On WhatsApp Forwarded Messages (Telugu)

⚛️🪷📧

వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెని టైమ్స్) లలో దాదాపు 70-80% కాలం చెల్లినవి లేదా నకిలీవని మరియు అవి నిజమైన సమాచారం కాదు, అది వ్రాసే వారి వ్యక్తిగత విచక్షణ/వ్యాఖ్యానం/అపోహలు/ అభిప్రాయాలు మాత్రమే అని కొందరు చెప్తే విన్నాను. అది నాకు సరైనదని అనిపించింది. 

అభిప్రాయాల సమాచారం ఎక్కువగా మెదడులోకి వెళ్లే కొద్దీ మనకున్న ప్రశాంతత చేజారుతోంది. వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్) లను వీలైనంత వరకు తక్కువగా చదవడం లేదా చూడడం మంచిదనిపిస్తోంది.

తీరికగా ఉండి చదివినప్పుడు, ఆసక్తి కలిగించేలా కనిపించినప్పుడు మనకున్న విచక్షణతో అభిప్రాయాల సమాచారాన్ని వడబోసి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎదుటివారికి ఉపయోగబడేదాన్ని/నచ్చేదాన్ని బట్టి పంచుకోవడంకి సంబంధించి ఆలోచించవచ్చు. 

చాలా మంది, వారి ఫోన్ స్టోరేజ్ దృష్ట్యా, ప్రశాంతత దృష్ట్యా ఫార్వర్డ్ లలో వచ్చే ఫోటోలు ఇంకా ఎక్కువుగా వీడియోల వల్ల లాభం కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి వారిపట్ల సహనుభూతితో ఉండడం ఉత్తమం అనిపించింది. ఒకవేళ వాట్సప్ ఫార్వర్డ్ పంచుకోవాలనుకున్న రాతలు పంచుకోవడం నయం, వీడియోలు పంచుకోవడం దాదాపు తగ్గించుకుంటే మంచిది.

మనకు వాట్సాప్ ఫార్వర్డ్ లలో నచ్చినదంతా పంచుకొవాలి అని అనుకోవడం అంత శ్రేయస్కరం కాదు, మనకు నచ్చే ప్రతి విషయం ప్రతి ఒక్కరికి నచ్చకపోవచ్చు, కాబట్టి కనీసం ఓ ముగ్గురి కైనా ఉపయోగపడుతుంది లేదా నచ్చుతుంది అని అనుకుంటూనే వాట్సాప్ గ్రూపులో పంచుకోవడం మేలు. 

నచ్చినవన్నీ దాచుకునేందుకు వాట్సాప్ లో మెసేజ్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని లేదా మీరొక్కరే ఉన్న గ్రూపును ఏర్పాటు చేసుకొని దానిలో సమాచారాన్ని దాచుకుంటే బాగుంటుంది, లేదా ఫేస్బుక్ లాంటి సామాజిక మధ్యమలలో వేరే వాళ్లకు కనిపించే విధంగా, కనిపించిన విధంగా కూడా దాచుకోవచ్చు. 
----------------------------------------
I heard some people saying that almost 70-80% of whatsapp forwards (especially forwarded many times) are outdated or fake and are not real information but it's their personal discretion/interpretation/misconceptions/opinions of the person writing it. That seemed right to me. 

As more and more opinion information's goes into the brain, our peace of mind will be lost.  It seems better to read or watch WhatsApp forwards (especially forwarded many times) as little as possible.

When we are at leisure and appearing to be interesting we can read it,  and it is best to filter out and understand the information of  opinions with the discretion we have. Think about sharing something according to what is useful/liked by others. 

Many people, in terms of their phone's storage and calmness, Photos and mostly videos that appear in the WhatsApp forwards are causing more trouble than the benefit,  So it seemed best to be sympathetic to them. If you want to share WhatsApp forwards, it is better to share the texts and reduce the sharing of videos.

It's not good to think that we should share everything we like in WhatsApp forwards, Because everybody does not like everything we like

So it's best to share it in a WhatsApp group with the thought that it will be useful/liked at least three people in group. 

To Manage everything you like in forwards, it is better to send a message yourself on WhatsApp or Create a group where you are alone and store information in it, or you can also Manage it in a way that is visible or hide mode on social media such as Facebook


💭⚖️🙂📝@🌳
📖06.08.2024✍️ 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity





Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao