Posts

Showing posts with the label 🙂Merriness Memories👍 (చిద్విలాస చిత్తం)

Daivik Upanayanam (Telugu 02.07.2026)

⚛️🪷☀️🍃@🌳 దైవిక్.. దివ్యమైన  యజ్ఞోపవీత ధారణ యొక్క  ఉపనయన ఉత్సవంతో సపరివార సమక్షంలో  భవ్య బ్రహ్మాణ  విశేష వేదమంత్రాలు  హొమాగ్ని సాక్షిగా హామీగా ఒక్కొక్కటిగా ఒకేసారి  నిర్దిష్ట నామకరణం  ఆసరా అయిన అక్షరాభ్యాసం  బారసాల వంటి బహుళ  ఆచారాల అనంతరం  ఉన్నతమైన ఉపవీతం ధరించి ధన్యుడవై నాన్న ద్వారా నిర్మలంగా  బ్రహ్మాండమైన బ్రహ్మోపదేశం పొందికగా పొంది  సంధ్యావందన సంస్కారానికి తద్వారా తక్కిన ఆచారాలుకు అర్హత  సాధించే సమూపార్జన దిశగా దివ్యంగా  దిగ్విజయంగా ద్విజుడవుతున్న తేజస్వినివంశీ తనయుడు దైవిక్ కు  హార్దిక హృదయపూర్వక  శుభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖02.07.2026✍️

Photo with Peers (Telugu 20.01.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 సంవత్సరాల స్నేహం  కానీ, కలిసి తీసుకున్న తీపి ఒక్కటంటే ఒక్కటి  లేనే లేదు, ఇన్నాళ్లకు ఇప్పుడు  చక్కని చిద్విలాస చిత్రం చక్కగా  తీపిగా తీసుకున్నాము. 💭⚖️🙂📝@🌳 📖20.06.2026✍️

Vivekananda Kendra KPS (Telugu 14.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   వివేకానంద కేంద్ర కన్యాకుమారి వారు  దేశ ధార్మిక సేవకై సంకల్పంగా నియమాలతో నిశ్చలంగా నిర్వహించే  కార్యక్రమాల ప్రస్ఫుట శిక్షణకై  “కార్యకర్తల ప్రశిక్షణ శిబిరం”లో పరస్పర పరిచయాలతో  సమూహ స్ఫూర్తితో అహం ఆదమరిచి అండదండగా వినమ్రంగా విలక్షణంగా ఒకరికొకరుగా ఒక్కటై  తెల్లవారుజామన తొందరగా  లేచి, లయగా ప్రాతఃకాల ప్రార్థనలు వివిధ వ్యాయామాలు,  నియుద్ధ నైపుణ్యాలు, యోగాసనాలను యత్నించి, సమిష్టిగా శ్రమ సంస్కారాలు  గీతా గానం భగవద్గీత పారాయణం,  భజనలు పాడడం తాత్విక తరగతులు  చింతనల చర్చలు  ప్రకటిత ప్రదర్శనలు  ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందపరిచే ఆటలు, ధారావాహికగా దాఖలు  చేసిన చారిత్రాత్మక  కథా కథనాల తీరుతో తృప్తిగా సంతోషంగా సాగింది.  -------- కేంద్ర కౌశలంలో నిర్వహణాధికారిగా నిల్చుని రాణిస్తూ రామకృష్ణగారి ఆధ్వర్యంలో జరిగినకానీ సమక్షంలో జరిగినట్లుగా నిశ్శబ్దంగా నిర్విరామంగా  శ్రమించే శ్రామికడు.  కేంద్ర కౌశలానికి  సగర్వంతో సగౌరవంగా  హార్థిక అతిథులుగా హాజరైన ఆహ్వానించిన అతిథులు  అరుణ్ జీ, అమరేష్  విశ్ర...

On K9-DM Course Experience (Telugu 15.04.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 కేరీర్-9 కాలంలో  నేను నేర్చుకున్న  అంకాత్మక అమ్మకాల ప్రచారం, ప్రచురణ  విషయాలు ఎలా వు(ఉ)న్న  నిశ్శబ్దంగా నిర్మలంగా   వృత్తిపరంగా కన్న కొంచెం వ్యక్తిగతంగా మీరందరి నుంచి నా మదిలో  అందుకున్న అనుభూతులు  అసాధారణంగా అనిపించింది. విస్తృత విశాల అనుభవాలు అందుకుని పరిణితి చెంది పరిపక్వతతో నైపుణ్యాలు నేర్పే ఆసక్తి గల అధ్యపకురాలిగా లక్షణమైన లక్ష్మిగారి విద్యార్థి విద్యార్ధినిలుగా.... వచ్చిన విషయాలను  మరింత మెరుగుపరచుకొన్న నేపథ్యంతో నేర్పుగా  సాయి శామ్యూల్ ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు త్వరితగతిన తరగతి  పాఠాలను పాటిస్తూ  సాధన చేసే శివ, పెళ్లై పెద్దవారిగా పతి, పిల్లల భవ బాధ్యతలను నేరవేరుస్తూ, నైపుణ్యాలు  నేర్చుకునేందుకు, నిండైన  హృదయంతో హాజరైయ్యే స్వాతి సంధ్య  నియతి రాజ్యలక్ష్మి గార్లు... వృత్తి వృద్దికై వచ్చిన  రమ్య రింకీ... అందరు ఆనందంగా  భవిష్యత్తుకై భరోసాగా  ఆశ ఆశయాలతో  సిద్ధమై సానుకూలతతో  హార్దికంగా హాజరవుతూ  నేర్చే నైపుణ్యాలను, అప్పటికప్పుడు ఆరోజే సాధన సే(చే)స్తూ  పాఠాలను పాటిస్...

On Facebook- Reflection (Telugu 04.02.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   ఈరోజు ఫేసుబుక్ ప్రారంభమైన రోజు. ఈ ఫేసుబుక్ నాకు ఒక వార్తాపత్రిక మరియు దైనందిని. ఇంకా విశ్లేషిస్తూ తాత్వికంగా చెప్పాలంటే నాలోని కవిని రచయితను బహిర్గతం చేసే ఒక బంగారం గని లాంటిది.  ఈ ఫేసుబుక్ (వాట్సాప్) నేను రాసిన ఎన్నో సానుకూల రచనలు, కవితలకు వేదికగా ఉంది. నా రచనలకు వెచ్చించిన సమయం కంటే, వృధా చేసిన సమయమే ఎక్కువ. వృధాను ఆపేస్తే విలువైన విశేషమైనవి రావు అనిపించింది.  బంగారం కోసం తవ్వినప్పుడు ముడి సరుకును బయటికి తీస్తాము, దానిలో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన స్వర్ణం తయారవుతుంది.‌ ముడి సరుకు లేకుండా బంగారం రాదు, కాబట్టి బంగారం కోసంగా ముడి సరుకును (వ్యర్ధాలను) తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేసి స్వచ్ఛమైనది తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాల నుంచి మంచి పొందాలంటే దుర్ఘుణాలను స్వీకరించి వదిలేయాలి.  బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటిని సాధించాలని ఉంది. 💭⚖️🙂📝@🌳 📖04.02.2026✍️  

VK Rachakonda Trip (Telugu 01.02.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 సంఘ సభ్యులు  (జ్ఞాన)సరస్వతీ సంస్థ సంస్థాపకుడైన సదానందం సహాయంతో సిద్ధమై  వివేకానంద కేంద్ర  వైభవంగా కృతిపరిచి సామూహికంగా సాగిన  పర్వతారోహణ ప్రయాణం  రాచకొండ కోట  రాతి కొండలనుకున్న కానీ కనిపించని చరిత్ర చూసి ఆశ్చర్యం అనిపించింది. కొంతకాలం కాకతీయ  పరిపాలన పరిధిలో  తదనంతరం తదనుగుణంగా  రేచర్ల రాజుల రాజధానై రాణించింది. భాగ్యనగరానికి భాగంగా  ఉండి ఉన్న  తొలి తెలంగాణ  రాజధాని రాచకొండ. ప్రకృతిలో పొందుపరిచిన  కొండలు కొనలు  కార్తీకాన కాంతితో వెలిగే వన్నెల కోటపై కోవెలలు స్థానిక సంస్కృతిని  తతంగాలను తెలుపుతూ  వచ్చిన వెంకటేశ్వర్లు, సహావాసంగా సభ్యులతో తృప్తిగా తిరిగాము. 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️

Vamsi Krishna (Telugu 17.01.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   అష్టాచమ్మా చలనచిత్రంలో మహేష్ అంటే ఓ వైబ్రేషన్ అనే లాగా నా జీవితంలో “వంశీ” అనే పేరు వింటే నాలు సానుకూల తరంగాలు ప్రతిధ్వనించేవి. ఇలా మొదలవ్వడానికి కారణం నువ్వే వంశీ.   మన ఇద్దరికీ ముఖ పరిచయం అయ్యింది రెండో తరగతిలో అయినా, మనం పాఠశాల మారిపోవడం మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇద్దరం పాఠశాలలు మారి ఒకే పాఠశాలలో కలవడం, పాత ముఖ పరిచయం వల్ల, మనస్తత్వాలు కలవడం వల్ల నూతన పాఠశాలలో మన మధ్య స్నేహం తొందరగానే చిగురించింది.  రెండు సంవత్సరాలు ఇద్దరం ఆదివారం అవ్వగానే ఉదయాన్నే వాకింగ్ అనుకుంటూ మనకు తెలిసిన కడప చుట్టూ ఉండే కొత్త ప్రదేశాలకు నడుచుకుంటూ తిరిగేవాళ్లం. ఆర్ట్స్ కాలేజ్, రాజీవ్ పార్కు, ఎల్ఐసి పార్కు, కలెక్టర్ బంగ్లా, దాని పక్క పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ దగ్గరున్న ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన వాటర్ ట్యాంక్, వివిధ కూడళ్ళు, కొన్ని దేవాలయాలు, తిరిగి వాళ్ళము. కొన్నిసార్లు మనకు తోడుగా మన తోబుట్టువులు కూడా మనతో పాటు వచ్చేవారు.  అప్పుడు మనం బయట ఏమి తినేవాళ్ళం కాదు, కేవలం నడుచుకుంటూ కొత్త ప్రదేశాలు చూడటం, సరదాగా గడపడం కోసం మాత్రమే నడిచే వాళ్ళం. ఆ సమయంలో మనకు కొన్ని కొత్త పరిచయా...

Fire Camp (Telugu 11.12.2025)

Image
⚛️🪷🌳 చలి మంచును ఎదుర్కొనేందుకు  చలి మంటల ఏర్పాటులో స్థానికునితో సంభాషణలాడి  సహాయపడి, సహచరునితో చిన్న నాటి చిన్ని చిన్ని  జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాము. 💭⚖️🙂📝@🌳 📖11.12.2025✍️

Matriarchy (Telugu 23.11.2025)

Image
⚛️🪷🌳  ధృతి అమ్మ స్వాతి, స్వాతి అమ్మ మాధవి, మాధవి అమ్మ అన్నపూర్ణ, అన్నపూర్ణ అమ్మ లక్ష్మీనరసమ్మ, లక్ష్మీనరసమ్మ అమ్మ మహాలక్షమ్మ, మహాలక్షమ్మ అమ్మ సీతమ్మ 1.సీతమ్మ  2.మహాలక్ష్మమ్మ 3.లక్ష్మీ నరసమ్మ  4.అన్నపూర్ణమ్మ  5.మాధవమ్మ 5.స్వాతమ్మ 7.ధృతమ్మ మృదువైన మాతృస్వామ్య  ఏడు తరాలను ఏకం చేసిన  ఈ చిరస్మరణీయ చిత్రం తరాలకు తార్కానంగా  వారసత్వ వారధి  కలిగి కమనీయంగా  ఉన్నతంగా ఉంది. 💭⚖️🙂📝@🌳 📖23.11.2025✍️

Generalized Childhood Memories (14.11.2025)

Image
⚛️🪷🌳 సుమారు ఏదో సమయాంలో  పసి ప్రాయపు  బాల్యాన్ని భావనలోకి  తాదాత్మ్యంగా తీసుకొరావడానికి, పసితనాన్ని పునఃపరిశీలించడానికి  కొన్నింటిని కృత్రిమ మేధ మనకు  మధుర స్మృతిగా మనముందు  ఉన్నపలంగా ఉంచేసింది 💭⚖️🙂📝@🌳 📖14.11.2025 ✍️ 📸©️: #అనామిక

Timeline (10.08.2025)

⚛️🪷🌳   00) 1994 (0-261) భవ   01) 1995 (262-626) భవ-యువ 02) 1996 (627-992) యువ-ధాత 03) 1997 (993-1357) ధాత- ఈశ్వర 04) 1998 (1358-1722) ఈశ్వర- బహుధాన్య   05) 1999 (1723-2087) బహుధాన్య-ప్రమాధి 06) 2000 (2088-2453) ప్రమాధి-విక్రమ 07) 2001 (2454-2818) విక్రమ -వృష 08) 2002 (2819-3183) వృష -చిత్రభాను 09) 2003 (3184-3548) చిత్రభాను-స్వభాను 10) 2004 (3549-3914) స్వభాను-తారణ 11) 2005 (3915-4279) తారణ-పార్థివ 12) 2006 (4280-4644) పార్థివ-వ్యయ 13) 2007 (4645-5009) వ్యయ-సర్వజిత్తు 14) 2008 (5010-5375) సర్వజిత్తు-సర్వధారి 15) 2009 (5376- 5740) సర్వధారి-విరోధి 16) 2010 (5741-6105)విరోధి - వికృతి 17) 2011 (6106-6470)  వికృతి-ఖర 18) 2012 (6471-6836)  ఖర-నందన 19) 2013 (6837-7201) నందన-విజయ 20) 2014 (7202-7566)  విజయ-జయ 21) 2015 (7567-7931) జయ-మన్మధ 22) 2016 (7932-8297)  మన్మధ-దుర్ముఖి 23) 2017 (8298-8662) దుర్ముఖి-హేవళంబి 24) 2018 (8663-9027) హేవళంబి-విళంబి 25) 2019 (9028-9392) విళంబి-వికారి 26) 2020 (9393-9758) వికారి-శార్వరి 27) 2021 (9759-10123)  శార్వరి-ప్లవ ...

Essence group Seminar & Get Together (Telugu 06.07.2025)

⚛️🪷☀️🍃@🌳 Essence group (సారవంత సమూహం) సామాజిక స్పృహతో తర్క తాత్విక  విశేష విషయాలను  చిత్తశుద్ధితో చర్చిస్తూ  రచనలతో రాణిస్తూ  లఘు చిత్రాలతో లంకిస్తూ  సమాజ సేవకై నిర్వహిస్తూ నడుస్తూన్న సారవంత సమూహం  సమావేశం సమ్మేళనం  అయ్యింది, ఇక్కడ  కొంచెం కొంతమందితో తొలి పరిచయం &  తొలి సంప్రదింపులతో  సుజావుగా సమూహ  సమావేశం, సమ్మేళనం,  జ్ఞాపకంగా జరిగింది  💭⚖️📝🙂@🌳 📖06.07.2025✍️

Vivekananda Kendra PKPS (Telugu 29.05.2025)

Image
⚛️🪷🌳 భక్తితో బొమ్మలను  ఘనంగా గీసిన  చిత్రకారిణికి చిద్విలాసంతో  ఆదర అభినందనలు    💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ ------- Standing people:   Surabhi didi, Bhagyalakshmi aunty ji, Amaresh ji, Arun ji,  Hari prakash ji, Srinivas ji,  Mukesh ji, Radhakrishna ji,  Bhargav ji,  Ravi ji. Sitting people: Rishita akka, Uma akka, Matru shree akka, Hindu akka, Snehalata akka, Sahil, Anish, Nithin. ------- కేంద్ర కార్యక్రమాలలో ఆత్మీయతతో అమ్మలు  అందించిన ఆహారం  అన్నిరోజులు ఆరగిస్తూ  అందిన ఆనందంతో  కృతజ్ఞతగా కుతూహలంతో  తీసుకున్న తాదాత్మ్య  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ -------- ఉన్నత ఉద్యోగులుగా ఉంటూ/ఉండి  విరామం తీసుకుని/విశ్రాంత తనంలో  యశస్సు గడించి మరచి మరి  యోగ గురించి మరింత మీమాంసతో తెలుసుకోవాలనే తాపత్రయంతో  వివేకానంద కేంద్ర కౌశలానికి వచ్చి పిల్లలైన పెద్దవారు  హరి ప్రకాష్ గారు/రాధాకృష్ణ గార్లలో  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ ----- సద్వినియోగంగా సమయాన్ని  సార్...