On Aesthetics by Metaphor (Telugu 30.12.2025)

⚛️🪷🌳

సాధారణంగా ఆభరణాలు అన్ని స్వర్ణంతో చేస్తారు, కొన్ని మాత్రమే ఇతర లోహాలతో చేస్తారు, లోహాల్లో కొన్ని స్వర్ణం కంటే ఉన్నతమైనవి, కొన్ని కావు. కానీ ప్రతి ఆభరణం విలువైనదే. ఆభరణాలు కొన్ని సాంప్రదాయంగా, కొన్ని ఆధునికంగా, కొన్ని సరళంగా, కొన్ని సున్నితంగా, కొన్ని స్థూలంగా, కొన్ని తేలికగా ఉంటాయి. ఇలా ప్రతి ఆభరణం ప్రత్యేకమైనదే. 

దాదాపు అందరూ స్వార్జితంతో ఆభరణాలను పొందుతారు, ఇది చాలా మేలైన మార్గం, ఉత్తమమైనది. కొందరికి వంశపారంపర్యంగా లభిస్తుంది, ఇది వారి యోగ్యత ఆధారంగా ఉంటుంది. ఇది ఆమోద యోగ్యమైనది. కొందరు వేరే వారికి చెందిన దానిని తెలివిగా, ఒక రకమైన గౌరవంగా సమ్మతితో అనుభవిస్తారు అది వారి లౌక్యం, ఇది మధ్యమమైనది. కొందరు దౌర్జన్యంతో దోచుకుంటారు అది దోపిడి, ఇది హేయమైనది.

ఎప్పుడైనా ఎక్కడైనా ఆభరణాలు సంస్కృతిని చాటడానికి, విలువను చూపించడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి, అందాన్ని పెంచుకోవడానికి, గౌరవాన్ని పొందడానికి, గొప్ప అనే గర్వాన్ని ప్రదర్శించడానికి, ఇలా కొన్ని కారణాలు చేత ఆభరణాలు ప్రదర్శనలలో ఉంచబడతాయి, అప్పుడు ఆ సమయంలో ప్రదర్శనకు ఉంచిన ఆ ఆభరణాలను ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది.

కొన్నిసార్లు మనకు తెలిసిన లేదా తెలియని వాళ్ళ దగ్గర ఆభరణాలు కంటబడతాయి, అప్పుడు చూడడంలో ఆమోదయోగ్యం కాకపోయినా తప్పు కాదు. కానీ చూసినప్పుడు వారికి సోంతమైనది పొందాలనుకోవడం తప్పు. అయినా సరే నచ్చింది పొందాలి అనుకుంటే గౌరవంగా సమ్మతితో పొందాలి.

కొన్ని నగలు వ్యాపారశాల దగ్గర ఉంటాయి, అందులో కొన్నిచోట్ల ఆకర్షింపజేసేందుకు ప్రదర్శనకు ఉంచుతారు, కొన్ని చోట్ల భయం లేదా అనుమానం వల్ల ప్రదర్శనకు ఉంచరు, కానీ లోపలికి వెళ్లి చూడవచ్చు. వ్యాపారశాల్లో అనుమతితో వాటిని పరీక్షించవచ్చు, బేరసారాలు చేయవచ్చును. డబ్బు చెల్లించి సొంతం చేసుకోవచ్చు లేదా అద్దె చెల్లించి  కొంత కాలం పాటు ఉపయోగించుకోవచ్చు. చాలా కొన్ని సార్లు నచ్చితే ఉచితంగా అయినా నగలు ఇస్తారు.  వ్యాపారశాల ప్రదర్శనలు, ప్రకటనల వలన సొంతం కానీ ఆభరణాలను ఎక్కువ మంది ఉచితంగా చూసి  ప్రేరణ పొందుతారు, ఉత్సాహం చెందుతారు, ఉద్దీపులవుతారు, ఉద్రిక్తలవుతారు. ఇక్కడ పొందే వారి‌ విచక్షణ ముఖ్య భూమిక పోషిస్తుంది.

ఇలా ఆభరణాలను కొన్ని నిర్ణీత నియమాలతో చూపడంలో, చూడడంలో, పొందడంలో తప్పు లేదు. కానీ అర్హత, యోగ్యత, సమ్మతి, లౌక్యం, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవం లేకుండా వాటిని పొందాలని అనుకోవడం తప్పు, కొన్ని సార్లు నేరం కూడా.

స్థూలంగా, మనకు చెందని ఆభరణాలు, స్త్రీ అందం ప్రదర్శన కూడా ఇలాంటిదే! కానీ స్త్రీల అందం ప్రదర్శనలో స్థిర నియమాలు ఏమి లేవు. అవి వ్యక్తిగతమైనవి, వాటికి ఇష్టం, సౌకర్యం, ధైర్యం, గౌరవం, గుర్తింపు, ఒప్పందం లాంటి కారణాలు ఉంటాయి. పరిధి దాటి పొందాలనుకోవడం అత్యాశ. ఎవ్వరైనా ధైర్యం చేయాలంటే పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలి.

ఇక్కడ స్త్రీలను వస్తు రూపేణా చూపడం, స్తోమత ఉందని బహుళత్వాన్ని ప్రేరేపించడం ఏ మాత్రం నా ఉద్దేశం కాదు. ఇష్టం, సౌకర్యం, ధైర్యం, సమ్మతి, స్వేచ్ఛ, గౌరవం అనేవి నిర్వివాదంగా పరస్పరంగా ఉంటాయి. 

సున్నితమైన విషయాన్ని అర్థమయ్యే విధంగా వ్రాయాలనుకునే ప్రయత్నంలో రూపకాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ వ్యాసం వ్రాశాను.
సంపాదకీయం 
💭⚖️🙂📝@🌳
📖30.12.2025✍️


Generally, all jewelry is made of gold, only some are made of other metals, some of those metals are superior to gold, some are not. But every piece of jewelry is valuable. Some jewelry is traditional, some modern, some simple, some delicate, some bulky, some light. Each piece of jewelry is unique.

Almost everyone acquires jewelry by self acquisition, which is the good way, the best. Some get it through hereditary, which is based on their merit and availability, which is acceptable. Some enjoy what belongs to others wisely, with a kind of respectful consent, which is their modesty, which is moderate. Some rob it with violence, which is robbery, which is crime.

Anytime and anywhere, jewelry is put on display for some reason to show culture, to show value, to reflect personality, to enhance beauty, to show honor and pride, then they display their jewelry at that time, If we see, that will be good.

Sometimes we see jewelry from people we know or don't know, and it is not wrong to see it, even if it is not acceptable. But it is wrong to want to get something which is theirs when we see it. However, if we want to get it, we should get it with respect and consent.

Some jewelry is near the store, in some places it is put on display to attract attention, in some places it is put on display due to fear or suspicion, but you can go inside and see it. In the store, you can test it and bargain with permission. You can pay money and own it or you can use it for a while by paying rent. Many times, if you like it, the jewelry is given away for free. Due to store displays and advertisements, most people get inspired, excited, excited, and tense when they see jewelry that is theirs for free. Here, the discretion of the person receiving it plays an important role.

There is nothing wrong with showing, looking at, and getting jewelry with certain rules.  But it is wrong, sometimes even a crime, to want to get them without qualification, competence, consent, modesty, and above all respect.

Broadly speaking, the same is true of jewelry that does not belong to us, and the display of female beauty! But there are no fixed rules in the display of female beauty. They are personal, and they are motivated by reasons such as liking, acceptance, courage, respect, recognition, and agreement. Wanting to get beyond the scope is greed. If anyone dares to do so, they must be ready for the consequences.

Here, it is not my intention to show women as objects, to inspire the existence of wealth and plurality. Like, pleasure, courage, consent, freedom, and respect are indisputably interrelated.

I have written this article by taking an example in an attempt to write in a way that is understandable and sensitive.
Editorial
💭⚖️🙂📝@🌳
📖30.12.2025✍️

Comments

  1. బావుంది మీ వ్యాసం- సంపాదకుడు గారు.

    ReplyDelete
  2. మూలం

    నగల షాపు లో నగలను డిస్-ప్లే లో పెడతారు. అది షాప్ వాడి అవసరం. వాడి నగలను ఎక్కువమంది కస్టమర్స్ చూస్తూ ఉంటే సంతోషపడతాడు. కస్టమర్స్ నగలను సొంతం గా తాకకూడదు. షాప్ వాడి అనుమతి తో వాటిని పరీక్షించవచ్చు. బేరసారాలు చేయవచ్చును. డబ్బు చెల్లించి మాత్రమే ఇంటికి తీసుకొని పోవాలి. ఇలా కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి.
    స్థూలం గా స్త్రీల తో ఇంటరాక్షన్ కూడా ఇలాంటిదే!
    అయితే, స్త్రీల తో ఇంటరాక్షన్ విషయం లో స్థిరమైన రూల్స్ ఉండవు. చాలా వరకూ రూల్స్ అనేవి స్త్రీల సబ్జెక్టివ్ విషయం గా ఉంటాయి. ఒక షాప్ వాడు నగలను చూడనివ్వడు, ఇంకో షాప్ వాడు నగలను ను చూడనిస్తాడు కానీ తాక నివ్వడు. ఇంకో షాప్ వాడు వాడి నగలను మెచ్చుకొంటే సంతోషపడతాడు. మరొక షాప్ వాడు వాడి నగలను మేచ్చుకొంటే వాడిని బురిడీ కొట్టిస్తున్నారేమోనని అనుమాన పడతాడు. ఒక షాప్ వాడి దగ్గర బేర సారాలకు తావు ఉండదు. మరొక షాప్ వాడికి దగ్గర బేరసారాల మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో షాప్ వాడు క్రెడిట్ కార్డ్ మీద ఇస్తాడు. మరి ఇంకో షాప్ వాడికి కస్టమర్ నచ్చాలి . కస్టమర్ నచ్చితే ఉచితం గా అయినా నగలు ఇచ్చేస్తాడు.
    కాబట్టీ ఏదైనా షాప్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ షాప్ వాడు ఎలాంటి వాడో తెలుసుకొని ఎంటర్ అవ్వటం మంచిది. దాని కోసం షాప్ వాడితో పరిచయం పెంచుకోవాలి. వాడికి నచ్చాలి. ఇదేమీ లేకుండా షాప్ లోకి వెళ్ళి నగ ను పట్టుకొంటే, ఫలితం అనూహ్యం గా ఉంటుంది. ఒక షాప్ వాడు పోలీస్ లను పిలవ వచ్చు. ఇంకొకడు వాడి నగ మీకు నచ్చినందుకు సంతోషించి మీతో బేరం కుదుర్చుకోవచ్చు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)