పోస్ట్‌లు

జూన్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

At BHEL (Telugu 24.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 వర్షం వచ్చి  చెట్లను చక్కగా  తడిపిన తర్వాత రోజున, రమణీయమైన వాతావరణంలో వాన వచ్చే సూచనాత్మక సమయంలో  ఒక్కడినే ఒంటరిగా   వాహనాన్ని వదిలి మార్గ మధ్యంలో  తీసుకున్న తీపి  చిద్విలాస చిత్రం 💭⚖️🙂📝@🌳 📖24.06.2026✍️

Father's Day (Telugu 21.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 🎊తండ్రులందరికీ  పితృ దినోత్సవ శుభాకాంక్షలు 💐 సమతుల్య శక్తితో స్థితప్రజ్ఞునిగా  అపేక్షలేనితనంతో అజాతశత్రువుగా పరిధిలోని ప్రపంచానికి  ప్రేమను పంచే  నాన్న..., నిండైన  నిర్మల నవ్వుతో  నిత్యం నీడనిస్తూ  నడుస్తూ నడిపిస్తూన్న నిశ్చలమైన నాన్నకు...... ధన్యుడినై ధన్యవాదాలతో   ఆంగ్ల పితృ దినోత్సవ  శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖21.06.2026✍️

Photo with Peers (Telugu 20.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 సంవత్సరాల స్నేహం  కానీ, కలిసి తీసుకున్న తీపి ఒక్కటంటే ఒక్కటి  లేనే లేదు, ఇన్నాళ్లకు ఇప్పుడు  చక్కని చిద్విలాస చిత్రం చక్కగా  తీపిగా తీసుకున్నాము. 💭⚖️🙂📝@🌳 📖20.06.2026✍️

Hari Bava (Telugu 11.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 వక్కలంక వారైన గోపాల్ రేణుకా  (అత్తయ్య మామయ్య) దంపతులకు ద్వితీయ  సంతానంగా, సంతోషంగా  పశ్చిమ గోదావరిలో పుట్టి  తల్లిదండ్రులతో తూర్పుగోదావరిజిల్లాకు   చిద్విలాసంగా చేరి గోదావరి గలగలల రాజమండ్రిలో రూపాంతరం చెంది చక్కగా చదువుకుని మహానగరం ముందుకు  వచ్చి వాలి పట్టభద్రత పొంది  ప్రఖ్యాత పత్రిక  “ఈనాడు”లో హాయిగా ఈది సత్యంలో సంతసంగా సాగి పోటీ పరీక్షలలో  ఉత్తీర్ణులై ఉండి,  తృటిలో తప్పిన  బృహత్ బ్యాంకు  అధికారి అవకాశాలను  మరిచి మరల  వడివడిగా వృద్ధి అవుతూ, ఆతర్వాత  హైదరాబాదులో హృద్యంగా  శంకరమఠంలో శుభశకున  సమయాన, స్వామి సమక్షంలో  భవ్యంగా భావించి  నిశ్చయమైన నిశ్చితార్థంతో నెల్లూరు నేలపై కళ్యాణంతో జ్యోతిని కలిసి భాగ్యనగరంలో భార్యాభర్తలుగా చేరి చక్కగా సాయిముకుంద్ శ్రీలహరి సంతానంతో  సానుకూలంగా సాగుతున్న  హరిబావ…. హార్దిక హేతుక హృదయంతో  హృద్య హాస్యలను హారంగా హేతుబద్ధ హామీతో  హోదా పెంచే  హుందాతన హరి(బావ)కి  హార్దిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖1...

Hyper Aadi (Telugu 06.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳  ( అతిశయ ఆది ) ⚡హైపర్ ఆది 🌞  😁 హాస్యపు ఆనందం 🙂 ఫేసుబుక్‌లో పవన్ కళ్యాణ్ అత్తారింటికిదారేది అనే అనుకరణాత్మక లఘుచిత్రంతో లీలగా  అదిరే అభికు దగ్గరై, దక్షతతో నీడన నడిచి  జనరంజకమైన జబర్దస్తులో  ప్రవేశం పొంది, రిక్షా లాగుతూ  హాస్య ప్రహసన (కామెడీ స్కిట్)ల వేదికపై వచ్చి  కొద్దిసేపు కనపడి  కనుమరుగై, క్రమంగా బహుముఖ ప్రజ్ఞా బ్రహ్మానందం  “అతడు”  సినిమా స్ఫూర్తితో కష్టంతో కృషిగా ప్రస్తుత పరిస్థితుల సహజమైన సామాజిక అంశాలతో అనుకూలంగా  రసజ్ఞతమైన రచనలు రాసి చక చకా చమత్కారపు  ప్రాసల పదాలు పలుకుతూ హైపర్ ఆది  బిరుదుతో భవ్యంగా రైసింగ్ రాజుతో బృందనాయకుడై బ్రహ్మాండంగా సమూహాన్ని సృష్టించుకుని సమతుల్యంతో సమన్వయంగా వేదిక వెనుక  పద్ధతిగా పరస్పర  అవగాహన, అంగీకారంతో సిద్ధమై, సహచర సభ్యులతో వేదికపైకి వచ్చి  పేల్చే పలుకులు (పంచులు) అదరహో అనిపిస్తుంది.  నీకై నీవు తెలుగులో తయారుచేసిన  స్వంత సంపాదకీయం(స్క్రిప్ట్)లో  మొదట మోసం చేయాలనుకుని  మొదటికే మోసపోయేవిధంగా చూపిస్తూ నిగూఢంగా నైతికను  నేర్పించే నేర్పరి...

