APU Alumni (Telugu 29.03.2026)
⚛️🪷🌳
విశ్వవిద్యాలయం వారు
ఉన్నత ఉద్దేశాలతో,
నిండైన నిధులతో
ఏకమయ్యేందుకు ఏర్పాటుచేసిన
సమ్మేళనంలో సంతోషంగా
విచ్చేసిన విద్యార్థులు
ఆచార్యులు, అందరం
కలిసి కాలక్షేపం,
విలక్షణమైన విశ్లేషణలు
సరికొత్త సంపర్కాలు,
సంబంధిత సంభాషణలు
చక్కగా చేసుకుని
చక్కని చిత్రాలు
తీసుకొని, తీపి
జ్ఞాపకాలను జ్ఞప్తికి
తెచ్చుకొని తృప్తిగా
మళ్ళీ మా
మార్గంలో మమేకమయ్యాము
💭⚖️🙂📝@🌳
📖 29.03.2026 ✍️

Wah Mama
రిప్లయితొలగించండి👏
రిప్లయితొలగించండి♥️
రిప్లయితొలగించండి