అలవాటుకు సంబంధించి ఒక కథ...

⚛️🪷📧

పరీక్షల కోసం చదవడం అప్పుడు నాకు ఒత్తిడితో కూడిన వ్యవహారం లా అనిపించేది, పాటలు వింటూ నడవడం అనేది ప్రశాంతత కోసం నాకు నేను ఏర్పుచుకున్న ఒక అలవాటు.

అప్పుడు నా పిజి మొదటి సంవత్సరం వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి, ఇక రెండో సంవత్సరం ఎంత కష్టంగా ఉంటుందో అని ఊహిస్తే భయం వేసేసింది, ఎలా దాన్ని ఎదుర్కోవడం అని మదన పడిపోయి, చింతలో ఉండిపోయాను. సరే ఇప్పుడు అన్ని మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా పాటలు వింటూ నడుద్దాం అనుకుంటూ బయటికి వచ్చి పాటలు వింటూ నడుసున్నాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. 

ఎల్లుండి కళాశాల ప్రారంభమవుతుంది, రెండు రోజుల్లో పాఠాలు చెప్పడం మొదలుపెడతారు, ఒకటిన్నర నెలల తర్వాత పరీక్షలు ఉంటాయి. అప్పుడు రాసే పరీక్షల కోసం ఇప్పటినుంచి ఎందుకు బాధపడాలి అనే ఆలోచన వచ్చింది. మనసు తేలికయ్యింది. మనం నిదానంగా చదువుతూ ఉంటే పరీక్షల్లో ఒత్తిడిని చిత్తు చేసి ఉత్తీర్ణులు అవ్వడం సులభం అనిపించింది. ఆ నడకలో ఇలా ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. 

నిజంగా అప్పటి ఇష్టమైన అలవాటుతో వచ్చిన ప్రశాంతతో వచ్చిన ఆలోచనలు నా విద్యను వర్గీకరించి సరళంగా బాగా చదవడం కోసం ఉపయోగపడ్డాయి, ఒక పరిష్కారం చూపించాయి. ఆ తర్వాత నుంచి నేను చదువును పెద్ద ఒత్తిడిగా తీసుకోలేదు. 

దీనికి సంబంధించి నేను విన్న ఒక కథ ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను, ఒక పేదవాడు కట్టెల వ్యాపారి దగ్గర ఉద్యోగంలో చేరుతాడు, అతను రోజు అడవికి వెళ్లి చెట్లను కొట్టి కట్టెలు తేవడం తన బాధ్యత, తను మొదటి రోజు ఐదు చెట్లు కొడితే, మూడోరోజు నాలుగు చెట్లు, ఐదో రోజు రెండు చెట్లు ఇలా చెట్లు కొట్టే సామర్థ్యం తనలో తగ్గుతూ రావడం చూసి ఆశ్చర్యపోయిన వ్యాపారి, అతనితో నీలో చెట్లు కొట్టే శక్తి ఎందుకు తగ్గుతుంది అని ప్రశ్నిస్తాడు, దానికి తను అయ్యా నేను మొదటి రోజు కంటే ఎక్కువ కష్టపడుతూ ఉన్నాను కానీ తక్కువ చెట్లే కొట్టగలుగుతున్నాను ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి తన గొడ్డలిని చూసి నువ్వు గొడ్డలిని పదును పెట్టట్లేదు, నువ్వు ప్రతిరోజు గొడ్డలిని పదును పెడితే, ఇంకా ఎక్కువ చెట్లను కొట్టగలవు అని చెప్తాడు. పదును పెట్టడం అనేది, ఐదు నిమిషాల పని దానివల్ల తనకు వచ్చే ఫలితం తన శ్రమ తేలిక అవుతుంది ఫలితం అధికంగా వస్తుంది. 

ప్రశాంతత కోసం తీసుకునే నిర్ణయం కంటే, ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకున్న సానుకూల అలవాట్లు ప్రశాంతతను చేకూరుస్తాయి, అప్పుడు తీసుకున్న నిర్ణయాలు మన శ్రేయస్సుకు దోహదపడతాయి.


💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. ఇలాంటివీ చాలా బాగా రాస్తావు.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పావు ముఖ్యంగా "ప్రశాంతత కోసం తీసుకునే నిర్ణయం కంటే, ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడం మంచిది." ఇది నాకు చాలా బాగా నచ్చింది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao