Self Letter (Telugu 14.04.2026)
⚛️🪷☀️🍃@🌳 నాలో నేను నాతో నేను పరిధి అత్యల్పం కావచ్చు కానీ పరిధిలోని ఆలోచనలను వాస్తవంగా వ్రాస్తున్నాను అతిరథుడిని కాను అధముడిని కాను అందరిలానే ప్రత్యేకమైనవాడిని. అమ్మ అనురాగంతో నాన్న నీడలో తోబుట్టువుతో తీపిగా పుట్టి పెరిగినవాడిని పరివార ప్రేమలలో మన్నికగా మునిగి భవ భావాజాల భావనలో స్వీయ కేంద్రీకృత సంచారిని.. అపేక్ష అలజడులు లేని లాలించే అంతరంగానా ఆనందంగా ఆలోచనలను ఆలకిస్తు, అనుభూతులను ఆస్వాదిస్తూ ఆసక్తితో అక్షరాన్ని అందుకుంటూ ఆసీనుడై ఆనందంతో అనుసంధానమై రాస్తున్న రమణీయ లక్షణమైన లేఖ నియంత్రణలేని నైరూప్యమైన అనాలోచిత అలజడులు ఎలాగున్న ఎదురీదుతూ ఏలుబడిగా ప్రశాంత పలుకులతో పరిసర ప్రపంచం ప్రశాంతంగా ప్రమోదాన్ని అందుకోవాలని ఆకాంక్షించేవాడిని. కుటుంబంపై కొంత ఆధారపడిన, ఆపేక్షలు అభ్యంతరాలులేనీ ఆలోచనల స్థితిలో స్థిరంగా సాగుతూ పరస్పర ప్రశాంతత పొందుతున్న భవ భావ బాటసారిని. అతిథిగా మీరు నాకు నేను మీకు సముద్ర సమక్షంలో అడుగులోనే అక్కడ నిలబడి నిర్మలంగా చూస్తే చ...