Trivikram Srinivas (త్రివిక్రమ్ శ్రీనివాస్)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
కళ-అద్దం
సాధారణంగా కళ అనేది సమాజం తాలూకా స్థితిని ప్రతిబింబింపజేస్తుంది తప్ప సరి చేయదు, అద్దానికి పరమార్థమేంటి? ప్రతిబింబాన్ని చూపించడం, అద్దం ఎందుకు ఉంటుంది అంటే ? అద్దం మనతో ఏం మాట్లాడదు, కానీ మనకు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో అని, ఓహో ఇప్పుడు ఈ చొక్కా మనకు సరిపోలేదు, లోపలికి వెళ్లి చొక్కా మార్చుకొని వస్తాం, అద్ధమే లేకపోతే? చొక్కా బాగుంది అనుకొని వేసుకుని వెళ్ళిపోతం, కాబట్టి అద్దం చేసే పనే కళ కూడా చేస్తుంది.
Basically Art reflects the state of society and does not correct it, What is the purpose of the mirror? To show the image, Why does the mirror exist? The mirror doesn't say anything to us, but when we look in the mirror we know what to do and what not to do, oh now this shirt doesn't suit us, we'll go in and change the shirt, if there's no mirror at all? We think the shirt is good and we move forward, So the art will do, what mirror does
Trivikram Srinivas
👁️🗨️👌🔖♻️@🌳
------------------------------------------------
నాయకుడు
కృష్ణ శాస్త్రి గారు ఓ మాట అన్నరు నాయకుడు కానీ కవి కానీ ఎలా ఉండాలంటే, గుంపుతో నడుస్తూ ఉండాలి, కానీ గుంపు కంటే నాలుగు ఆడుగులే ముందుండాలి, నలభై మందు ఉంటే గుంపు ఏమి అనుకుంటుందో వినపడదు, గుంపుకు వారు కనపడరు. నాలుగు ఆడుగులు వెనక ఉంటే వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళని నడపలేరు . అదే నాలుగు అడుగులు ముందు ఉంటే, ముందు వచ్చే ముళ్ళు నీళ్లను చెప్పడనికి వాళ్లతోనే నడుస్తు వాళ్ళ మాటలు వింటు వారికి దారి చూపిస్తారు.
Krishna Sastri ji said, "In order to be a leader or a poet, They must be walking with the crowd, but with just four steps ahead of the crowd,
if they are ahead of forty steps, they will not be visible to the crowd, & can't know what the crowd is thinking, If you are four steps behind, they will mingle with the crowd and Can't be able to lead the crowd. If the same is four steps ahead, they can hear the crowd, guide them by indicating profits and problems in the way.
Trivikram Srinivas
👁️🗨️👌🔖♻️@🌳
----------------------------------------
మూలం- సంస్కృతి
నేను ప్రపంచంలో ఏ ప్రదేశాలు తిరిగిన, నా ఇష్టమైన ప్రదేశం ఇల్లు. ప్రపంచలో ఎన్ని రకల వంటకాలు తిన్న, నాకు ఇష్టమైనది తెలుగు భోజనం. ఎంత గొప్ప పుస్తకం వేరే భాషలో చదివిన నాకు ఇష్టమైన పుస్తకం చందమామ.
ఇలా మనవి అనేవి కొన్ని ఉంటే, మనతో పెనవేసుకున్న కొన్ని విషయాలు, మనం వదలలేము, అవి మన బలం కావచ్చు, బలహీనత కావచ్చు, ఆ బలాన్ని మనం ఎందుకు వాడుకోకుడదు. అమ్మ నాన్న అందంగా, ఆధునికంగా లేరని, వారిని వదిలిపెట్టలేము కదా, మన సంప్రదాయాలు ఎలా ఉన్న గొప్పది అంతే, అందరూ గౌరవిస్తారు కూడ అది నా నమ్మకం.
In the world wherever I travel, my favorite place is home. In the world whatever dishes I eaten, my favorite is the Telugu meal.
