Posts

On K9-DM Course Experience (Telugu 15.04.2026)

Image
⚛️🪷🌳 కేరీర్-9 కాలంలో  నేను నేర్చుకున్న  అంకాత్మక అమ్మకాల ప్రచారం, ప్రచురణ  విషయాలు ఎలా వు(ఉ)న్న  నిశ్శబ్దంగా నిర్మలంగా   వృత్తిపరంగా కన్న కొంచెం వ్యక్తిగతంగా మీరందరి నుంచి నా మదిలో  అందుకున్న అనుభూతులు  అసాధారణంగా అనిపించింది. విస్తృత విశాల అనుభవాలు అందుకుని పరిణితి చెంది పరిపక్వతతో నైపుణ్యాలు నేర్పే ఆసక్తి గల అధ్యపకురాలిగా లక్షణమైన లక్ష్మిగారి విద్యార్థి విద్యార్ధినిలుగా.... వచ్చిన విషయాలను  మరింత మెరుగుపరచుకొన్న నేపథ్యంతో నేర్పుగా  సాయి శామ్యూల్ ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు త్వరితగతిన తరగతి  పాఠాలను పాటిస్తూ  సాధన చేసే శివ, పెళ్లై పెద్దవారిగా పతి, పిల్లల భవ బాధ్యతలను నేరవేరుస్తూ, నైపుణ్యాలు  నేర్చుకునేందుకు, నిండైన  హృదయంతో హాజరైయ్యే స్వాతి సంధ్య  నియతి రాజ్యలక్ష్మి గార్లు... వృత్తి వృద్దికై వచ్చిన  రమ్య రింకీ... అందరు ఆనందంగా  భవిష్యత్తుకై భరోసాగా  ఆశ ఆశయాలతో  సిద్ధమై సానుకూలతతో  హార్దికంగా హాజరవుతూ  నేర్చే నైపుణ్యాలను, అప్పటికప్పుడు ఆరోజే సాధన సే(చే)స్తూ  పాఠాలను పాటిస్తూ...

Self Letter (Telugu 14.04.2026)

Image
⚛️🪷🌳  నాలో నేను నాతో నేను  పరిధి అత్యల్పం  కావచ్చు కానీ  పరిధిలోని ఆలోచనలను వాస్తవంగా వ్రాస్తున్నాను అతిరథుడిని కాను అధముడిని కాను  అందరిలానే  ప్రత్యేకమైనవాడిని‌. అమ్మ అనురాగంతో నాన్న నీడలో  తోబుట్టువుతో తీపిగా పుట్టి పెరిగినవాడిని పరివార ప్రేమలలో మన్నికగా మునిగి భవ భావాజాల భావనలో  స్వీయ కేంద్రీకృత సంచారిని.. అపేక్ష అలజడులు  లేని లాలించే అంతరంగానా ఆనందంగా  ఆలోచనలను ఆలకిస్తు,  అనుభూతులను ఆస్వాదిస్తూ  ఆసక్తితో అక్షరాన్ని అందుకుంటూ ఆసీనుడై  ఆనందంతో అనుసంధానమై రాస్తున్న రమణీయ  లక్షణమైన లేఖ నియంత్రణలేని నైరూప్యమైన  అనాలోచిత అలజడులు ఎలాగున్న ఎదురీదుతూ   ఏలుబడిగా ప్రశాంత పలుకులతో పరిసర ప్రపంచం ప్రశాంతంగా ప్రమోదాన్ని అందుకోవాలని ఆకాంక్షించేవాడిని. కుటుంబంపై కొంత  ఆధారపడిన, ఆపేక్షలు అభ్యంతరాలులేనీ ఆలోచనల స్థితిలో స్థిరంగా సాగుతూ  పరస్పర ప్రశాంతత పొందుతున్న భవ భావ బాటసారిని. అతిథిగా  మీరు నాకు  నేను మీకు  సముద్ర సమక్షంలో  అడుగులోనే అక్కడ  నిలబడి నిర్మలంగా  చూస్తే చుట్టూ...

Editorial on Marriage (Telugu 10.04.2026) (Original Komal Rohit)

⚛️🪷🌳 (అనువాదం) మధ్యలో ఎక్కడో పెళ్లికి సిద్ధమవడం ఆపేసి, కాలం వెంట పడటం మొదలుపెట్టాం. పెళ్లి అంటే సరైన వ్యక్తిని కనుక్కోవడం కన్నా, సరైన భాగస్వామిగా మారడం ముఖ్యం. అది ఎప్పుడూ సులభంగా ఉండటానికి ఉద్దేశించబడలేదు, అది విలవలతో ఉండటానికి ఉద్దేశించబడింది.  విడాకుల రేట్లు యాదృచ్ఛికంగా పెరగడం లేదు. అవి ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ప్రజలకు వివాహం అంటే నిజంగా ఏమిటో అర్థం కావడం లేదు. సామాజిక మాధ్యమాలు మనకంటే ఎప్పుడూ మెరుగైన, అందమైన, మరింత ఉత్తేజపరిచే వ్యక్తులు ఉంటారనే ప్రమాదకరమైన భ్రమను వ్యాప్తి చేసింది. పోలికలు వాస్తవాన్ని చంపేస్తోంది. ఒక రోజు పెళ్లి కోసం నెలల తరబడి ప్రణాళిక వేస్తారు, కానీ జీవితాంతం కలిసి ఉండటానికి, సిద్ధపడటానికి మాత్రం అస్సలు సమయం దొరకడం లేదు. ఈ రోజుల్లో సర్దుకపోవడం ఎలాగో ఎవరికీ తెలియడం లేదు. ఒకరి కోసం ఒకరు సర్దుకునేందుకు బదులుగా కేవలం ఫిర్యాదు చేస్తారు, మౌనంగా ఉండిపోతారు లేదా దూరంగా వెళ్లిపోతారు. వివాహాలను డబ్బు ఒత్తిడి విచ్ఛిన్నం చేయదు. అది బలహీనమైన పునాదులను బయటపెడుతుంది. కలిసికట్టుగా నిర్మించుకోవడానికి బదులుగా, దంపతులు ఒకరికొకరు వ్యతిరేకంగా మారుతున్నారు. మధ్యలో ఎక్కడో, పుర...

Vamsi Sharath Babai (Telugu 09.04.2026)

Image
⚛️🪷🌳  నెల్లూరు నేపధ్యంగా  హైదరాబాదులో పెరుగుతూ  చక్కగా చిన్నప్పుడు  తొలిసారి తాతా  అనే ఆసక్తికరమైన  పలుకులతో పరిచయమై వంశీతాత అని విశేషంగా గాఢంగా గుర్తుంచుకున్నాను. సోమవారం సమయాన  ఉపవాసం ఉంటూ .. తేదీలను వదిలి తిధుల ప్రకారం పుట్టినరోజులు  జయంగా జరుపుకుంటూన్నారు అప్పటివరకు అవగాహనలేని తత్వవేత్తలను తత్వశాస్త్రాన్ని తెలుసుకునే తలుపు తెరిచి  పద్దతైన పిచ్చితో  పరమానందం పొందే  మార్గం మలిచారు. ఆర్థిక అంశాల అధికారిగా  వృత్తిలో వృద్ధి  చెంది చక్కగా  టెబుల్ టెన్నిసులో జ్ఞానబోదకై జాతీయ  గుర్తింపు గడించిన ఘనుడికి వంశీ (బాబాయ్/అన్నయ్య/తాత) హార్దిక హృదయపూర్వక  ఆంగ్ల గ్రెగోరియన్ పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు "వంశీ " పేరుతో పరిచయమైన  నలుగురు, నాకు  నిర్విఘ్నంగా నచ్చారు‌. "వంశీ చతుష్టయం" భావన బలంగా నాలో  ఉన్నతంగా ఉంది. అందులో  బంధుగణంలో భవ్యంగా తారసపడిన వంశీ త్రయం (వంశీధర్, వంశీశరత్ వంశీకృష్ణ(వల్లి) తీరుగా తారాస్థాయిలో  తేలిక, తృప్తితో ఉన్నతంగా ఉన్నారు‌. ((నాల్గవ)వంశీకృష్ణ (నేస్తం)) ...

Health Day (Telugu 07.04.2026)

Image
⚛️🪷🌳 అమూల్యమైన ఆరోగ్యం  అపురూపమైన ఆస్తిగా అందరికీ అందింది.  ఆరోగ్యాన్ని అలానే  అంటిపెట్టుకోవడానికి  ఆసక్తిగా అలవాట్లతో ఆహారం, ఆహ్లాదంతో అనుసంధానమై అందరూ  ఆనందాన్ని అందుకోవాలని  ఆకాంక్షిస్తూ అక్షర ఆకారంలో  ఆలోచన అనుభూతిని  అభివ్యక్తీకరిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖07.04.2026✍️

APU Alumni (Telugu 29.03.2026)

Image
⚛️🪷🌳  విశ్వవిద్యాలయం వారు  ఉన్నత ఉద్దేశాలతో, నిండైన నిధులతో  ఏకమయ్యేందుకు ఏర్పాటుచేసిన సమ్మేళనంలో సంతోషంగా విచ్చేసిన విద్యార్థులు  ఆచార్యులు, అందరం  కలిసి కాలక్షేపం, విలక్షణమైన విశ్లేషణలు  సరికొత్త సంపర్కాలు, సంబంధిత సంభాషణలు  చక్కగా చేసుకుని  చక్కని చిత్రాలు  తీసుకొని, తీపి జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకొని తృప్తిగా మళ్ళీ మా  మార్గంలో మమేకమయ్యాము 💭⚖️🙂📝@🌳 📖 29.03.2026 ✍️

Vamsi Annaiya (Telugu 21.03.2026

Image
⚛️🪷🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల ఆత్మజునిగా ఆనందనామ సంవత్సరంలో సంతసమైన పుత్రునిగా ఫాల్గుణ  శుద్ధ అష్టమి,  శుక్రవారం, ఆరుద్ర  నక్షత్రం నాడు  గూడూరు గడ్డపై పుట్టి  వరంగల్లు వంటి  ఊర్లలో ఉండి నెల్లూరు నేపథ్యంగా పెరిగి మద్రాసులో మొదటి  ఉద్యోగంలో ఉండి  విశాఖపట్నం వనిత కవిత(వదిన)ను కళ్యాణం చేసుకుని చక్కగా  అన్షు ఆర్యలకు  తండ్రివై, తోడుగా  తల్లి చెంత తృప్తిగా గడిపి గడించిన  జ్ఞాపకాలను జప్తుచేసి వృత్తిలో వృద్ధి చెందుతూ చక్కగా  భర్తగా భార్యకు అల్లుడిగా అత్తకు తనయునిగా తండ్రికి భవ్యంగా బాధ్యతలను నిర్వహిస్తూ నడుస్తూ "నిర్వహణ నక్షత్రం"  అయన అన్నయ్య...  "సానుకూల సాటి"గా  విషయ విజ్ఞానం,  విధేయత విధానం వినే విలువ,  ప్రశాంత పలుకులు,  సమగ్ర స్ఫూర్తి,  స్వతంత్ర స్వరం, పొడుగైన పొందిక,  పాకశాస్త్ర ప్రావిణ్యం  కలిగి కదిలే  అన్నయ్య  మనం మౌనంగా  ఆపేక్షలేని అంతరంగాన  నైరూప్యంగా నిర్విరామంగా  ఒకరికి ఒకరం ఆలోచనల్లో అనుసంధానం అయ్యే అన్నదమ్ములం. నాలోన లోలోన...

3) Ugadi (Parabhava 19.03.2026)

Image
⚛️🪷🌳  సహజంగా సంప్రాప్తించే  ప్రకృతి పదార్థాలు, ఆరగించే ఆహార షడ్రుచుల సమ్మేళనాన్ని వుడికించడం, వేయించడం, కాల్చడంతో కాకుండా,  కేవలం కలపడంతో మధురంగా మలుచుకుని  సమభావనతో స్వీకరించి  సేవించగలిగే, సమతుల్య  సచ్చిదానందా సకామక్రియ  ఉగాది పచ్చడి  సానుకూల సారంతో ఉగాది ఉత్తేజానికీ  ఊతమైన ఉదాహరణ. ఆప్తులు అందరికీ హార్దిక హృదయపూర్వక  శ్రీ పరాభవ సంవత్సర  శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳   📖 19.03.2026 ✍️

Karnakar Birthday (Telugu 12.03.2026)

Image
⚛️🪷🌳  కరుణాకర్ గా పరిచమమైన, కర్ణకర్ పేరున్నవాడు. వు(ఉ)మ్మడి వరంగల్  జిల్లాలో జన్మించి ఏకశిలా పాఠశాల ఫాతిమా కళాశాలలో  ఉత్తీర్ణుడై ఉండి ఉన్నత విద్య  ఉస్మానియా విశ్వవిద్యాలయ  పరిధిలోని ప్రఖ్యాత  నిజాం కళాశాలలో  ఆంగ్లభాష అంశాలు అభ్యసించి పట్టభద్రత పోంది జీవనోపాధికై జరిగిన  ప్రయాస ప్రయాణంలో  తేలికగా తొలిసారి  ఆంధ్రజ్యోతిలో అడుగేసి పరిక్షలో పరీక్షించిన  మీదట, మొదటిసారిగా విజయుడై వృత్తిలో  దృక్పథంతో ధృవీకరణకర్తగా  ఉంటూ ఉన్న  కాలంలో కుటుంబం కుదుర్చిన కళ్యాణంతో అఖిలను అర్ధాంగి  చేసుకుని చిద్విలాసంగా  సారాంశప్రాయంగా సంతోషంగా  కొనసాగుతున్న కర్ణకర్ కు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖12.03.2026✍️

On T20 World Cup 2026

Image
⚛️🪷🌳   ప్రఖ్యాత ప్రపంచకప్పు  విజేతగా వుంటూ  దానిని దృఢంగా  నిలుపుకోవాలనే నెపంతో   సానుకూల సంకల్పంతో  మెదులుతూ మొదలైన  ఆరంభ ఆటలలో  క్రికెట్ క్రీడలో  మౌలికసదుపాయాలు మెరుగుగాలేని  జట్లపై జారిన కుదురుకొని కష్టపడుతూ  ఒక్కొక్కరు ఒక్కొక్క  ఆటలో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ ఆడుతూ  వచ్చిన వేళ గెలిచిన గెలుపులతో  బృందదశలో బ్రహ్మాండమైన  అగ్రస్థానం అధిరోహించినా వెలతి వున్న విజయాలను పూర్ణంచేసే విధంగా   దక్షిణాఫ్రికా దృఢంగా ఓడించిన ఒక్క ఓటమితో  మేలుకొని మెరుగై కీలకమైన కాలంలో    కృషితో కలిసికట్టుగా జింబాబ్వే జుట్టుపై  గెలిచి ఘనంగా క్వార్టర్ ఫైనల్ కానీ క్వార్టర్ ఫైనల్లో  వెస్టిండీస్ ను వంచి  సాధికారంగా సెమీఫైనల్లో   హోరాహోరీ  ఆడిన ఆటోలో  ఇంగ్లాండును ఇంటికి  పంపి, ఫైనల్లో  పరుగుల పారించి బాగా బంతులేసి విజేతగా నిలిచి విజేత  బిరుదుని భవ్యంగా నిలుపుకొని నిలిచిన భారత క్రికెట్ క్రీడా బృందానికి  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు మరి ముఖ్యంగ...

On Sanju Samson (Telugu 08.03.2026)

Image
⚛️🪷🌳  సంజు శాంసన్  సభ్యుడిగా సాగుతున్న  ఆరంభ ఆటలలో ఆడే అవకాశం  లభించ లేకపోయినా  అనుకోనీవిధంగా అందిన అవకాశంతో అంచనాలేని  ఆటగాడిగా అడుగుపెట్టి  మోస్తారుగా మొదలుపెట్టి  తర్వాత నుంచి తాదాత్మ్యంగా సంక్లిష్టమైన సమయాలలో  స్థిరంగా సరళంగా నిల్చుని నిలకడగా   పరుగుల ప్రవాహం పారించి ప్రపంచకప్పు పోటీలో  శ్రేష్టుడిగా నిలిచిన శాంసన్_కు శుభాభినందనలు 💭⚖️🙂📝@🌳 📖08.03.2026✍️

Chandu Mama (Telugu 23.02.2026)

Image
⚛️🪷🌳  నిదానమైన  నిర్మాణాత్మకంగా  నడుస్తూ నిలిచి, మాటల మాటున మేధోమథనంతో  మెదులుతూ మెరిసే మామయ్య మీరు .... తల్లితండ్రులకు  తేలికైన తనయుడిగా తమ్ముడికి తోడుగా చెల్లికి చక్కగా  ఆదర్శమైన అన్నయ్యగా అనువైన అర్ధాంగికి  అనుగుణంగా అడుగులేస్తూ, పెద్దనాన్నగా పుత్రులకు  ప్రేమ పెంచుతూ, మేనల్లుడ్ల ముందు  మధురమైన మేనమామగా ఉంటూ ఉన్న  చందుమామకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖23.02.2026✍️ "All Humans are Potentially Unique" Chandu Mamaiya,  You manifested-(ing) your specialty with  Analytical thoughts, Diplomatic words and Calm actions,  with these characteristics in your unique style  You became an influential (Special) person.  💭⚖️🙂📝@🌳 📖23.02.2019✍️ https://bharghavashyam.blogspot.com/2023/02/chandu-mamaiya.html ⚛️🪷🌳 "మానవులందరూ వారి శైలిలో వారు ప్రత్యేకమైన వారు" చందు మామయ్య  మీరు మీ జీవిత ప్రక్రియలో  విశ్లేషణాత్మక ఆలోచనలు,  దౌత్య పదాలు మరియు  ప్రశాంతమైన చర...

