పోస్ట్‌లు

అక్టోబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

India Bangladesh Border Issue (T/E 19.10.2026))

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 నిన్న (18.10.2026) భాజపా తన అధికారిక సామాజిక మధ్యమంలో భారతదేశం మరియు బాంగ్లాదేశ్ యొక్క ఎంక్లేవ్‌లకు సంబంధించిన ఒక వీడియోను పెట్టింది. దానిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ సభ్యుడు శ్రీ కొండ విశ్వేశ్వర రెడ్డి భారతదేశంలోని బంగ్లాదేశ్ ఎంక్లేవ్‌లు మరియు బాంగ్లాదేశ్ లోని భారతదేశ ఎంక్లేవ్‌ల గురించి చెప్పారు.  ఆ సరిహద్దు వివాదం గురించి విని మరింత తెలుసుకోవాలి అనిపించింది.   కృతిమ మేధ సహాయంతో వివరాలు తెలుసుకొని విశ్లేషించుకొని మరియు నిర్ధారించుకుని ఈ వ్యాసం రూపొందించాను.  భారతదేశం మరియు బాంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఉన్న ఎంక్లేవ్‌ల (Enclaves / పక్షేత్రాలు) సమస్య శతాబ్దాల నాటిది మరియు అత్యంత క్లిష్టమైనది. 1947లో దేశ విభజన సమయంలో సర్ రెడ్‌క్లిఫ్ గీసిన సరిహద్దుల కారణంగా బాంగ్లాదేశ్‌ భూభాగంలో  భారతదేశ 111 ఎంక్లేవ్‌లు (సుమారు 17,160 ఎకరాలు), అలాగే భారతదేశ భూభాగంలో 51 ఎంక్లేవ్‌లు (సుమారు 7,110 ఎకరాలు) బాంగ్లాదేశ్‌కు కేటాయించబడ్డాయి. దీంతో ఇరు దేశాల ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతాలు వేరే దేశం భూభాగం మధ్యలో చుట్టుముట్టబడి ఉండటం వల్ల...