On K9-DM Course Experience (Telugu 15.04.2026)

⚛️🪷🌳

కేరీర్-9 కాలంలో 
నేను నేర్చుకున్న 
అంకాత్మక అమ్మకాల
ప్రచారం, ప్రచురణ 
విషయాలు ఎలా వు(ఉ)న్న 
నిశ్శబ్దంగా నిర్మలంగా 
 వృత్తిపరంగా కన్న కొంచెం వ్యక్తిగతంగా
మీరందరి నుంచి నా మదిలో 
అందుకున్న అనుభూతులు 
అసాధారణంగా అనిపించింది.

విస్తృత విశాల
అనుభవాలు అందుకుని
పరిణితి చెంది పరిపక్వతతో
నైపుణ్యాలు నేర్పే
ఆసక్తి గల అధ్యపకురాలిగా
లక్షణమైన లక్ష్మిగారి
విద్యార్థి విద్యార్ధినిలుగా....
వచ్చిన విషయాలను 
మరింత మెరుగుపరచుకొన్న
నేపథ్యంతో నేర్పుగా 
సాయి శామ్యూల్
ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు
త్వరితగతిన తరగతి 
పాఠాలను పాటిస్తూ 
సాధన చేసే శివ,
పెళ్లై పెద్దవారిగా
పతి, పిల్లల
భవ బాధ్యతలను
నేరవేరుస్తూ, నైపుణ్యాలు 
నేర్చుకునేందుకు, నిండైన 
హృదయంతో హాజరైయ్యే
స్వాతి సంధ్య 
నియతి రాజ్యలక్ష్మి గార్లు...
వృత్తి వృద్దికై వచ్చిన 
రమ్య రింకీ...
అందరు ఆనందంగా 
భవిష్యత్తుకై భరోసాగా 
ఆశ ఆశయాలతో 
సిద్ధమై సానుకూలతతో 
హార్దికంగా హాజరవుతూ 
నేర్చే నైపుణ్యాలను,
అప్పటికప్పుడు ఆరోజే
సాధన సే(చే)స్తూ 
పాఠాలను పాటిస్తూ 
కృషిగా కష్టపడి
నైపుణ్యాలు నేర్చుకున్నారు.

అందరికీ అభినందనలతో
భవిష్యత్తు భవ్యంగా 
అందాలని ఆకాంక్షిస్తున్నాను 

💭⚖️🙂📝@🌳
📖15.04.2026✍️







ప్రస్తుతం, పత్రికలో 
ఉన్న ఉద్యోగం
వల్లనో లేక ఉండేదాంట్లో
సంతోషంగా సర్దుకుంటూ 
వస్తుండడం వల్లనో
నాకు నేర్చుకునే
ఆసక్తి తక్కువై అందుకోలేకపోయాను. 
అనుకున్నది అవ్వకపోయినా
కానీ కొంత
సహావాస సాంగత్యం
వల్ల నాలో విలువైన
నైపుణ్యాలు కొంచెం నిండాయి.
అతిరథుడిని కాను 
అధముడిని కాను 
కానీ, అందరిలా 
ప్రత్యేకమైనవాడిని
అనే ఆసక్తికరమైన 
స్పూర్తితో సానుకూలంగా 
సాగుతూ సంతసంగా
ధృఢంగా ధన్యవాదాలు 
చెబుతున్నాను.
💭⚖️🙂📝@🌳
📖15.04.2026✍️




Comments

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Pallavi Birthday Wishes (23.08.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)