పోస్ట్‌లు

మే, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

May Day (Telugu 01.05.2026)

చిత్రం
 ⚛️🪷🌳 ముందుగా ఉద్యోగస్తులు కూడా కార్మికులే అనే విషయాన్ని తెలియజేయాలని అని అనుకుంటున్నాను. ఈనాడు ప్రతి ఉద్యోగస్తుడు అనుభవించే వారాంతర సెలవులు, 8 గంటల పని, గౌరవ వేతనాలు ఇంకా సంస్థ, అదనపు ప్రయోజనాలు (రవాణా, భోజనాలు వగైరా), భత్యాలు, ఇంకా సంస్థ, ప్రభుత్వం అందించే సంక్షేమాలు (ఆరోగ్యం మొదలైనవి) ఇవన్నీ అనేక దేశాల్లో, అనామకులైన లక్షలాది కార్మిక స్త్రీ పురుషులు, కమ్యూనిస్టులు, తదితరుల నిరంతర పోరాటంతో  లభించినవి.  ఈ విజయాలు ఏ ఒక్కరో సాధించినవి కాదు. అది మార్క్స్ గానీ, అంబేద్కర్ గానీ ఇలా ఒక్కరికి మాత్రమే కట్టబెట్టలేము. అలా చేయడం అనేది కార్మికుల సమిష్టి త్యాగాన్ని ఒకరికి పరిమితం చేసినట్లు అవుతుంది. కార్మికులు కాలంలో కలిసున్న కరుణా కాఠిన్యాలతో కడలిలో కదులుతూ  కష్టం కొట్టినా,   కరుణ కురిసిననా కళ్ళు కాంతినన్వేషిస్తూ కమనీయ కలలు కంటూ కాళ్లతో కదులుతూ  కట్టే కట్టడాలు కృషిగా కనిపిస్తాయి. ఉన్నత ఉద్యోగస్తులు  కూడా కార్మికులే, అందరూ అనుభవించే సంతోష వారాంత సెలవులు పద్ధతిగా 8 గం.ల పని, గౌరవ వేతనంగా గణమొత్తం  అదనపు అనుకూలతలు సంస్థ/ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు ఇవన్నీ ఇల...