India, The Runner Up (Telugu 19.11.2023)

⚛️🪷🌳

ఆద్యంతం అలరించి
అంతిమ అటలో
బాధాతప్త భావోద్వేగంలో
భాగం చేసిన భారత్ క్రికెట్ 

జట్టు చివరికి గమ్యం చేరలేదు 
కానీ ప్రయాణం బాగా జరిగింది....

ఆస్ట్రేలియాకు అభినందనలు

💭⚖️🙂📝@🌳
📖19.11.2023✍️
----------------------------
మూలం: Rohit Sharma
సంస్కరణ: Bharghav Shyam (14.12.2023)
ఇంకా నేను ఆ ప్రపంచ కప్పు ఓటమి నుంచి బయటపడలేదు. ఫైనల్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు ఏం చేయాలనేది తెలియలేదు.
మేము జట్టుపరంగా మంచి ప్రదర్శన చేశామని ఎప్పటికీ గర్వంగా చెప్పగలను. ప్రతి మ్యాచ్ లోనూ అభిమానులను సంతోషపరచడానికి తీవ్రంగా ప్రయత్నించాం. ప్రపంచ కప్పు ఫైనల్ కు చేరుకోగలిగాం. కప్పును సాధించి ఉంటే అంతకుమించిన బహుమతి మరొకటి ఉండదు. ప్రపంచ కప్పు కోసం కష్టపడ్డాం వరుసగా పది మ్యాచులు గెలిచి... ఫైనల్లో ఏమైనా పొరపాట్లు చేశారా? అని ఎవరైనా అడిగితే మాత్రం.. అవును మేం కొన్ని తప్పులు చేశాము అని చెప్తాను. ఔను నిజంగా ప్రతి మ్యాచ్ లోనూ కొన్ని పొరపాట్లు జరిగాయి. ప్రతిసారీ ఉత్తమ ఆట ఆడలేదు. కానీ, 'ఉత్తమ' స్థాయికి దగ్గరగా వెళ్లి పది ఆటల్లో విజయం సాధించాం. కానీ, ఫైనల్లో మాకు కలిసిరాలేదు.
ఓటమి చవిచూసిన తర్వాత తిరిగి పుంజుకోవడం కష్టమే కానీ.. మళ్లీ జీవితాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ పరాజయం బాధ నుంచి బయటపడేందుకు ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుని బయటకు వచ్చా. అయితే, కొంతమంది అభిమానులు నా దగ్గరకు వచ్చి మేము పెట్టిన శ్రమను, అద్భుతమైన ఆటతీరును అభినందిస్తుంటే కాస్త ఉపశమనంగా ఉంది.  
 
ప్రతి ఒక్క ఆటగాడికి, ఆటలో ఇలాంటి దశ ఉంటుందని అభిమానులు అర్థం చేసుకున్నారు. కోపం, నిరుత్సాహం అవరించినప్పటికీ.. మా పట్ల స్వచ్ఛమైన ప్రేమను కనబరిచారు. ఇలాంటి సమయంలో వారి నుంచి మేం కోరుకునేదదే. అభిమానుల కోసం ఆలోచిస్తే.. వారంతా మాతోనే ఉన్నారు. వారి కోసం తప్పకుండా పుంజుకుని వచ్చేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మరొక అద్భుతమైన బహుమతి కోసం తీవ్రంగా కృషి చేస్తాం"
---------------------
క్రికెట్ అనేది భారతదేశంలో భావాత్మకంగా మతంలాగ కొనసాగుతుందంటారు. ఇప్పుడు అది అంత తీవ్రంగా లేకపోయినా ఏదో ఒక విషయంలో దానిమీద సానుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా లేదా తటస్థంగా నైనా దృష్టి పెడుతూనే ఉంటాం. క్రికెట్ కేవలం ఆట కాదు అది ఒక సామూహిక అనుభూతి అనిపించింది.

కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో వచ్చిన ప్రపంచ కప్ విజయం, ధోని నేతృత్వంలో 2011లో ముంబైలో గెలిచిన ప్రపంచ కప్ కేవలం క్రీడా ఘట్టాలుగా మాత్రమే కాదు, ఇవి భారతీయుల జీవితాల్లో క్రికెట్ ద్వారా పొందిన ఒక భావోద్వేగ శిఖరం అనిపించింది. ఈ గెలుపులు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాయి. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఒకే జెండా క్రింద ఆనందించగలిగారు. ఆ గెలుపు ఒక జాతీయ గర్వం, ఒక భావాత్మక ఉత్సాహం. భారతీయుల జీవితంలో ఒక దశాబ్దాల కాలానికి సరిపడ అద్భుతమైన ఉద్వేగ మధుర స్మృతిగా అనిపించింది. 

ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, విరాట్ కోహ్లీ సారధ్యంలో 2016 నుండి 2020 వరకు అగ్రగామ్య టెస్టు జట్టుగా ఉండడం అనేవి మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి.

ఇక వరిష్ట (సీనియర్) పురుషుల 2015 & 2019 ప్రపంచ కప్పు ఆటలో భారతదేశం సెమీఫైనల్ లో నిష్క్రమించడం, 2021 మరియు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లలో రెండవ స్థానంలో ఉండడం ఒక విధమైన నిరాశ బాధను మాత్రమే కలిగించింది, కానీ 2023 పురుషుల ప్రపంచ కప్‌ లో ఆఖరి వరకు అద్భుతంగా ఆడి తుది పోరులో తడపడి ప్రపంచ కప్ కోల్పోవడం అనేది మాత్రం ఉద్వేగమైన కటిక చేదు గుళిక అనిపించింది. ఆ ఓటమి ఒక మౌన గాయం.

నేను 2011లో భారత పురుషుల ప్రపంచ కప్ విజయానికి ఇచ్చిన విలువ కంటే 2023 ఓటమికి ఇచ్చిన సమయం చాలా ఎక్కువ. ఆ ఓటమి కలిగించిన బాధ అనేక కోణాలలో నన్ను ఆలోచనలలో పడేసింది. అప్పుడు నాలో చాలా మేధోమథనం జరిగింది. 

నిజానికి, క్రీడ అంటేనే ఇది, అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు కప్ గెలుచుకోవచ్చు, కానీ అత్యుత్తమంగా పోరాడిన జట్టు గౌరవాన్ని గెలుచుకుంటుంది. 2019లో ఇంగ్లాండ్ గెలిచిన కానీ, న్యూజిలాండ్ మన్నన పొందినట్టుగా ఉంటుంది.

ఓటమి తర్వాత భారత ఆటగాళ్ల చూపిన భావోద్వేగం, కళ్లలో కనిపించిన బాధ, అది వారి నిబద్ధతకు నిదర్శనం. వారు కేవలం ఓటమికి బాధపడలేదు, తమ దేశం కోసం కప్ గెలవలేకపోయామనే తపనతో ఆవేదన చెందారు. ఆ భావోద్వేగమే మన జట్టుకు ఉన్న బలంగా అనిపించింది

ఈ ప్రపంచ కప్ ఓటమిని ఒక ముగింపుగా కాకుండా, ఒక సరికొత్త ఆరంభంగా చూడాలని అనిపించింది. ఈ టోర్నమెంట్ యువతరానికి ఒక అద్భుతమైన వారసత్వాన్ని ఇచ్చింది. 

ఈ జట్టు కేవలం ఒకరిద్దరి వ్యక్తిగత ప్రదర్శనల మీద ఆధారపడలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మ్యాచ్‌లో హీరోగా నిలిచారు. ఇది ఒక ఆరోగ్యకరమైన జట్టు సంస్కృతికి నిదర్శనం.

ఓటమి తర్వాత కూడా అభిమానులు చూపిన అపారమైన ప్రేమ మరియు మద్దతు, జట్టుకు బలంగా అనిపించింది.

ముగింపులో, 2023 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి ఒక బాధాకరమైన జ్ఞాపకమే కావచ్చు, కానీ ఈ ప్రయాణం మనకు అద్భుతమైన ఆశను మిగిల్చింది. 

ఆ ఓటమి తర్వాత అంతర్జాతీయ పురుషుల భారత జట్టు "ఇంకోసారి సారి గెలుస్తుంది" అనే ఆశ, "ఇంకా మంచి ఆటగాళ్లు ఉన్నారు" అనే నమ్మకం, "మన సమయం వస్తుంది" అనే ధైర్యం కొంచెం వచ్చింది.

కామెంట్‌లు

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)