పోస్ట్‌లు

వచనం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

On Facebook- Reflection (Telugu 04.02.2026)

చిత్రం
⚛️🪷🌳  ఈరోజు ఫేసుబుక్ ప్రారంభమైన రోజు. ఈ ఫేసుబుక్ నాకు ఒక వార్తాపత్రిక మరియు దైనందిని. ఇంకా విశ్లేషిస్తూ తాత్వికంగా చెప్పాలంటే నాలోని కవిని రచయితను బహిర్గతం చేసే ఒక బంగారం గని లాంటిది.  ఈ ఫేసుబుక్ (వాట్సాప్) నేను రాసిన ఎన్నో సానుకూల రచనలు, కవితలకు వేదికగా ఉంది. నా రచనలకు వెచ్చించిన సమయం కంటే, వృధా చేసిన సమయమే ఎక్కువ. వృధాను ఆపేస్తే విలువైన విశేషమైనవి రావు అనిపించింది.  బంగారం కోసం తవ్వినప్పుడు ముడి సరుకును బయటికి తీస్తాము, దానిలో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన స్వర్ణం తయారవుతుంది.‌ ముడి సరుకు లేకుండా బంగారం రాదు, కాబట్టి బంగారం కోసంగా ముడి సరుకును (వ్యర్ధాలను) తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేసి స్వచ్ఛమైనది తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాల నుంచి మంచి పొందాలంటే దుర్ఘుణాలను స్వీకరించి వదిలేయాలి.  బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటిని సాధించాలని ఉంది. 💭⚖️🙂📝@🌳 📖04.02.2026✍️  

Vamsi Krishna (Telugu 17.01.2026)

చిత్రం
⚛️🪷🌳  అష్టాచమ్మా చలనచిత్రంలో మహేష్ అంటే ఓ వైబ్రేషన్ అనే లాగా నా జీవితంలో “వంశీ” అనే పేరు వింటే నాలు సానుకూల తరంగాలు ప్రతిధ్వనించేవి. ఇలా మొదలవ్వడానికి కారణం నువ్వే వంశీ.   మన ఇద్దరికీ ముఖ పరిచయం అయ్యింది రెండో తరగతిలో అయినా, మనం పాఠశాల మారిపోవడం మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇద్దరం పాఠశాలలు మారి ఒకే పాఠశాలలో కలవడం, పాత ముఖ పరిచయం వల్ల, మనస్తత్వాలు కలవడం వల్ల నూతన పాఠశాలలో మన మధ్య స్నేహం తొందరగానే చిగురించింది.  రెండు సంవత్సరాలు ఇద్దరం ఆదివారం అవ్వగానే ఉదయాన్నే వాకింగ్ అనుకుంటూ మనకు తెలిసిన కడప చుట్టూ ఉండే కొత్త ప్రదేశాలకు నడుచుకుంటూ తిరిగేవాళ్లం. ఆర్ట్స్ కాలేజ్, రాజీవ్ పార్కు, ఎల్ఐసి పార్కు, కలెక్టర్ బంగ్లా, దాని పక్క పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ దగ్గరున్న ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన వాటర్ ట్యాంక్, వివిధ కూడళ్ళు, కొన్ని దేవాలయాలు, తిరిగి వాళ్ళము. కొన్నిసార్లు మనకు తోడుగా మన తోబుట్టువులు కూడా మనతో పాటు వచ్చేవారు.  అప్పుడు మనం బయట ఏమి తినేవాళ్ళం కాదు, కేవలం నడుచుకుంటూ కొత్త ప్రదేశాలు చూడటం, సరదాగా గడపడం కోసం మాత్రమే నడిచే వాళ్ళం. ఆ సమయంలో మనకు కొన్ని కొత్త పరిచయాలు కూడ...

On Aesthetics by Metaphor (Telugu 30.12.2025)

చిత్రం
⚛️🪷🌳 సాధారణంగా ఆభరణాలు అన్ని స్వర్ణంతో చేస్తారు, కొన్ని మాత్రమే ఇతర లోహాలతో చేస్తారు, లోహాల్లో కొన్ని స్వర్ణం కంటే ఉన్నతమైనవి, కొన్ని కావు. కానీ ప్రతి ఆభరణం విలువైనదే. ఆభరణాలు కొన్ని సాంప్రదాయంగా, కొన్ని ఆధునికంగా, కొన్ని సరళంగా, కొన్ని సున్నితంగా, కొన్ని స్థూలంగా, కొన్ని తేలికగా ఉంటాయి. ఇలా ప్రతి ఆభరణం ప్రత్యేకమైనదే.  దాదాపు అందరూ స్వార్జితంతో ఆభరణాలను పొందుతారు, ఇది చాలా మేలైన మార్గం, ఉత్తమమైనది. కొందరికి వంశపారంపర్యంగా లభిస్తుంది, ఇది వారి యోగ్యత ఆధారంగా ఉంటుంది. ఇది ఆమోద యోగ్యమైనది. కొందరు వేరే వారికి చెందిన దానిని తెలివిగా, ఒక రకమైన గౌరవంగా సమ్మతితో అనుభవిస్తారు అది వారి లౌక్యం, ఇది మధ్యమమైనది. కొందరు దౌర్జన్యంతో దోచుకుంటారు అది దోపిడి, ఇది హేయమైనది. ఎప్పుడైనా ఎక్కడైనా ఆభరణాలు సంస్కృతిని చాటడానికి, విలువను చూపించడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి, అందాన్ని పెంచుకోవడానికి, గౌరవాన్ని పొందడానికి, గొప్ప అనే గర్వాన్ని ప్రదర్శించడానికి, ఇలా కొన్ని కారణాలు చేత ఆభరణాలు ప్రదర్శనలలో ఉంచబడతాయి, అప్పుడు ఆ సమయంలో ప్రదర్శనకు ఉంచిన ఆ ఆభరణాలను ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది. కొన్నిసా...

Atal Bihari Vajpayee (Telugu 25.12.2025)

చిత్రం
⚛️🪷🌳 ప్రతిపక్షంలో ఉన్న వాజపేయిపై అధికార పక్షంలో ఉన్న అప్పటి ప్రధానమంత్రుల ఆలోచనలు అనగా నెహ్రూ ఆశ, రాజీవ్ గాంధీ ఉపకారం, నరసింహారావు గారి నమ్మకం, అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచిన ప్రతిపక్ష ప్రముఖుడు వాజపేయి నెహ్రూ దృష్టి:  1957లో అటల్ బిహారీ వాజపేయి గారు మొదటిసారి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. వాజపేయి గారు హిందీలో మాట్లాడే అనర్గళమైన ప్రసంగాలు, విదేశీ విధానాలపై ఆయనకున్న పట్టు చూసి నెహ్రూ ముగ్ధులయ్యేవారు. ఒకసారి విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చినప్పుడు, నెహ్రూ గారు వాజపేయిని పరిచయం చేస్తూ.. "ఈ యువకుడు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు" అని చెప్పారు. రాజీవ్ గాంధీ మానవీయత:  మరో సంఘటన 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి భారత ప్రతినిధి బృందంలో అటల్ బిహారీ వాజపేయిని చేర్చారు. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు, కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి...

On Cricket (Telugu 03.11.2025)

చిత్రం
⚛️🪷🌳   క్రికెట్ అనేది భారతదేశంలో భావాత్మకంగా మతంలాగ కొనసాగుతుందంటారు. ఇప్పుడు అది అంత తీవ్రంగా లేకపోయినా ఏదో ఒక విషయంలో దానిమీద సానుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా లేదా తటస్థంగా నైనా దృష్టి పెడుతూనే ఉంటాం. క్రికెట్ కేవలం ఆట కాదు అది ఒక సామూహిక అనుభూతి అనిపించింది. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో వచ్చిన ప్రపంచ కప్ విజయం, ధోని నేతృత్వంలో 2011లో ముంబైలో గెలిచిన ప్రపంచ కప్ కేవలం క్రీడా ఘట్టాలుగా మాత్రమే కాదు, ఇవి భారతీయుల జీవితాల్లో క్రికెట్ ద్వారా పొందిన ఒక భావోద్వేగ శిఖరం అనిపించింది. ఈ గెలుపులు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాయి. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఒకే జెండా క్రింద ఆనందించగలిగారు. ఆ గెలుపు ఒక జాతీయ గర్వం, ఒక భావాత్మక ఉత్సాహం. భారతీయుల జీవితంలో ఒక దశాబ్దాల కాలానికి సరిపడ అద్భుతమైన ఉద్వేగ మధుర స్మృతిగా అనిపించింది.  ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, విరాట్ కోహ్లీ సారధ్యంలో 2016 నుండి 2020 వరకు అగ్రగామ్య టెస్టు జట్టుగా ఉండడం అనేవి మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఇక వరిష్ట (సీనియర్) పురుషుల 2015 & 2019 ప్రపంచ కప్పు ఆటలో భారతదేశం స...

Gandhi & Srikrishna (Telugu 02.10.2025)

చిత్రం
⚛️🪷🌳 గాంధీజీ నాకు కృష్ణుడు లాగా అనిపిస్తాడు, ఇద్దరు ఒక అద్భుతమైన ఆకర్షించే అస్తిత్వం గలవారు, నమ్మశక్యం కాని నిజం గాంధీ & కృష్ణుడు. ఇద్దరిలో నాకు చాలా సారూప్య అంశాలు కనిపించాయి.  అందరూ కష్టంగా భావించే సత్యవ్రతాన్ని ఇద్దరు సరళంగా పాటించడం అనితరసాధ్యం. శ్రీకృష్ణుడు భోగిలా కనిపించిన కానీ ఆయన యోగి & బ్రహ్మచారిగా ఉన్నట్లు, గాంధీ కూడా నిగ్రహాన్ని పరీక్షించుకొని బ్రహ్మచారిగా ఉండడం అసామాన్యం. ఇద్దరు, అటు మహాభారత కురుక్షేత్ర యుద్ధం, ఇటు స్వాతంత్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా ఉండి, పరోక్షంగా కనిపించి యావత్తు ప్రజలను ప్రభావితం చేయడం అనేది ఒక అద్భుతం. కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఆపగలిగే/వంటి చేత్తో (ముందే) గెలిపించ గల శక్తి సామర్థ్యాలు ఉన్నా రథసారథిగా పాల్గొని యుద్ధం చేయించడం, అలాగే గాంధీ కూడ తన సత్యాగ్రహ అహింస విధానంతో యావత్తు భారతావనిని ఒక తాటిపైకి తెచ్చి, ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులందరిని ఏకం చేసి, పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతున్నప్పుడు జరిగిన చౌరీ-చౌరా హింసకాండ మొత్తం బ్రిటిష్ వారిని భయభ్రాంతులను గురిచేసినప్పుడు, "మీరు ఇలాగే కొనసాగించండి" అనే ఒకేఒక్క పిలుపు ఇచ్చుంటే అప్...

Lesson from Kohli (Telugu 11.07.2025)

చిత్రం
⚛️🪷🌳 విరాట్ కోహ్లీ విషయాలలోని వాస్తవికత, విజ్ఞానం, వినయం క్రికెట్టుకు మించి విశేషంగా ఉంది. దానిలోని సారాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోతారు. కానీ, మనం చేసే పనిని నమ్మకంగా, నిజాయితీగా చేస్తే, ఫలితం ఎలా ఉన్నా సంతృప్తి ఉంటుంది.  బాగా కష్టపడతాం, తర్వాత జరగవలసినవి జరుగుతాయి, కష్టపడి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో లేదు‌.  మనం ప్రతి సారి ఉత్తమ ప్రదర్శన చెయ్యడం సాధ్యం కాదు, దానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే ఎదుటివారికి బాగా రాణించాలనే ఆకాంక్ష ఉంటుంది, వారు చాలా కష్టపడతారు, వారికి కుటుంబం ఉంటుంది, వారికి స్నేహితులు ఉంటారు, వారు బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. వారు మనతో ఈ వేదికను పంచుకున్నారు, మనకు గెలవాలన్న ఆకాంక్ష ఎంత ఉంటుందో, వారికి కూడా అంతే ఆకాంక్ష ఉంటుంది. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు, ఒడుదుడుకులు ఉంటాయి, వారి స్థానం కంటే మన స్థానం గొప్పదనే విషయానికి ఎటువంటి హామీ లేదు. నిజానికి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న ఆ రోజు మన మ...

My Impact (Telugu 20.04.2025)

⚛️🪷🌳 నా ప్రతికూల ఆలోచనలను ఎవ్వరూ చూడలేరు (అసలు ఏ ఆలోచనలు నా నియంత్రణలో లేనివి) కానీ దాని ప్రభావం నా పైన ఉన్న  కానీ  మాటలు నా పరిధిలో ఉండేవే నా మాటలు వినగలరు, దానికి  నా విచక్షణ తోడుగా ఉంటుంది అందుకే మంచివాడిగా చలామణి అవుతున్నాను.  అలాగని నేను పూర్తిగా ప్రతికూలమైన వాడిని కాదు,   నకిలీ మనిషిని అంతకన్నా కాదు సాధారణమైన వాడిని,  ఉత్సాహంతో ఉద్వేగంతో కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్నిసార్లు తప్పులు చేసేవాడిని,  ఒప్పుకునే వాడిని దాచుకునేందుకు దిద్దుకోనేందుకు ప్రయత్నించే వాడిని. 💭⚖️🙂📝@🌳 📖19.04.2025✍️

Hindu Arabic Numeric System (English/Telugu 03.01.2025)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము హిందూ-అరబిక్ వ్యవస్థ:- సున్నా - సమస్తం: ఘన గణిత విశ్వ విస్తృత విప్లవం మనం ఇప్పుడు 0-9 అంకెల పద్ధతి‌ హిందూ అరబిక్ సంప్రదాయం ప్రకారం ఉపయోగిస్తూ ఉన్నాము. ఈ అంకెల పద్ధతి ప్రపంచంలో ప్రామాణికమైనది, సమర్థవంతమైన సంఖ్యా వ్యవస్థలలో విశేషమైనది.  ఈ పద్ధతి భారత గణిత శాస్త్రవేత్తల ఆవిష్కారంగా ఆవిర్భవించింది. ఈ భారతీయ పద్ధతిని ఆరబ్ గణిత శాస్త్రజ్ఞులు అభ్యసించి వారి ప్రాంతాలకు తీసుకువెళ్ళారు, వారి ద్వారా యూరప్‌కు ఈ పద్ధతి పరిచయమయ్యింది. యూరప్ గణిత శాస్త్రజ్ఞులు ఈ పద్ధతిని అధ్యయనం చేసి అనేక గ్రంథాల ద్వారా ఘనమైన గణిత వ్యవస్థ మరింత ముమ్మరంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మొదట భారతీయ గణిత శాస్త్రజ్ఞుల ద్వారా ప్రారంభమైన బ్రాహ్మీ పద్ధతి లో 1 నుండి 9 వరకూ అంకెలను ఉపయోగించేవారు‌. ఆర్యభట్టు శూన్యం (0) అనే అంకెను ప్రవేశపెట్టి గణితంలో మహత్తరమైన మార్పులతో ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టారు.  సంఖ్యాలలో సున్నా లేకుండా సంఖ్యలను సమర్థవంతంగా వ్రాయడం అసాధ్యం. ఈ పద్ధతిలో ఒకే అంకెను విభిన్న స్థానాల్లో ఉపయోగించడం ద్వారా పెద్ద సంఖ్యలను సులభంగా రూపోందించగలడం, ద...

Introvert's Day (English/Telugu 02.01.2025)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భవ భావజాల భావనలతో, స్వీయ సంచారంలో ఉన్నవాడిని. చాలా వరకూ, మాటలలో అంతర్ముఖుడిని రాతలలో బహిర్ముఖుడిని.  గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతున్నట్లుగా, ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను కొంచెం కవితాత్మకంగా వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులను వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తొంది. ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గమనిక: నా స్వాభావిక అంతర్దృష్టులు, నాలో నాకు అనిపించిన ఉత్తమ ఆలోచనలు క్షణికమైన కానీ, వాటిని కొంచెం మేధోమథనంతో దీర్ఘకాలం ఉండేలా, అక్షర రూపంలో అపురుమైన ఆకారం ఇస్తుంటాను.‌ రాసేటప్పుడు భావించిన భావాలలో ఉన్న గాఢతను, మంచిని, సౌందర్యాన్ని, అతిశయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. రాసిన తరువాత అనిపించిన ఉత్తమ స్థితి నుంచి సాధారణ స్థితికి అంటే మంచి పాత్రలు పోషించి బయటకు వచ్చే నటుల లాగానే వచ్చేస్తాను. వచ్చిన తరువాత నేనేనా అలా రాసి...

Gregorian Calendar (Telugu/English 01.01.2025)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ప్రపంచమంతా ప్రామాణికంగా ఉపయోగించే క్యాలెండరు "గ్రెగోరియన్".   ఖగోళ విషయాలలో సౌరమానంలో మరింత సరళత మరియు ఖచ్చితత్వం కోసం అంటే పాత జూలియన్ క్యాలెండరులోని పొరపాట్ల వల్ల పండుగలు, ముఖ్యంగా ఈస్టర్, తప్పుగా జరుగుతున్నందుకు అప్పటి జూలియన్ క్యాలెండరుకు మార్పులు చేర్పులు చేసి పోప్ గ్రెగరీ XIII 1582 లో పండుగలు మరియు ఇతర ముఖ్యమైన తేదీలు ఖచ్చితమైన సమయంలో జరగడానికి ఎందరో ఖగోళవేత్తలు, గణితశాస్త్రవేత్తలు, మరియు ఆధ్యాత్మిక నాయకులు చేసిన సూచనలకు అనుగుణంగా ఒక క్యాలెండరును పరిచయం చేశారు. దానినే మనం గ్రెగోరియన్ క్యాలెండరు అంటున్నాము.  గ్రెగోరియన్ క్యాలెండరు అనేది సౌరమాన క్యాలెండరు, అంటే ఇది భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం ఆధారంగా ఉంటుంది, గ్రెగోరియన్ క్యాలెండరు ఖచ్చితమైన లీపు సంవత్సరాలను అందిస్తుంది, ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని కదలికతో సరిగ్గా సరిపోతుంది.  దీని సరళత మరియు  ఖచ్చితత్వం  వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి కాకపోయినా, విడతలవారీగా ఈ క్యాలెండరు "కాలసూచి"ను అనుసరించి ప్రపంచవ్యాప్తంగా సమయాన్ని ప్రామా...

Satish Aarya (Telugu 16.10.2024) (2)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ఈ శనివారం ఈ సుభాషితాన్ని "Focus on improving, not proving" చదివాను. "నిరూపించడం కంటే, మెరుగవ్వడం మీద దృష్టి పెట్టండి", దీని ఇలా "ప్రదర్శన కంటే పురోగమించడంపై కేంద్రీకరించు" అని కవితాత్మకంగా రాసుకున్నాను.  నేను తప్పు చేసినప్పుడు గొప్పవాళ్ళు, అనుభవజ్ఞులు హుందాగా గల వారి కోపానికి నేను కారణమైతే, ఆ ప్రతికూల ప్రతిస్పందనల బాధ దిగిన తర్వాత విచక్షణతో ఆలోచించినప్పుడు దానిని నా పురోగతికి ప్రేరణగా భావిస్తాను, ఎందుకంటే అలాంటి వారికి సాధారణంగా కోపం రాదు, అప్పుడు జరిగిన తప్పులకు కారణాలు చెప్పకుండా (కోపంలో ఉండేటప్పటి కారణాలు చెప్పాలనే గిలి కూడా ఉంటుంది, కానీ దానిని వారి ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పే ప్రయత్నం చేయడం బంధాన్ని బలపరుస్తుంది) మౌనంగా తప్పులను విశ్లేషించుకొని ముందడుగు వేయడం ఉన్నతంగా ఉంటుందనిపించింది. వారికి నామీద కలిగిన కోపంలో మరో సానుకూలత ఏమిటంటే నేను వారికి అది చేయగలను అని అంచనాలను వాళ్లకు కలిగించాను అని అర్థం కూడా వస్తుంది. కాబట్టి నాలో విషయం ఉంది అనే ఆనందం కూడా ఉంటుంది. ఆర్య ఆ అభిజ్ఞాను అన్వయించుకుని సంభావ్య సానుకూల సిద్ధా...

Death Consequences (Telugu 29.09.2024)

⚛️🪷🌳 మరణానంతరం  జ్ఞాపకాలు (మనవారివి),  పాఠ్యాంశాలు (ప్రముఖులది)  అందించే మేలుకొలుపు ఈ మృత్యువు. ------- మనకు వారితో ఉన్న జ్ఞాపకాలను ఉన్నఫలంగా గుర్తు చేసేది మేలుకొలుపు మృత్యువు.  ప్రముఖులు అయితే వారి జీవితంలో ఎదిగిన తీరును పాఠాలుగా నేర్పే పాఠ్యాంశం ఈ మృత్యువు. 💭⚖️🙂📝@🌳 📖29.09.2023✍️