In any language, the great book I read, my favorite book is Chandamama. Like this, there are some things that are intertwined in us, some things that we cannot give up, they may be our strength or our weakness, why don't we use that as strength?. If Mom and dad are not beautiful or modern we can't leave them know, like that our traditions also, however it is it will be great, and everyone will respect that, I have that believe.
Trivikram Srinivas
👁️🗨️👌🔖♻️@🌳
-----------------------------------------
గొప్పవి తక్కువ కాదు
కంటికి కనపడదు కాబట్ట గాలికి విలువ ఇవ్వకపోతే కష్టం, గాలి అందకపోతే కొన్ని నిమిషాలకి మించి బతకలేం, ఉపిరి పీల్చడం అలవాటు అయిపోయింది. కాబట్టి, మెదటిసారి ఉపిరి పీల్చడానికి ఇబ్బంది పడి ఏడుస్తాం, ఆ తరువత ఉపిరి పీల్చడం అలవాటు అలుపోతుంది, అది అందనప్పుడు వెంటిలేటర్ పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు, దాని విలువ అర్ధమవుతుంది; అప్పుటికి చచ్చిపొతం, అలాగే విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ అలాంటి మనిషిని గొప్ప విషయాలు గొప్ప వ్యక్తులు గొప్పు వస్తువులు అలవాటు అయినంత మాత్రాన అవి చిన్నవి అపోకుడదు.
It is difficult if you don't value the air because it is invisible to the eye, if you don't get air, you can't live for more than a few minutes. For, the first time we cry because we face difficulty in breathing, and then the breathing becomes natural practice, and when breath is not received, when we are forced to put on a ventilator, then its value is understood; Vishwanath personality, as well as vishwanath's films and the great subjects, great people, great things, are used by us simply, and we should not feel that there small.
Trivikram Srinivas
👁️🗨️👌🔖♻️@🌳
--------------------------------
పుస్తకావిష్కరణ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు:
"సాంకేతికతో పాటు ముందుకు వెళ్లాలని.. పుస్తకాలు చదివితే మనం వెనక్కు వెళ్తామని అందరూ అనుకుంటారు. కానీ, అది నా దృష్టిలో తప్పు. మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మాట్లాడతాం. అదే.. పుస్తకం చదివేటప్పుడు మాత్రం పక్కవాళ్లతో మాట్లాడడానికి కుదరదు. అప్పుడు మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం నేటి తరానికి చాలా అవసరం. అప్పుడే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానంలో మార్పు వస్తుంది. అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడగలుగుతాం. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించే లక్షణం మనుషుల్లో తగ్గిపోయింది. చదవడం వల్ల ఆ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు మనం ఉన్నతమైన వ్యక్తిగా మారతాం. నేను చదివిన చాలా పుస్తకాలు నాలో మార్పు తీసుకువచ్చాయి.
పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని కూడా పుస్తకం శిల్పంలా మారుస్తుంది. చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి' అంటూ పుస్తకం గొప్పతనాన్ని చెప్పారు.
Trivikram Srinivas
👁️🗨️👌🔖♻️@🌳
02.12.2022
---------------------------------------------------
నువ్వే నువ్వే
ప్రతీ కథ ఏదో ఒక చోట మొదలవ్వాలి, నారధుడు వాల్మికి ని ఈ ప్రపంచం లో అందరి కన్నా ఉత్తముడెవ్వరు అని అడగడం తో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకి మాటల మధ్యలో చెప్పిన కథ తో మహభారతం మొదలైంది. ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెరాస్ మీద మొదలైంది.
ఒక అమ్మాయిని ప్రేమించడానికి I Love You అని ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలామందికి వెడ్డింగ్ కార్డులు ఇవ్వాలి. ప్రేమించడానికి డబ్బులు అక్కర్లేదు. కాని పోషించడానికి కావలి.
ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మనం క్షమించగాలగాలి, లేదా మనం ప్రేమించటం లేదని ఒప్పుకోవాలి.
మనం తప్పు చేస్తున్నమె రైట్ చేస్తున్నమె మనకు తెలుస్తుంది.... మనకు ఒక్కరికే తెలుస్తుంది.
మనం నమ్మగలిగేవి (ఇష్టపడేవి) మాత్రమే నిజాలు
భరించలేనివి అన్నీ అబద్దాలు ఐతే చాలా బాగుండేదమ్మా!!!
ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తారు
పెళ్ళి చేసుకొని వెళ్ళేప్పుడు మనల్ని ఏడిపిస్తారు.
డబ్బుతో బ్రెడిని కొనగలరు, ఆకలిని కొనలేరు
బెడిని కొనగలరు, నిద్రని కొనలేరు.
ఎక్కడికి వెళ్ళాలో తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో చెప్పటానికి నేనెవర్ని..
------------------------------------------------------------
అతడు
నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు .. నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధమాడే హక్కు లేదు ...
నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం ..
--------------------------------------------------------------------------
జల్సా
అందంగా ఉండటం అంటే మనకి నచ్చేల ఉండటం ఎదుటివాళ్ళకి నచ్చేల ఉండటం కాదు.
డబ్బు నాకు అవసరం, ఇష్టం కాదు.
కోపం ఒక మనిషికి ఉంటే ఆవేశం. అదే ఒక గుంపుకి ఉంటే ఉద్యమం.
ఆకలేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినపోవడమే ఉపవాసం.. నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా మంచం ఉండి పడుకోకపోవడమే జాగరం... కోపమొచ్చినప్పుడు చేతిలో కత్తుండి తెగనరకడానికి తలకాయ ఉండి కూడ నరక్కపోవడమే మానవత్వం...
యుద్ధంలో గెలవడం అంటే శత్రువులను చంపడం కాదు శత్రువుని ఓడించడం ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం చంపడం కాదు.
----------------------------------------------------
ఖలేజా
నీ నవ్వు వరం, కోపం శాపం, మాట శాసనం.
అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు .. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరము లేదు.
నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర లేదు ..
--------------------------------------------------------------
జులాయి
లాజిక్ లు ఎవరూ నమ్మరు, మేజిక్కులే నమ్ముతారు. అందుకే మనదేశంలో సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్.
"ఇష్టంగా అనుకునేదే అదృష్టం. బలంగా కోరుకునేదే భవిష్యత్తు”
ఆశ, కాన్సర్ ఉన్న వాడిని కూడా బ్రతికిస్తుంది.. భయం, అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది...
తరగతి గదిలో ఎవరైనా సమాధానం చెబుతారు
పరీక్ష గదిలో రాసేవారే ఉత్తీర్ణులు కాగలరు (క్లాసులో ఎవరైనా చెప్పగలరు ఎగ్జామ్ లో రాసే టి టాపర్ అవుతాడు).
మనకు తెలిసిన పని free చేయకూడదు, "మనకు రాని పని try చేయకూడదు.
----------------------------------------------------------------
అత్తారింటికి దారేది
తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది..
వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది...
ఎక్కడ నెగ్గాలో కాదు
ఎక్కడ తగ్గాలో కూడా తెలిసే వాడు గొప్పోడు
-----------------------------------------------------------------------------
S/o. సత్యమూర్తి
పనిచేసి జీతం అడగొచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు, కానీ సహాయం చేసి కృతజ్ఞతలు అడగ కూడదు.
మనం బాగునప్పుడు లెక్కలు మాట్లాడి
కష్టల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు
తెలిసి చేసేది మోసం.. చేశాక తెలిసేది తప్పు.
------------------------------------------------------
అఆ
అవతలి వాళ్ల ఆనందం కోసం, మన పక్కనవాళ్లని బాధపెట్టకూడదు.