Ch.Rama Krishna (Telugu 13.02.2026)

Image
⚛️🪷🌳 ప్రకటనల పరిభాగం  ఆంధ్రజ్యోతిలో అందరికంటే  చిన్నవాడైన చదలవాడ  రామకృష్ణ, నిన్ను రామా   పిలుపుతో పిలిచి  పులకరించేడిని గుంటూరు గడ్డపై పుట్టి పెరిగి చదువుకై చక్కగా ప్రకాశంజిల్లా ప్రయాణించి నెల్లూరు నేపథ్యంలో  ఉద్యోగంలో ఉండి మహానగరం ముందుకు  వచ్చి వాలి ఆంధ్రజ్యోతిలో అడుగుపెట్టి  ప్రవేశ పరీక్షలో ప్రతిభ పాటవాలు  చూపి, చేరి చక్కగా  అంచనాలను అందుకుంటూ ధృవీకరణలో ధృవీకృత సంతకందారుగా సాగుతూ నాణ్యమైన నాణెంలా  ఇరువైపులా, ఇరుగుపొరుగుకు రమణీయత & రాటుతేలినతనం చూపించే చతురుడివి, వంకాయనే వూ(ఉ)తపదంతో మాట్లాడే మాటకారివి. కనుసన్నలతో కదిలించగలననే నమ్మకంతో నడిచే వాడివి, కాలానుగుణంగా క్రమపద్ధతిలో  వస్త్రాలు వరుసగా ధరించేవాడివి, నిగూఢంగా నిర్ణయాలు తీసుకుని తెలియకుండా  అమలు చేసే అపరుడివి, మచ్చికైన మరదలు కుమారిని కలిసి మృదువుగా మెలుగుతూ  నిశబ్దంగా నిశ్చితార్థం  చేసుకుని, చక్కగా పెద్దల సమక్షంలో పెళ్లి  చేసుకొనే చలాకి  ప్రియుడైన ప్రియ మిత్రుడా రామకృష్ణ మనసారా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభ...

Shripad (Telugu 12.02.2026)

Image
⚛️🪷🌳   'చంద్ర రమ'ణీయ తల్లి తండ్రులకు కనిష్ట కుమారుడివై పెద్ద పుత్రునితో సమానంగా సంకల్పంగా లౌక్య లయతో ధైర్యం ధారణజేసి బాధ్యతల బరిలో  దిగి దూసుకుపోతూ ఉంటూ, ఉమ్మడిగా  కుటుంబంలో కలిసి కుటుంబానికి కవచంగా  సాగుతున్న శ్రీపాద  మహిదరుకు మోహనమైన హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖12.02.2026✍️

Subbarao Mamaiya (Telugu 10.02.2026)

Image
⚛️🪷🌳  పరిపక్వత పండిన  ప్రస్తుత పాతపాటి  ప్రియమైన పెద్దవారు" కోమల కాఠిన్యం,  లౌకిక లయ,  సమతుల్య స్థిరత్వం సమయ స్ఫూర్తితో గుణ గంభీరంగా  హుందాగా హుషారుగా   సాగే సుబ్బారావు  మామయ్యకు మనసారా  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖10.02.2026✍️

Ravinder Anna (Telugu 10.02.2026)

Image
⚛️🪷🌳   బాల్యంలో బాగా  ఆటలు ఆడుతూ  చదువులో చురుగ్గా, గణితంలో గణనీయమైన  పట్టు పొంది  కొంత కాలం  సంధ్యా సమయాన  ఉపాధ్యాయ ఉపాధిలో ఆర్థిక ఆరంభం  పొంది, పరివారనికి ఊతంగా ఉన్నారు. ప్రేమను పొందిన ప్రియుడై, భర్తగా బాధ్యతలు అందుకుని అర్ధాంగి, కుమార్తెతో కుతూహలంగా  ప్రణయ ప్రయాణకారి. చిరంజీవిని చిరకాలంగా   ఆదరిస్తున్న అభిమాని. 'వార్త'లోకి వచ్చి, ఆతర్వాత ఆంధ్రజ్యోతిలో చేరి చక్కగా  ప్రకటనలను ప్రణాళికాబద్దంగా  పత్రికలో ప్రచురణకై  సరళంగా సిద్ధపరుస్తూ అభినందనలు అందుకున్న  అధికారి. పత్రికా పరిభాగాన  ఏటా ఏర్పాటుచేసే క్రికెట్టు క్రీడలో  కీలకమైన క్రీడాకారుడిగా విజయుడైన వారు.  బహుళ బహుముఖ  ప్రజ్ఞాశాలి ప్రతిభావంతుడు  హుందాతనం హోదగల రవిందర్ అన్నకు  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖10.02.2026✍️

Hymavathi Nannamma (Telugu 09.02.2026)

Image
⚛️🪷🌳  ప్రపంచమే గ్రామం అవుతున్న అప్పుడు గ్రామమే (ఇల్లే) ప్రపంచంగా  భావించి భవ్యంగా నిలయంలో నిత్యం  నిలిచి నిలకడగా  పాకశాస్త్రంలో ప్రావిణ్యం  పొంది, ప్రతిభగా ప్రతి పూట  వంటల వ్యాపకాలతో గడిపే గృహస్థురాలుగా పుత్రపుత్రిక పౌత్రులకు ఇంటి వద్ద ఇష్టంగా  ఆనందంగా ఆరగించే ఆహారం అందించి ఆనందించే అన్నపూర్ణ  నిరవధికంగా నిత్యం  మెదడుకు మేతమైన పద వినోదినితో ప్రశాంతంగా పరవసిస్తూ హైమావతి నాన్నమ్మకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.02.2026✍️

On Facebook- Reflection (Telugu 04.02.2026)

Image
⚛️🪷🌳  ఈరోజు ఫేసుబుక్ ప్రారంభమైన రోజు. ఈ ఫేసుబుక్ నాకు ఒక వార్తాపత్రిక మరియు దైనందిని. ఇంకా విశ్లేషిస్తూ తాత్వికంగా చెప్పాలంటే నాలోని కవిని రచయితను బహిర్గతం చేసే ఒక బంగారం గని లాంటిది.  ఈ ఫేసుబుక్ (వాట్సాప్) నేను రాసిన ఎన్నో సానుకూల రచనలు, కవితలకు వేదికగా ఉంది. నా రచనలకు వెచ్చించిన సమయం కంటే, వృధా చేసిన సమయమే ఎక్కువ. వృధాను ఆపేస్తే విలువైన విశేషమైనవి రావు అనిపించింది.  బంగారం కోసం తవ్వినప్పుడు ముడి సరుకును బయటికి తీస్తాము, దానిలో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన స్వర్ణం తయారవుతుంది.‌ ముడి సరుకు లేకుండా బంగారం రాదు, కాబట్టి బంగారం కోసంగా ముడి సరుకును (వ్యర్ధాలను) తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేసి స్వచ్ఛమైనది తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాల నుంచి మంచి పొందాలంటే దుర్ఘుణాలను స్వీకరించి వదిలేయాలి.  బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటిని సాధించాలని ఉంది. 💭⚖️🙂📝@🌳 📖04.02.2026✍️  

VK Rachakonda Trip (Telugu 01.02.2026)

Image
⚛️🪷🌳 సంఘ సభ్యులు  (జ్ఞాన)సరస్వతీ సంస్థ సంస్థాపకుడైన సదానందం సహాయంతో సిద్ధమై  వివేకానంద కేంద్ర  వైభవంగా కృతిపరిచి సామూహికంగా సాగిన  పర్వతారోహణ ప్రయాణం  రాచకొండ కోట  రాతి కొండలనుకున్న కానీ కనిపించని చరిత్ర చూసి ఆశ్చర్యం అనిపించింది. కొంతకాలం కాకతీయ  పరిపాలన పరిధిలో  తదనంతరం తదనుగుణంగా  రేచర్ల రాజుల రాజధానై రాణించింది. భాగ్యనగరానికి భాగంగా  ఉండి ఉన్న  తొలి తెలంగాణ  రాజధాని రాచకొండ. ప్రకృతిలో పొందుపరిచిన  కొండలు కొనలు  కార్తీకాన కాంతితో వెలిగే వన్నెల కోటపై కోవెలలు స్థానిక సంస్కృతిని  తతంగాలను తెలుపుతూ  వచ్చిన వెంకటేశ్వర్లు, సహావాసంగా సభ్యులతో తృప్తిగా తిరిగాము. 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️