Ravinder Anna (Telugu 10.02.2026)

⚛️🪷☀️🍃@🌳

 బాల్యంలో బాగా 
ఆటలు ఆడుతూ 
చదువులో చురుగ్గా,
గణితంలో గణనీయమైన 
పట్టు పొంది 
కొంత కాలం 
సంధ్యా సమయాన 
ఉపాధ్యాయ ఉపాధిలో
ఆర్థిక ఆరంభం 
పొంది, పరివారనికి
ఊతంగా ఉన్నారు.

ప్రేమను పొందిన ప్రియుడై,
భర్తగా బాధ్యతలు
అందుకుని అర్ధాంగి,
కుమార్తెతో కుతూహలంగా 
ప్రణయ ప్రయాణకారి.

చిరంజీవిని చిరకాలంగా 
 ఆదరిస్తున్న అభిమాని.

'వార్త'లోకి వచ్చి,
ఆతర్వాత ఆంధ్రజ్యోతిలో
చేరి చక్కగా 
ప్రకటనలను ప్రణాళికాబద్దంగా 
పత్రికలో ప్రచురణకై 
సరళంగా సిద్ధపరుస్తూ
అభినందనలు అందుకున్న 
అధికారి.

పత్రికా పరిభాగాన 
ఏటా ఏర్పాటుచేసే
క్రికెట్టు క్రీడలో 
కీలకమైన క్రీడాకారుడిగా
విజయుడైన వారు. 

బహుళ బహుముఖ 
ప్రజ్ఞాశాలి ప్రతిభావంతుడు 
హుందాతనం హోదగల
రవిందర్ అన్నకు 
హార్థిక హృదయపూర్వక 
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖10.02.2026✍️




కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)