గడియారం ఉన్న ప్రతి వాడు సమయం వస్తుంది అనుకుంటాడు, కానీ సమయం తెలుస్తుందంటే
(వాచ్ ఉన్న ప్రతివాడు టైమ్ వస్తుందనుకుంటాడు... టైమ్ తెలుస్తుందంతే)
మాట్లాడకుండా వుంటే ముని అంతరానుకున్నాను.
కానీ మూగోడు అంతరానుకోలేదు.
--------------------------------------------
అజ్ఞాతవాసి
ఇది మనం కూర్చునే కూర్చీ! పచ్చటి చెట్టుని గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడుని బ్లేడుతో సానబెట్టి, ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగుందో కదా! జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల, ఓ మినీ యుద్ధమే ఉంటుంది.
-----------------------------------------------
అరవింద సమేత వీర రాఘవ
దెయ్యాలున్నాయా సార్..
మనుషులకంటే భయంకరమైనవి ఎక్కడుంటాయండీ
ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.. కాని ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడే టార్చ్ బేరర్ అంటారు.. వెళ్తున్నాడు చూశావా? బాలిరెడ్డీ వాడే టార్చ్ బేరర్.
యుద్ధం చేసే సత్తా లేని వాడికి..
శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.
అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు
నువ్వు కత్తి పట్టినట్టు లేదురా..
అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా..
వీరా.. నిన్ను వేలిపట్టి నడిపించాడు.. నువ్ ఇప్పుడు కాటికి నడిపీయాలా
‘కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి?
వయెలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మీ మీద వచ్చిపడ్డ అత్యవసర పరిస్థితి.
అమ్మాయిలు ఒకరిని కావాలి అనుకునే ముందు చాలా ఆలోచిస్తారు, వీడు కాదు విడు కాదు. అని పది మందిని తిరస్కరించి... ఒక్కడి దగ్గర ఆగుతారు.
వాడిని కౌగిలించుకొని కనులు ముసుకోగానే మొత్తం ప్రపంచాన్ని మూసేస్తారు...
కానీ, మీరు అలా కాదు, చూసిన మొదటి అమ్మాయి దగ్గరే ఆగిపోతారు. ప్రేమించకా పోతే చచ్చిపోతాం అంటారు, చేతులు కోసుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. ఆది ఒప్పుకునే దాకా 24/7 టార్చర్ పెట్టేస్తారు...
అవి నిన్ను మొదటిసారి కలిసినప్పుడు, నా సమస్యలకు నీ వల్ల పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాను. ఆ ప్రక్రియలో ఎక్కడో, ఆ పరిష్కారం నువ్వే నమ్మడం మొదలుపెట్టాను. ఉహూ అది తప్పు.
అలాగే నువ్వు.... అమ్మాయిల్ని అబ్బాయిలు కౌగిలించుకొన్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడ్డం మొదలు పెడతారన్నావు. అది కూడా తప్పే.
ఎందుకంటే, ప్రతీ అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామని బయలుదేరుతాడు నా లాగ, అతనికి దార్లో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని కోల్పోతే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది# తర్వాతే మిగతావి అనుకుంటాడు. కాని మీరేమో, నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటాడనుకుంటారు. కానీ ... నేను అలా చేయను అవి.... నా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరికి వస్తాను.
పాలిచ్చి పెంచిన తల్లులు సార్
పాలించడం ఒక లెక్క వీళ్ళకి.
--------------------------------------------------
అల వైకుంఠపురంలో
నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది.
వంటోడికి, వెయిటర్ కి 'NO' చెప్పడం ఈజీ రా..POWERFUL గొప్పోడికి 'NO' చెప్పడం చాలా కష్టం. ఎంత పెద్దోడికి 'NO' చెప్తే, అంత గొప్పోడివి అవుతావ్.
Greatest battles are with closest people
గొప్ప యుద్ధాలు అన్ని నా అనే వారితోనే
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment