Raghu Gari Birthday (Telugu 10.08.2026)

⚛️🪷☀️🍃@🌳

ఆనందంగా ఉండే అదృష్టవంతులు
పరవశించే ప్రయత్నాలలో 
లీనమై లంకించేవారు.
విమర్శలను విస్మరించే వ్యక్తిత్వంతో,
మిమ్మల్ని మీరు ఉన్నంతగా భావిస్తూ 
ఉల్లాసంగా ఉంటున్నారు. 

ప్రోత్సహించడంలో ప్రేరణగా
సందేహాల నివృత్తికై నిక్కచ్చిగా,
తినేందుకు తృప్తికరమైన
వంటలు వండించుకుని 
తరగతి సభ్యులకు తెచ్చేవారు 
బరువు బాధ్యతల
నుడుమ నవ్వుతూ నడిచేవారు

కరుణామయుని కటాక్షంతో 
సౌఖ్యంగా సాగుతున్నారు 
మీరు మరింత
తృప్తితో తాదాత్మ్యంగా
తిరగాలని తలుస్తూ
హార్థిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు 
రఘుగారు
💭⚖️🙂📝@🌳
📖10.08.2026✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)