పోస్ట్‌లు

తత్వం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

World Environment Day (Telugu 05.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 మన ముందు  కనిపిస్తూ కనిపించకుండా, ప్రాణంతో, ప్రాణరహితంగా ప్రాణులు పదార్థాలు ప్రకృతిలో పాలుపంచుకున్న జీవులు: వృక్షాలు, జనాలు, జంతువులు,  నిర్జీవులుగా నిండున్న  ఘన ద్రవ వాయు  రూపాలలో రాళ్లు ఖండాలుగా ఖనిజాలు  రసాయనాలు,  ఇంధనం ఇలా ఉండి ఉన్న  సకల సమ్మేళనం పర్యావరణం. పర్యావరణంలో ప్రధానంగా పంచభూతాలు  (నింగి, నేల,  నీరు, నిప్పు,  వాయువు) వున్నాయి.  దాని ద్వారా  విభాగాలుగా వున్న “వాతావరణం (వాయువు),  జీవావరణం (జీవులు)  జలావరణం (జలం)  శిలావరణం (భూమి)” నాలుగు నిశ్చయంగా  అంతర్లీనంగా అంతర్భాగం  అయ్యాయి.  పర్యావరణంతో ప్రజలు పాలుపంచుకుంటూ పరస్పరం  ప్రయోజనం పొందుతూ వస్తున్న వేళ,  పర్యావరణంలో భాగమైన ప్రజలు  పర్యావరణాన్ని విడి భాగంగా ప్రజలు పర్యావరణాన్ని పరికిస్తూ.. ప్రయోజనాలు అధికంగా  ప్రయాసలు అత్యల్పంగా  ఉంచాలనుకునే ఉద్దేశంతో  మానవ మేధస్సు పర్యావరణంలోని పదార్థాలను  పరాక్రమంతో, ప్రయోగాలతో అనుకూలంగా అన్వయించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉత్తమ ఫలితాలు,   అందుకుంటోంది....

May Day (Telugu 01.05.2026)

చిత్రం
  ⚛️🪷☀️🍃@🌳 ముందుగా ఉద్యోగస్తులు కూడా కార్మికులే అనే విషయాన్ని తెలియజేయాలని అని అనుకుంటున్నాను. ఈనాడు ప్రతి ఉద్యోగస్తుడు అనుభవించే వారాంతర సెలవులు, 8 గంటల పని, గౌరవ వేతనాలు ఇంకా సంస్థ, అదనపు ప్రయోజనాలు (రవాణా, భోజనాలు వగైరా), భత్యాలు, ఇంకా సంస్థ, ప్రభుత్వం అందించే సంక్షేమాలు (ఆరోగ్యం మొదలైనవి) ఇవన్నీ అనేక దేశాల్లో, అనామకులైన లక్షలాది కార్మిక స్త్రీ పురుషులు, కమ్యూనిస్టులు, తదితరుల నిరంతర పోరాటంతో  లభించినవి.  ఈ విజయాలు ఏ ఒక్కరో ఒక్క  సంస్థ నో సాధించినవి కాదు. అది మార్క్స్ గానీ,  కమ్యూనిస్టు పార్టీ గానీ ఇలా ఒక్కరికి లేదా ఒక్క సంస్థకు మాత్రమే కట్టబెట్టలేము. అలా చేయడం అనేది కార్మికుల సమిష్టి త్యాగాన్ని ఒకరికి పరిమితం చేసినట్లు అవుతుంది. కార్మికులు కాలంలో కలిసున్న కరుణా కాఠిన్యాలతో కడలిలో కదులుతూ  కష్టం కొట్టినా,   కరుణ కురిసిననా కళ్ళు కాంతినన్వేషిస్తూ కమనీయ కలలు కంటూ కాళ్లతో కదులుతూ  కట్టే కట్టడాలు కృషిగా కనిపిస్తాయి. ఉన్నత ఉద్యోగస్తులు  కూడా కార్మికులే, అందరూ అనుభవించే సంతోష వారాంత సెలవులు పద్ధతిగా 8 గం.ల పని, గౌరవ వేతనంగా గణమొత్తం ...

Earth Day (Telugu 22.04.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳   భవ్యమైన భావనలతో భీషణమైన భూమికతో భూమి(తన)లో భాగమైనవారిని భవదీయులుగా భావిస్తూ భూస్వామిగా భిక్షగాకాక భూదాతగా బాసటగా బాధ్యతతో భారీవి బలమైనవి బలహీనమైనవి భరిస్తూ బంధాలకు బాసటై బహుళ బృందావనాలనను బహుమతిస్తూన్న భూమికి భావనలమాల అ'భి'వ్యక్తీకరిస్తున్నాను దివ్యమైన ధరిత్రి ధార్మిక ధోరణితో దయగల దీప్తిగా దిగువ దారిచూపిస్తూ దప్పిక తీరుస్తున్న ధరణికి ధన్యవాదాలు 💭⚖️🙂📝@🌳 📖22.04.2026✍️

3) On Indian Railways (Telugu 16.04.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳   దేశంలోని దిశలన్ని  సమైక్యత సిద్ధాంతంతో  సంస్కృతుల సంగమంతో కలిపే కీలకమైన  విశేష వ్యవస్థగా భారతీయ రైల్వే  ఇంకా ఇది  సంప్రదాయ సాంకేతికతను,  సాధారణ సంపన్నులను సంధానిస్తూ సాగుతూ  సంకీర్ణంలో సమతుల్యంతో   సమాజ సౌలభ్యానికి సాధికారత సాధించిన సమగ్ర సంకల్పం సామాజిక సేతు  భవదీయ రాగం  భారతీయ రైల్వే  భారతీయులందరికి భారతీయ రైల్వే  దినోత్సవ శుభాకాంక్షలు రమణీయ రైల్వే దీర్ఘమైన దారిలో సుందర సోయగాలలో మార్గాన్ని మలుచుకొని ప్రకృతి పరిసరాలలో  ప్రాంతాలును పర్యటించే  ప్రయాణికుని ప్రయాణం  ప్రహ్లాదంతో ప్రమోదం.....   --------------- వివిధ సమయాల్లో  వివిధ స్థలాల్లో  రాష్ట్రాల రాజధానులు &  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.లో ఉన్న  జిల్లాల ప్రధానకేంద్రాల్లో జ్ఞాపకంగా  తీసుకున్న తీపి  చిద్వివిలాస చిత్రాలు 💭⚖️🙂📝@🌳  📖16.04.2023(4&6)✍️

Self Letter (Telugu 14.04.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳   నాలో నేను నాతో నేను  పరిధి అత్యల్పం  కావచ్చు కానీ  పరిధిలోని ఆలోచనలను వాస్తవంగా వ్రాస్తున్నాను అతిరథుడిని కాను అధముడిని కాను  అందరిలానే  ప్రత్యేకమైనవాడిని‌. అమ్మ అనురాగంతో నాన్న నీడలో  తోబుట్టువుతో తీపిగా పుట్టి పెరిగినవాడిని పరివార ప్రేమలలో మన్నికగా మునిగి భవ భావాజాల భావనలో  స్వీయ కేంద్రీకృత సంచారిని.. అపేక్ష అలజడులు  లేని లాలించే అంతరంగానా ఆనందంగా  ఆలోచనలను ఆలకిస్తు,  అనుభూతులను ఆస్వాదిస్తూ  ఆసక్తితో అక్షరాన్ని అందుకుంటూ ఆసీనుడై  ఆనందంతో అనుసంధానమై రాస్తున్న రమణీయ  లక్షణమైన లేఖ నియంత్రణలేని నైరూప్యమైన  అనాలోచిత అలజడులు ఎలాగున్న ఎదురీదుతూ   ఏలుబడిగా ప్రశాంత పలుకులతో పరిసర ప్రపంచం ప్రశాంతంగా ప్రమోదాన్ని అందుకోవాలని ఆకాంక్షించేవాడిని. కుటుంబంపై కొంత  ఆధారపడిన, ఆపేక్షలు అభ్యంతరాలులేనీ ఆలోచనల స్థితిలో స్థిరంగా సాగుతూ  పరస్పర ప్రశాంతత పొందుతున్న భవ భావ బాటసారిని. అతిథిగా  మీరు నాకు  నేను మీకు  సముద్ర సమక్షంలో  అడుగులోనే అక్కడ  నిలబడి నిర్మలంగా  చూస్తే చ...

Health Day (Telugu 07.04.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 అమూల్యమైన ఆరోగ్యం  అపురూపమైన ఆస్తిగా అందరికీ అందింది.  ఆరోగ్యాన్ని అలానే  అంటిపెట్టుకోవడానికి  ఆసక్తిగా అలవాట్లతో ఆహారం, ఆహ్లాదంతో అనుసంధానమై అందరూ  ఆనందాన్ని అందుకోవాలని  ఆకాంక్షిస్తూ అక్షర ఆకారంలో  ఆలోచన అనుభూతిని  అభివ్యక్తీకరిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖07.04.2026✍️

On Facebook- Reflection (Telugu 04.02.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳   ఈరోజు ఫేసుబుక్ ప్రారంభమైన రోజు. ఈ ఫేసుబుక్ నాకు ఒక వార్తాపత్రిక మరియు దైనందిని. ఇంకా విశ్లేషిస్తూ తాత్వికంగా చెప్పాలంటే నాలోని కవిని రచయితను బహిర్గతం చేసే ఒక బంగారం గని లాంటిది.  ఈ ఫేసుబుక్ (వాట్సాప్) నేను రాసిన ఎన్నో సానుకూల రచనలు, కవితలకు వేదికగా ఉంది. నా రచనలకు వెచ్చించిన సమయం కంటే, వృధా చేసిన సమయమే ఎక్కువ. వృధాను ఆపేస్తే విలువైన విశేషమైనవి రావు అనిపించింది.  బంగారం కోసం తవ్వినప్పుడు ముడి సరుకును బయటికి తీస్తాము, దానిలో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన స్వర్ణం తయారవుతుంది.‌ ముడి సరుకు లేకుండా బంగారం రాదు, కాబట్టి బంగారం కోసంగా ముడి సరుకును (వ్యర్ధాలను) తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేసి స్వచ్ఛమైనది తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాల నుంచి మంచి పొందాలంటే దుర్ఘుణాలను స్వీకరించి వదిలేయాలి.  బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటిని సాధించాలని ఉంది. 💭⚖️🙂📝@🌳 📖04.02.2026✍️  

Republic Day (Telugu 26.01.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳   స్వాతంత్రం సాధించిన  సాధికారతతో సార్వభౌమత్వానికి  స్ఫూర్తిదాయక సమర్పణ..  రాజసమైన రాజ్యాంగం అమలులోకి ఆసన్నమైన  తాత్విక తరుణం  ఘనమైన గణతంత్రం గర్వించదగ్గ గొప్ప  గణతంత్ర గుణం  గుర్తింపు గౌరవం  సమగ్రత స్వతంత్రం  రక్షించే రాజ్యాంగం  అందరికీ  గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖26.01.2026✍️ ✍️ & 🖼️- ©️:   Bharghava Shyam https://bharghavashyam.blogspot.com/2023/01/republic-day.html

On Aesthetics by Metaphor (Telugu 30.12.2025)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 సాధారణంగా ఆభరణాలు అన్ని స్వర్ణంతో చేస్తారు, కొన్ని మాత్రమే ఇతర లోహాలతో చేస్తారు, లోహాల్లో కొన్ని స్వర్ణం కంటే ఉన్నతమైనవి, కొన్ని కావు. కానీ ప్రతి ఆభరణం విలువైనదే. ఆభరణాలు కొన్ని సాంప్రదాయంగా, కొన్ని ఆధునికంగా, కొన్ని సరళంగా, కొన్ని సున్నితంగా, కొన్ని స్థూలంగా, కొన్ని తేలికగా ఉంటాయి. ఇలా ప్రతి ఆభరణం ప్రత్యేకమైనదే.  దాదాపు అందరూ స్వార్జితంతో ఆభరణాలను పొందుతారు, ఇది చాలా మేలైన మార్గం, ఉత్తమమైనది. కొందరికి వంశపారంపర్యంగా లభిస్తుంది, ఇది వారి యోగ్యత ఆధారంగా ఉంటుంది. ఇది ఆమోద యోగ్యమైనది. కొందరు వేరే వారికి చెందిన దానిని తెలివిగా, ఒక రకమైన గౌరవంగా సమ్మతితో అనుభవిస్తారు అది వారి లౌక్యం, ఇది మధ్యమమైనది. కొందరు దౌర్జన్యంతో దోచుకుంటారు అది దోపిడి, ఇది హేయమైనది. ఎప్పుడైనా ఎక్కడైనా ఆభరణాలు సంస్కృతిని చాటడానికి, విలువను చూపించడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి, అందాన్ని పెంచుకోవడానికి, గౌరవాన్ని పొందడానికి, గొప్ప అనే గర్వాన్ని ప్రదర్శించడానికి, ఇలా కొన్ని కారణాలు చేత ఆభరణాలు ప్రదర్శనలలో ఉంచబడతాయి, అప్పుడు ఆ సమయంలో ప్రదర్శనకు ఉంచిన ఆ ఆభరణాలను ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది. కొన...

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

చిత్రం
⚛️🪷🌳 తల్లిభాషగా తేలికగా తనువులో తాదాత్మ్యంగా తేలి, తెలియకుండానే తళుక్కు తళుక్కుమంటు తీరుతో తీక్షణంగా తలపులు తెరిచి తొలిగా తేలికతనాన్ని తరువాత తాత్వికతను తీరుగా తెలియజేస్తూన్న తెలుగుకు తలవంచి తృప్తిగా తలుస్తున్నాను. తరతరాల తాత్విక తపస్సుతో తేజోమయమై తాత్వికంతో తడిసి  తారకమైన తీయని తల్లి తెలుగు 💭⚖️🙂📝@🌳 📖29.08.2025✍️ 2022 తెలుగు దినోత్సవం (గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగు వారి పాత్ర) గురించి రాసిన వ్యాసం https://bharghavashyam.blogspot.com/2022/08/blog-post_29.html

Poem on Past Memories (Telugu 22.07.2025)

⚛️🪷🌳  గడచిన గత క్షణాల కాలం మధురంగా మురిపించాయి,   అవి మళ్లీ మన ముందుకు  తిరిగి రావని తెలిసిన,  జ్ఞాపకాలు జ్ఞప్తికి  వచ్చినప్పుడు వచ్చే  భావనలు భలే ఊతంగా ఉంటాయి. ప్రస్తుతంలో వారు ప్రత్యక్షంగా  కనిపించినప్పుడు కలిగే భావనలు భవ్యంగా మనసుని మురిపెంగా  చల్లబరిచే చినుకులై   తడిపి తాదాత్మ్యం  చేసి చిద్విలాసాన్ని కమ్మగా కలిగిస్తాయి. 💭⚖️🙂📝@🌳 📖22.07.2025✍️ ------ మన జీవితంలో గడిచిన మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగా మన హృదయంలో పదిలంగా ఉంటాయి.  గత స్మృతులు భావోద్వేగాలను కేవలం నియంత్రించగలవు. కానీ ఆ భావోద్వేగాలకు సంబంధిత వ్యక్తులను ప్రస్తుతంలో కలవడం వల్ల మనసు సంతృప్తి పడుతుంది. ఆ ఆనందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శక్తి పొందాలని భావిస్తూన్నాను. 💭⚖️🙂📝@🌳 📖 22.07.2022 ✍️

2) World Listening Day (Telugu 18.07.2025)

చిత్రం
⚛️🪷🌳 వ్యక్తులు వినడం వలన వ్యక్తులు  విషయాలను  వ్యక్తపరుస్తారు  వినే వారు  వుండడం  వ్యక్తికి వరం. వినే వారు వుండడం వల్ల  వ్యక్తి వర్చస్సు వికాసంతో వృద్ధిలో  వుంటుంది.  వాయిద్యకారుల  వినసొంపైన వాద్యంవినడం  విశ్రాంతికి  విశేష విధానం. ప్రపంచ వినే దినోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖18.07.2025✍️

Lesson from Kohli (Telugu 11.07.2025)

చిత్రం
⚛️🪷🌳 విరాట్ కోహ్లీ విషయాలలోని వాస్తవికత, విజ్ఞానం, వినయం క్రికెట్టుకు మించి విశేషంగా ఉంది. దానిలోని సారాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోతారు. కానీ, మనం చేసే పనిని నమ్మకంగా, నిజాయితీగా చేస్తే, ఫలితం ఎలా ఉన్నా సంతృప్తి ఉంటుంది.  బాగా కష్టపడతాం, తర్వాత జరగవలసినవి జరుగుతాయి, కష్టపడి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో లేదు‌.  మనం ప్రతి సారి ఉత్తమ ప్రదర్శన చెయ్యడం సాధ్యం కాదు, దానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే ఎదుటివారికి బాగా రాణించాలనే ఆకాంక్ష ఉంటుంది, వారు చాలా కష్టపడతారు, వారికి కుటుంబం ఉంటుంది, వారికి స్నేహితులు ఉంటారు, వారు బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. వారు మనతో ఈ వేదికను పంచుకున్నారు, మనకు గెలవాలన్న ఆకాంక్ష ఎంత ఉంటుందో, వారికి కూడా అంతే ఆకాంక్ష ఉంటుంది. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు, ఒడుదుడుకులు ఉంటాయి, వారి స్థానం కంటే మన స్థానం గొప్పదనే విషయానికి ఎటువంటి హామీ లేదు. నిజానికి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న ఆ రోజు మన మ...

Doctor's Day (Telugu 01.07.2025)

చిత్రం
⚛️🪷🌳 వ్యాధి వేదనల వలలో వున్నప్పుడు వారితో  వెళ్లఋచ్చే వివరాలను  వారు వారి విశదమైన  విజ్ఞానంతో, వివిధ  వైద్య వస్తువులుతో విశ్లేషించి వెన్నుదన్నుగా  వ్యాధినిరోధకానికై వెల్లడించే వ్యాఖ్యాలు  వేదమై వుంటాయి. వ్యాధి వేదనల వేళ  వెలుగునిచ్చే వీరులు వైద్య వృత్తి వారు.  సంకట స్థితి  వచ్చే వరకు వారి వద్దకు వెళ్లకున్న  విపత్కర వేళ వెళ్ళిన వ్యాధిని నిరోధించి నిలువరించే  వైద్యులకు వందనాలు వైద్యం వ్యాపారమైన వాణిజ్యం విలువైనదైన లాభం, లాలన  వాత్సల్యం వున్న  వైద్యం వృత్తి వృద్ధిగా వెలుగుతూనే వుంది.  వైద్య వృత్తిలో వుండే వైద్యులకు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖01.07.2025✍️