Pedda Nanna Birthday (Telugu 04.08.2026)
⚛️🪷☀️🍃@🌳
నాన్నమ్మ లక్ష్మీనరసమ్మ &
ఆమంచర్ల ఆదిశేషయ్య
తాతయ్యకు తనయునిగా
పెద్ద పుత్రునిగా పుట్టిన
పెద్ద పెద్దనాన్న…..
మీరు
అన్నట్లుగా, అందరూ
కోరుకునేవన్ని కోరుకోకుండానే కానుకగా
ప్రసాదంలా పొందారు.
మంచి మాతపితలు
చక్కని చదువు,
సౌభాగ్యమైన సుందరి
ధర్మపత్నిగా దరిచేరింది,
సంతానం సదా
సన్నద్ధతతో సంరక్షణగా
నిలిచి నిలపెడుతున్నారు,
సహోదరీ(లు) సహోదరుడు(లు)
తోడుగా తీపిగా
భవ్యంగా బాసటనిస్తూన్నారు,
ఉన్నత ఉద్యోగం
వృత్తిలోను వృద్ధాప్యంలోను
ధృడత్వం ధైర్యం
ఇంపుగా ఇస్తోంది.
దైవం దీవించబడిన ధన్యులు
దాన్ని ధృడంగా ధ్యానంతో
భవ్యంగా బలపరచుకుంటున్న..
పెద్ద పెద్దనాన్న
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖04.08.2026✍️

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి