On T20 World Cup 2026

⚛️🪷☀️🍃@🌳
 ప్రఖ్యాత ప్రపంచకప్పు 
విజేతగా వుంటూ 
దానిని దృఢంగా 
నిలుపుకోవాలనే నెపంతో  
సానుకూల సంకల్పంతో 
మెదులుతూ మొదలైన 
ఆరంభ ఆటలలో 
క్రికెట్ క్రీడలో 
మౌలికసదుపాయాలు మెరుగుగాలేని 
జట్లపై జారిన
కుదురుకొని కష్టపడుతూ 
ఒక్కొక్కరు ఒక్కొక్క 
ఆటలో ఆపద్బాంధవుడిలా
ఆదుకుంటూ ఆడుతూ 
వచ్చిన వేళ
గెలిచిన గెలుపులతో 
బృందదశలో బ్రహ్మాండమైన 
అగ్రస్థానం అధిరోహించినా
వెలతి వున్న విజయాలను
పూర్ణంచేసే విధంగా  
దక్షిణాఫ్రికా దృఢంగా
ఓడించిన ఒక్క ఓటమితో 
మేలుకొని మెరుగై
కీలకమైన కాలంలో  
కృషితో కలిసికట్టుగా
జింబాబ్వే జుట్టుపై 
గెలిచి ఘనంగా
క్వార్టర్ ఫైనల్ కానీ క్వార్టర్ ఫైనల్లో 
వెస్టిండీస్ ను వంచి 
సాధికారంగా సెమీఫైనల్లో  
హోరాహోరీ 
ఆడిన ఆటోలో 
ఇంగ్లాండును ఇంటికి 
పంపి, ఫైనల్లో 
పరుగుల పారించి
బాగా బంతులేసి
విజేతగా నిలిచి విజేత 
బిరుదుని భవ్యంగా
నిలుపుకొని నిలిచిన
భారత క్రికెట్ క్రీడా బృందానికి 
హార్థిక హృదయపూర్వక 
శోభమైన శుభాకాంక్షలు
మరి ముఖ్యంగా 
బాగా బంతులేసిన బూమ్రా 
బలంగా బాదిన శాంసన్ 
బంతులు బాగా పట్టిన పటేల్ 
కీలకమైన కాలంలో 
చిన్నవైన చక్కగా శివమ్
వైవిధ్య వైఖరిగా హార్ధిక్ 
ఆడిన ఆటలు 
చిత్తంలో చిరస్మరణీయం
సారధిగా సఫలత
సాధించిన సూర్యకు
అభినందనలు

💭⚖️🙂📝@🌳 
📖 08.03.2026✍️




Comments

  1. మన దేశం టి 20 ప్రపంచ కప్పును 2026 చేజిక్కించుకున్న సందర్భంగా... అమంచర్ల నాగ భార్గవ శ్యామ్ అనే కవి హృదయం నుంచి జాలువారిన తేట తెలుగు పలుకులను వర్ణించిన తీరు నిజంగా అభినందనీయం.
    💐💐💐💐

    ReplyDelete
  2. సూపర్

    ReplyDelete
  3. Bharat Vennalakanti09 March, 2026

    ♥️

    ReplyDelete

Post a Comment