Posts

Showing posts from March, 2026

APU Alumni (Telugu 29.03.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 విశ్వవిద్యాలయం వారు  ఉన్నత ఉద్దేశాలతో, నిండైన నిధులతో  ఏకమయ్యేందుకు ఏర్పాటుచేసిన సమ్మేళనంలో సంతోషంగా విచ్చేసిన విద్యార్థులు  ఆచార్యులు, అందరం  కలిసి కాలక్షేపం, విలక్షణమైన విశ్లేషణలు  సరికొత్త సంపర్కాలు, సంబంధిత సంభాషణలు  చక్కగా చేసుకుని  చక్కని చిత్రాలు  తీసుకొని, తీపి జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకొని తృప్తిగా మళ్ళీ మా  మార్గంలో మమేకమయ్యాము 💭⚖️🙂📝@🌳 📖 29.03.2026 ✍️

Vamsi Annaiya (Telugu 21.03.2026

Image
⚛️🪷☀️🍃@🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల ఆత్మజునిగా ఆనందనామ సంవత్సరంలో సంతసమైన పుత్రునిగా ఫాల్గుణ  శుద్ధ అష్టమి,  శుక్రవారం, ఆరుద్ర  నక్షత్రం నాడు  గూడూరు గడ్డపై పుట్టి  వరంగల్లు వంటి  ఊర్లలో ఉండి నెల్లూరు నేపథ్యంగా పెరిగి మద్రాసులో మొదటి  ఉద్యోగంలో ఉండి  విశాఖపట్నం వనిత కవిత(వదిన)ను కళ్యాణం చేసుకుని చక్కగా  అన్షు ఆర్యలకు  తండ్రివై, తోడుగా  తల్లి చెంత తృప్తిగా గడిపి గడించిన  జ్ఞాపకాలను జప్తుచేసి వృత్తిలో వృద్ధి చెందుతూ చక్కగా  భర్తగా భార్యకు అల్లుడిగా అత్తకు తనయునిగా తండ్రికి భవ్యంగా బాధ్యతలను నిర్వహిస్తూ నడుస్తూ "నిర్వహణ నక్షత్రం"  అయన అన్నయ్య...  "సానుకూల సాటి"గా  విషయ విజ్ఞానం,  విధేయత విధానం వినే విలువ,  ప్రశాంత పలుకులు,  సమగ్ర స్ఫూర్తి,  స్వతంత్ర స్వరం, పొడుగైన పొందిక,  పాకశాస్త్ర ప్రావిణ్యం  కలిగి కదిలే  అన్నయ్య  మనం మౌనంగా  ఆపేక్షలేని అంతరంగాన  నైరూప్యంగా నిర్విరామంగా  ఒకరికి ఒకరం ఆలోచనల్లో అనుసంధానం అయ్యే అన్నదమ్ములం. నాలోన ...

3) Ugadi (Parabhava 19.03.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   సహజంగా సంప్రాప్తించే  ప్రకృతి పదార్థాలు, ఆరగించే ఆహార షడ్రుచుల సమ్మేళనాన్ని వుడికించడం, వేయించడం, కాల్చడంతో కాకుండా,  కేవలం కలపడంతో మధురంగా మలుచుకుని  సమభావనతో స్వీకరించి  సేవించగలిగే, సమతుల్య  సచ్చిదానందా సకామక్రియ  ఉగాది పచ్చడి  సానుకూల సారంతో ఉగాది ఉత్తేజానికీ  ఊతమైన ఉదాహరణ. ఆప్తులు అందరికీ హార్దిక హృదయపూర్వక  శ్రీ పరాభవ సంవత్సర  శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳   📖 19.03.2026 ✍️

Karnakar Birthday (Telugu 12.03.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   కరుణాకర్ గా పరిచమమైన, కర్ణకర్ పేరున్నవాడు. వు(ఉ)మ్మడి వరంగల్  జిల్లాలో జన్మించి ఏకశిలా పాఠశాల ఫాతిమా కళాశాలలో  ఉత్తీర్ణుడై ఉండి ఉన్నత విద్య  ఉస్మానియా విశ్వవిద్యాలయ  పరిధిలోని ప్రఖ్యాత  నిజాం కళాశాలలో  ఆంగ్లభాష అంశాలు అభ్యసించి పట్టభద్రత పోంది జీవనోపాధికై జరిగిన  ప్రయాస ప్రయాణంలో  తేలికగా తొలిసారి  ఆంధ్రజ్యోతిలో అడుగేసి పరిక్షలో పరీక్షించిన  మీదట, మొదటిసారిగా విజయుడై వృత్తిలో  దృక్పథంతో ధృవీకరణకర్తగా  ఉంటూ ఉన్న  కాలంలో కుటుంబం కుదుర్చిన కళ్యాణంతో అఖిలను అర్ధాంగి  చేసుకుని చిద్విలాసంగా  సారాంశప్రాయంగా సంతోషంగా  కొనసాగుతున్న కర్ణకర్ కు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖12.03.2026✍️

On T20 World Cup 2026

Image
⚛️🪷☀️🍃@🌳  ప్రఖ్యాత ప్రపంచకప్పు  విజేతగా వుంటూ  దానిని దృఢంగా  నిలుపుకోవాలనే నెపంతో   సానుకూల సంకల్పంతో  మెదులుతూ మొదలైన  ఆరంభ ఆటలలో  క్రికెట్ క్రీడలో  మౌలికసదుపాయాలు మెరుగుగాలేని  జట్లపై జారిన కుదురుకొని కష్టపడుతూ  ఒక్కొక్కరు ఒక్కొక్క  ఆటలో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ ఆడుతూ  వచ్చిన వేళ గెలిచిన గెలుపులతో  బృందదశలో బ్రహ్మాండమైన  అగ్రస్థానం అధిరోహించినా వెలతి వున్న విజయాలను పూర్ణంచేసే విధంగా   దక్షిణాఫ్రికా దృఢంగా ఓడించిన ఒక్క ఓటమితో  మేలుకొని మెరుగై కీలకమైన కాలంలో    కృషితో కలిసికట్టుగా జింబాబ్వే జుట్టుపై  గెలిచి ఘనంగా క్వార్టర్ ఫైనల్ కానీ క్వార్టర్ ఫైనల్లో  వెస్టిండీస్ ను వంచి  సాధికారంగా సెమీఫైనల్లో   హోరాహోరీ  ఆడిన ఆటోలో  ఇంగ్లాండును ఇంటికి  పంపి, ఫైనల్లో  పరుగుల పారించి బాగా బంతులేసి విజేతగా నిలిచి విజేత  బిరుదుని భవ్యంగా నిలుపుకొని నిలిచిన భారత క్రికెట్ క్రీడా బృందానికి  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు మరి ముఖ్యంగా...

On Sanju Samson (Telugu 08.03.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   సంజు శాంసన్  సభ్యుడిగా సాగుతున్న  ఆరంభ ఆటలలో ఆడే అవకాశం  లభించ లేకపోయినా  అనుకోనీవిధంగా అందిన అవకాశంతో అంచనాలేని  ఆటగాడిగా అడుగుపెట్టి  మోస్తారుగా మొదలుపెట్టి  తర్వాత నుంచి తాదాత్మ్యంగా సంక్లిష్టమైన సమయాలలో  స్థిరంగా సరళంగా నిల్చుని నిలకడగా   పరుగుల ప్రవాహం పారించి ప్రపంచకప్పు పోటీలో  శ్రేష్టుడిగా నిలిచిన శాంసన్_కు శుభాభినందనలు 💭⚖️🙂📝@🌳 📖08.03.2026✍️