Youth conference on Sanatan Dharma (Telugu 17.09.2024)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   "సనాతన ధర్మంపై యువ సమ్మేళనం" కార్యక్రమంలో వేదికపై మాట్లాడిన విషయాలు ఇంకొంచెం సంస్కరణతో విశిదీకరించి ఇక్కడ పంచుకుంటున్నాను.  (అక్కడి సందర్బం, ఈ ఉపన్యాసం, నా వేషధారణ కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ,  అది పారదర్శకమైనది మరియు దీని ఉద్దేశం మాత్రం మంచే) "యువతకు ఎందుకు అన్న కారణం తెలిస్తే, ఎలా అనేది వారే చూసుకుంటారు" #అపరిచితుడు (యువతనే కాదు సాధారణమైన మనుషులది అదే లక్షణం).   నేను ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడయ్యాను అంటే, ఆ పారామార్థికమైన విషయానికి నాకు మధ్య ఉన్న సంబంధం, మా అమ్మ నాన్నలకు నాకు మధ్య ఉన్న సంబంధం లాంటిది.  నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల సదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వారు అవసరమైనవి, కావలసినవి సమకూరుస్తుంటారు, అందిస్తుంటారు. అందుకు వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాను. మన తల్లిదండ్రులకు మించిన తల్లితండ్రులు ఉంటారు, లేదా మనం మన తల్లితండ్రుల సంపూర్ణ సామర్ధ్యం మనకు తెలియకపోవచ్చు. తల్లితండ్రులు లాగా సంప్రదాయం కూడా అంతే.  ప్రతి ఒక్కరికి వారి పరిధి చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన సదా ఉం...

Hema ji Birthday (Telugu 03.09.2024)

⚛️🪷🌳 (ಧರ್ಮ ಸಂಸ್ಥಾಯಾರ್ಥ ಸಂಭವಾಮಿ ಯುಗೇ ಯುಗೇ) Just as God incarnates in human form to embody and teach virtues,  Hema Ji, you are like a professor incarnated in the form of a student among us, embodying wisdom, guidance, and knowledge.  Your presence in our batch is a blessing, inspiring us to learn, grow, and develop our own virtues. Thank you 😊  Warm Blissful Blossom Birthday Wishes Hema Ji. ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಹೇಮಾ ಜಿ 💭⚖️🙂📝@🌳 📖03.09.2024✍️

Prathiba Birthday (English 10.08.2025) -2

చిత్రం
⚛️🪷🌳 At one Step, near the ocean, Even though it's fully not visible, that point in a scope it will be broad. Like that, these "PRATHIBA" characteristics in the image will applicable to you. Feeling & Reminding these "PRATHIBA" characteristics of you Prathiba. Warm Blissful Blossom Birthday Wishes   Sonam Sonam (Prathiba) 💭⚖️🙂📝@🌳 📖10.08.2024✍️   https://bharghavashyam.blogspot.com/2021/08/prathiba-birthday-english.html  

On WhatsApp Forwarded Messages (Telugu/English 06.08.2024)

చిత్రం
EnTREE    ⚛️🪷🌳   కల్పవృక్షము వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెని టైమ్స్) లలో దాదాపు 70-80% కాలం చెల్లినవి లేదా నకిలీవని మరియు అవి నిజమైన సమాచారం కాదు, అది వ్రాసే వారి వ్యక్తిగత విచక్షణ/వ్యాఖ్యానం/అపోహలు/ అభిప్రాయాలు మాత్రమే అని కొందరు చెప్తే విన్నాను. అది నాకు సరైనదని అనిపించింది.  అభిప్రాయాల సమాచారం ఎక్కువగా మెదడులోకి వెళ్లే కొద్దీ మనకున్న ప్రశాంతత చేజారుతోంది. వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్) లను వీలైనంత వరకు తక్కువగా చదవడం లేదా చూడడం మంచిదనిపిస్తోంది. తీరికగా ఉండి చదివినప్పుడు, ఆసక్తి కలిగించేలా కనిపించినప్పుడు మనకున్న విచక్షణతో అభిప్రాయాల సమాచారాన్ని వడబోసి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎదుటివారికి ఉపయోగబడేదాన్ని/నచ్చే దాన్ని  బట్టి పంచుకోవడంకి సంబంధించి ఆలోచించవచ్చు.  చాలా మంది, వారి ఫోన్ స్టోరేజ్ దృష్ట్యా, ప్రశాంతత దృష్ట్యా ఫార్వర్డ్ లలో వచ్చే ఫోటోలు ఇంకా ఎక్కువుగా వీడియోల వల్ల లాభం కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి వారిపట్ల సహనుభూతితో ఉండడం ఉత్తమం అనిపించింది. ఒకవేళ వాట్సప్ ఫార్వర్డ్ పంచుకోవాలనుకు...