Ch.Rama Krishna (Telugu 13.02.2026)
⚛️🪷☀️🍃@🌳
ప్రకటనల పరిభాగం
ఆంధ్రజ్యోతిలో అందరికంటే
చిన్నవాడైన చదలవాడ
రామకృష్ణ, నిన్ను రామా
పిలుపుతో పిలిచి
పులకరించేడిని
గుంటూరు గడ్డపై
పుట్టి పెరిగి
చదువుకై చక్కగా
ప్రకాశంజిల్లా ప్రయాణించి
నెల్లూరు నేపథ్యంలో
ఉద్యోగంలో ఉండి
మహానగరం ముందుకు
వచ్చి వాలి
ఆంధ్రజ్యోతిలో అడుగుపెట్టి
ప్రవేశ పరీక్షలో
ప్రతిభ పాటవాలు
చూపి, చేరి చక్కగా
అంచనాలను అందుకుంటూ
ధృవీకరణలో ధృవీకృత
సంతకందారుగా సాగుతూ
నాణ్యమైన నాణెంలా
ఇరువైపులా, ఇరుగుపొరుగుకు
రమణీయత & రాటుతేలినతనం
చూపించే చతురుడివి,
వంకాయనే వూ(ఉ)తపదంతో
మాట్లాడే మాటకారివి.
కనుసన్నలతో కదిలించగలననే
నమ్మకంతో నడిచే వాడివి,
కాలానుగుణంగా క్రమపద్ధతిలో
వస్త్రాలు వరుసగా
ధరించేవాడివి,
నిగూఢంగా నిర్ణయాలు
తీసుకుని తెలియకుండా
అమలు చేసే అపరుడివి,
మచ్చికైన మరదలు
కుమారిని కలిసి
మృదువుగా మెలుగుతూ
నిశబ్దంగా నిశ్చితార్థం
చేసుకుని, చక్కగా
పెద్దల సమక్షంలో పెళ్లి
చేసుకొనే చలాకి
ప్రియుడైన ప్రియ
మిత్రుడా రామకృష్ణ మనసారా
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖13.02.2026✍️


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి