Swami Vivekananda (స్వామి వివేకానంద) (Telugu 12.01.2024)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము స్వామి వివేకానంద విశ్వనాథ పుత్రునిగా వంగ ప్రదేశమునా విద్యలో వృద్ధిగా వుంటూ విశదమైన విషయాన విలువలు వెతుకుతూ విజ్ఞానమూర్తి (పరమహంస) వద్ద విధేయుడై వుండి విలువైన వేద విజ్ఞానాన్ని వంటపట్టించుకొని, వైరాగ్య విధాన సాధనతో సిధ్ధి సాధించి, సన్యాసిగా సంకల్పంతో నిగ్రహించుకుని, ఓజస్సును నిర్మించుకుని, తేజస్సుతో వూరు వూరు వెళుతూ విలక్షణంగా వివేకానందుడై విదేశంలో వృత్తాంతంతో సర్వమత సౌభ్రాతృత్వ స్పూర్తిగా వైభవంగా వికసించి విజేయుడై విధిగా సమాజ సమానతకు సంస్థ స్థాపించి నీలోనే శక్తి ఉంది నీవు కేవలం అభివ్యక్తీకరించాలంటూ అందరికీ ప్రేరణ కలిగిస్తూ వ్యక్తిత్వ శిఖరంగా ఉన్న వివేకానందునికి జన్మదిన నివాళులు. 💭⚖️🙂📝@🌳 📖12.01.2023✍️