World Environment Day (Telugu 05.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 మన ముందు  కనిపిస్తూ కనిపించకుండా, ప్రాణంతో, ప్రాణరహితంగా ప్రాణులు పదార్థాలు ప్రకృతిలో పాలుపంచుకున్న జీవులు: వృక్షాలు, జనాలు, జంతువులు,  నిర్జీవులుగా నిండున్న  ఘన ద్రవ వాయు  రూపాలలో రాళ్లు ఖండాలుగా ఖనిజాలు  రసాయనాలు,  ఇంధనం ఇలా ఉండి ఉన్న  సకల సమ్మేళనం పర్యావరణం. పర్యావరణంలో ప్రధానంగా పంచభూతాలు  (నింగి, నేల,  నీరు, నిప్పు,  వాయువు) వున్నాయి.  దాని ద్వారా  విభాగాలుగా వున్న “వాతావరణం (వాయువు),  జీవావరణం (జీవులు)  జలావరణం (జలం)  శిలావరణం (భూమి)” నాలుగు నిశ్చయంగా  అంతర్లీనంగా అంతర్భాగం  అయ్యాయి.  పర్యావరణంతో ప్రజలు పాలుపంచుకుంటూ పరస్పరం  ప్రయోజనం పొందుతూ వస్తున్న వేళ,  పర్యావరణంలో భాగమైన ప్రజలు  పర్యావరణాన్ని విడి భాగంగా ప్రజలు పర్యావరణాన్ని పరికిస్తూ.. ప్రయోజనాలు అధికంగా  ప్రయాసలు అత్యల్పంగా  ఉంచాలనుకునే ఉద్దేశంతో  మానవ మేధస్సు పర్యావరణంలోని పదార్థాలను  పరాక్రమంతో, ప్రయోగాలతో అనుకూలంగా అన్వయించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉత్తమ ఫలితాలు,   అందుకుంటోంది....

Telangana Formation Day (Telugu 02.06.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 ద్రవిడ ఆధారాల ద్వారా దేశంలోని దక్షిణ (తెన్) పీఠం పై ఉండి ఉన్న  భౌగోళిక భూమి, సంస్కృతం సాక్ష్యంగా  శ్రీశైల భీమేశ్వర కాలేశ్వర   మధ్యన మమేకమైన  త్రిలింగ నేపథ్యంతో తెలుగుగా ఏకీకృతంగా ఏర్పడిన భవ్యమైన భాష తెలుగు.  తెలుగు తెలిసిన  వారందరు వున్న  ప్రదేశంగా  ప్రఖ్యాతిగాంచిన పదం తెలంగాణ. భవ్య భారతదేశం  స్వాతంత్ర్యం సాధించిన తరువాత, తెగువతో  కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాలతో నిజాం నవాబు నుంచి  సైనికచర్యతో సాధించి విలక్షణంగా విలీనంచేసి “హైదరాబాద్ రాష్ట్రం”గా సాగుతున్న సమయాన,  భాష ప్రాతిపదికన భవ్యంగా భారతప్రభుత్వం రూపొందించిన బృహత్ “రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టంతో” “ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రం”  అనుసంధానమై అవతరించిన  “ఆంధ్రప్రదేశ్”లో  సూమారు 58 సం. ల అనుబంధం తర్వాత “తెలంగాణ” కొన్ని కారణాలతో రాష్ట్ర ఏర్పాటుకై  సాగిన సాధనలో పాల్గొన్న ప్రజలు, నేతలు, నాయకుల సంకల్పంగా సాధించి, రాష్ట్రంగా ఏర్పాడి రాణిస్తున్న తెలంగాణ వారందరికీ తీపిగా  రాష్ట్ర అవతరణ దినోత్సవ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂...