్వర్ణత్తకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖09.10.2023(5)✍️ https://bharghavashyam.blogspot.com/2023/10/swarnaatta.html?m=1

2) Kirana Akka Birthday (Telugu 05.10.2025)

చిత్రం
⚛️🪷🌳  రాఘవేంద్ర పెద్దనాన్న  రాజేశ్వరి పెద్దమ్మల  పెద్ద పుత్రికగా  నెల్లూరు నేపథ్యమున పుట్టి పెరిగి మోహనుని మనువాడి మురిపెంగా ముగ్గురు  కూమారిలకు కన్నతల్లివై కళలతో కదిలించిన కాంత,  కాంతి కిరణం  కిరణక్కను కవిత్వంతో  కీర్తిస్తూ.....  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖05.10.2022(5)✍️ https://bharghavashyam.blogspot.com/2022/10/kirana-akka-blissful-birthday.html

Priya Akka Birthday (Telugu 13.09.2025)

చిత్రం
⚛️🪷🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల పెద్ద పుత్రికగా భాద్రపద బహుళ  నవమి నాడు  నెల్లూరు నేపథ్యంగా పుట్టి పెరిగి నాగప్రియదర్శిని నామంతో  ఆరుద్రనికి అక్కగా  ఆమంచర్ల ఆడపడుచుగా మలిగి, ముంగమూరి కోడలిగా కదిలి  శాండిల్య శకంలో కుదురుకొని కష్టార్జితంతో విప్రో వ్రుత్తిలో చక్కగా చేసి ఆక్సెంచరుకు మారి అమెరికాకు మాకం  మార్చి, మెరుగై స్వదేశానికి సాగి బెంగళూరులో బావతో కైరాతో కుతూహలంగా పరవశిస్తున్న ప్రియక్కకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 13.09.2025 ✍️

2) Raghavendra PeddaNanna Birthday (Telugu 27.08.2025)

చిత్రం
⚛️🪷🌳 వినాయక చవితి నాడు  విఘ్నేశ్వరుని చల్లని నీడలో  తిథితో తాదాత్మ్యంగా పుట్టినరోజు పర్వదినం  జరుపుకుంటున్న జ్యేష్ఠపితా  పలుకూరి పెద్దవారు  పాతపాటి పెద్ద అల్లుడు ఉత్తమ ఊత ఉన్నత ఉద్యోగి  "క్రమశిక్షణ కాంతి కిరణం" "సనాతన సంప్రదాయ సహవాసి" రాఘవేంద్ర పెద్దనాన్నకు రచనతో హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.08.2025✍️

3) Srilekha Akka Birthday (Telugu 23.08.2025)

⚛️🪷🌳 నెల్లూరు నివాసంగా ప్రాథమిక పాఠశాల విద్యను వంటపట్టించుకుని ఉన్నత విద్యకై  ఊరిని వదిలి చెన్నైలో చదువుకొని  ఎగిరి ఎదిగి  ఉన్నత ఉద్యోగం  చక్కగా చేస్తూ  బెంగళూరులో బసచేస్తూ  ఆమంచర్ల ఆడపడుచు దూపగుంటకు దగ్గరై  ప్రసాద్(బావ)ని పెళ్లి  చేసుకుని చక్కగా  అద్వైత స్మరణతో ఆనందంగా సాగుతున్న  శ్రీలేఖక్కకు   పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖21.08.2025✍️

1) Rajeshwari Pedda Amma (Telugu 10.05.2025)

చిత్రం
⚛️🪷🌳 పాతపాటి నుండి పలుకూరికి పెళ్లితో పయనమైన  భర్తకు భరోసాగా,  పుట్టింటికి ప్రాముఖ్యతనిస్తూ పుత్రికలను పరివారాన్ని ప్రవృత్తిని  అద్భుతంగా అనుసంధానం చేసి  కిరణక్క కల్పనక్కలకు  విద్య వికాస విషయాల వంటి వాటిలో శిక్షణ ఇస్తూ, శిక్షకురాలిగా విశేషమైన వృత్తిలో విద్యార్థులకు  ఉతంగా ఉంటూ ఉన్నతంగా  పాఠశాలలో పాఠాలతో  విషయాలను విశేషంగా  నేర్పించి నేపథ్యాన్నందించి ప్రేరేపించిన పెద్దమ్మ  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖10.05.2025✍️

Prakash Mamaiya Birthday (Telugu 19.01.2025)

⚛️🪷🌳 నాస్తిక నేపథ్యం కలిగిన కానీ, కరిగి కడకు  ఆధ్యాత్మిక ఆలంబనగా  ఆనందాన్ని ఆవాహన  చేసుకున్న చక్కని హైందవ హుందాతనం కోమల కాఠిన్యం  కలిగి కృపచుపే  కిరణం *కరణం...* ప్రేమ ప్రేరణ  పొందుపరిచిన  ప్రశాంత *ప్రకాశం...* *ప్రకాష్ మామయ్య*కు  హార్థిక హృదయపూర్వక పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖19.01.2025✍️ https://bharghavashyam.blogspot.com/2023/01/prakash-mamaiya.html

2) Abigyna-Amukta (Telugu 30.12.2024)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము మోహన కిరణాల క్రాంతి మీమాంసతో  సుమధుర సాహితీ సాంస్కృతిక స్ఫూర్తితో అభిజ్ఞానశాస్కుంతలం ఆముక్తమాల్యదల నేపథ్యంతో నామకరణం  జరిగి జాబిల్లిలా  చిగురించిన చిన్నారుల్లారా,  చక్కగా చదువుతూ చల్లని చిద్విలాసంతో  అంతర్శక్తి అభివ్యక్తీకరణతో  ఆసక్తులను ఆస్వాదిస్తూ,  అనంతమైన ఆనంద  అనుభవాలతో అనుసంధానం  అవ్వాలని ఆకాంక్షిస్తూ,  పసి పిల్లలు కవల కోడల్లకు హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభప్రద శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖30.12.2024(23)✍️   https://bharghavashyam.blogspot.com/2023/12/abigyna-amukta-telugu-1.html

2S) Dhruva Birthday (Telugu 27.11.2024)

చిత్రం
⚛️🪷🌳 అప్పటి చిన్నపిల్లలలో చిన్నవాడు  ఇప్పటి చిన్నపిల్లలలో పెద్దవాడు  అయిన ధృవుడికి ఆనందంగా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభప్రద శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.11.2024✍️

2) Adi Sheshaiya Tataiya Birthday (Telugu 27.11.2024)

చిత్రం
⚛️🪷🌳 దైవభక్తి దీర్ఘదృష్టి  దయాగుణం  ధారణాగావించిన ధీరులు దైవం దీవించబడిన దీర్ఘాయుష్మంతులు  పుత్రులు ప్రౌత్రులు  పుత్రికలు పౌత్రికలను ప్రేమ పెద్దరికంతో  పరివార పరిధిని  ప్రేమించి పాలించిన  ప్రియమైన పెద్దవారు కుటుంబంలో కురువృద్ధుడిగా  కాలంతో కొనసాగిన కాంతి కోవిదుని జననంతో కనకాభిషిక్తుడైన అన్నపూర్ణమ్మ పుత్రుడు,  ఆదిశేషయ్య పితామహుడిని జన్మదిననా స్మరిస్తూ 🙏 💭⚖️🙂📝@🌳 📖27.11.2024✍️