Hindu Arabic Numeric System (English/Telugu)

⚛️🪷🌳

హిందూ-అరబిక్ వ్యవస్థ:- సున్నా - సమస్తం: ఘన గణిత విశ్వ విస్తృత విప్లవం

మనం ఇప్పుడు 0-9 అంకెల పద్ధతి‌ హిందూ అరబిక్ సంప్రదాయం ప్రకారం ఉపయోగిస్తూ ఉన్నాము. ఈ అంకెల పద్ధతి ప్రపంచంలో ప్రామాణికమైనది, సమర్థవంతమైన సంఖ్యా వ్యవస్థలలో విశేషమైనది. 

ఈ పద్ధతి భారత గణిత శాస్త్రవేత్తల ఆవిష్కారంగా ఆవిర్భవించింది. ఈ భారతీయ పద్ధతిని ఆరబ్ గణిత శాస్త్రజ్ఞులు అభ్యసించి వారి ప్రాంతాలకు తీసుకువెళ్ళారు, వారి ద్వారా యూరప్‌కు ఈ పద్ధతి పరిచయమయ్యింది. యూరప్ గణిత శాస్త్రజ్ఞులు ఈ పద్ధతిని అధ్యయనం చేసి అనేక గ్రంథాల ద్వారా ఘనమైన గణిత వ్యవస్థ మరింత ముమ్మరంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.

మొదట భారతీయ గణిత శాస్త్రజ్ఞుల ద్వారా ప్రారంభమైన బ్రాహ్మీ పద్ధతి లో 1 నుండి 9 వరకూ అంకెలను ఉపయోగించేవారు‌. ఆర్యభట్టు శూన్యం (0) అనే అంకెను ప్రవేశపెట్టి గణితంలో మహత్తరమైన మార్పులతో ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. 

సంఖ్యాలలో సున్నా లేకుండా సంఖ్యలను సమర్థవంతంగా వ్రాయడం అసాధ్యం. ఈ పద్ధతిలో ఒకే అంకెను విభిన్న స్థానాల్లో ఉపయోగించడం ద్వారా పెద్ద సంఖ్యలను సులభంగా రూపోందించగలడం, దశమాంశపు (Decimal) పద్ధతి (10) ఆధారంగా ఉండడం వల్ల పెద్ద సంఖ్యలను సులభంగా అర్ధం చేసుకోవడం, స్థాన విలువ పద్ధతి ద్వారా సంఖ్యలను సరళంగా జోడించడం మరియు విభజించడం వంటి విధానల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ గణిత విజ్ఞానం విస్తరించడానికి సహాయపడింది.

రోమన్ అంకెలు, బబిలోనియన్ అంకెల వ్యవస్థ: రోమన్ అంకెలు చదవడం కష్టంగా ఉండడం, పెద్ద సంఖ్యలను ప్రదర్శించడం చూపడం, కూడికలు తీసివేతలు కొద్దిగా కష్టంగా దానికి ఉన్న పరిమితులు. బబిలోనియన్ సంఖ్యా వ్యవస్థలో 60 అంకెలు ఉన్నాయి, ఇది అనేకులకు అర్థం చేసుకోవడం కష్టం, తీసివేతలు లేకపోవడం దీని పరిమితులు. ఇలా ఆ ఇతర పద్ధతుల కంటే హిందూ అరబిక్ పద్ధతి సమర్థవంతంగా మరియు సులభంగా ఉండడం వల్ల ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని ప్రామాణికరించింది. 

ఐచ్ఛికేతరంగా ఇప్పుడు మనం దీనిని ధృడంగా విద్యా, వాణిజ్య ఆర్థిక అంశాలలో, సమయం, సాంకేతికలో ఉపయోగిస్తూ ఉన్నాము.

💭⚖️🙂📝@🌳
📖03.01.2025✍️
---------------------------


Hindu-Arabic System: From Zero to Infinity – A Profound Mathematical Revolution

We currently use the 0-9 numeral system, which follows the Hindu-Arabic tradition. This numerical system is recognized as one of the most efficient and standard systems globally.

This system originated from the discoveries of Indian mathematicians. The Indian method was studied by Arab mathematicians, who took it to their regions. From there, it spread to Europe, where European mathematicians further developed and popularized it through various studies, making it a cornerstone of mathematics.

Initially, the Brahmi numeral system, developed by Indian mathematicians, utilized digits from 1 to 9. Aryabhata introduced the concept of zero (0), it brought a revolutionary change in mathematics and marking the beginning of a new era.

Without zero, it would be impossible to represent numbers effectively. This system's ability to use the same digit in different positions to represent large numbers, its foundation on the decimal (base-10) system, and its place-value system made it easy to perform operations like addition, subtractions, multiplications divisions. These features significantly contributed to the global dissemination of mathematical knowledge.

Roman Numerals and Babylonian Number Systems: Roman numerals were challenging to read, cumbersome for representing large numbers, and made operations like addition and subtraction more complex and it became their limitations. Similarly, the Babylonian number system, which used a base-60 system, was difficult for many to understand and lacked subtraction methods.

In contrast, the Hindu-Arabic system proved far more efficient and simple, making it the standard numerical system worldwide.

Today, this system has become indispensable in fields like education, commerce, finance, timekeeping, and technology, ensuring its strong foundation and widespread use.

💭⚖️🙂📝@🌳
📖03.01.2025✍️

Comments

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

PV Narasimha Rao