Youth conference on Sanatan Dharma

⚛️🪷📧 

"సనాతన ధర్మంపై యువ సమ్మేళనం" కార్యక్రమంలో వేదికపై మాట్లాడిన విషయాలు ఇంకొంచెం సంస్కరణతో విశిదీకరించి ఇక్కడ పంచుకుంటున్నాను. (అక్కడి సందర్బం, ఈ ఉపన్యాసం, నా వేషధారణ కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ,  అది పారదర్శకమైనది మరియు దీని ఉద్దేశం మాత్రం మంచే)

"యువతకు ఎందుకు అన్న కారణం తెలిస్తే, ఎలా అనేది వారే చూసుకుంటారు" #అపరిచితుడు (యువతనే కాదు సాధారణమైన మనుషులది అదే లక్షణం).  నేను ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడయ్యాను అంటే, ఆ పారామార్థికమైన విషయానికి నాకు మధ్య ఉన్న సంబంధం, మా అమ్మ నాన్నలకు నాకు మధ్య ఉన్న సంబంధం లాంటిది. 

నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల సదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వారు అవసరమైనవి, కావలసినవి సమకూరుస్తుంటారు, అందిస్తుంటారు. అందుకు వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాను. మన తల్లిదండ్రులకు మించిన తల్లితండ్రులు ఉంటారు, లేదా మనం మన తల్లితండ్రుల సంపూర్ణ సామర్ధ్యం మనకు తెలియకపోవచ్చు. తల్లితండ్రులు లాగా సంప్రదాయం కూడా అంతే. 

ప్రతి ఒక్కరికి వారి పరిధి చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన సదా ఉంటుంది, అది సహజం. మనం లేదా మన పరిధి గొప్పదైతే దాన్ని గుర్తించాలి గౌరవించాలి, మనం లేదా మన పరిధి గొప్పగా లేకపోతే, అప్పుడు మనం దాన్ని గొప్పగా చేసుకోనే ప్రయత్నం చెయ్యాలి.  అది అద్భుతంగా ఉంటుంది.  ఎలా అయినా మనది అనేది మన అస్తిత్వం. 

మనుషులకు జంతువులకు శారీరక జీవితం ఒకే విధంగా ఉంటుంది, జంతువులకు మనుషులకు మధ్య తేడా ఏర్పడేది మనసు వల్ల. మనం పుట్టినప్పుడు మన మెదడులో ఏమీ ఉండదు, కేవలం ఖాళీ(సంపూర్ణం)గా ఉంటుంది. అది ఎప్పుడు అలానే ఉండదు, అది దాని విలక్షణమైన లక్షణం. సమాజంలో పుట్టాం కాబట్టి,  అది దానిలోని  విషయాలను ఏదో విధంగా ఏదో ఒకటి గ్రహిస్తూ ఉంటుంది, అది దాని సహజ స్వభావం. చిందరవందరగా ఏదీ గ్రహించనీయకుండా, సాంప్రదాయం అనేది ఒక పద్ధతి ప్రకారంగా మనకు కొన్ని సంస్కారాలను అందిస్తుంది.  దాని నుంచి తప్పించుకోలేం, కాబట్టి  అది మనదవుతుంది, దాన్ని మనం స్వీకరించాలి, గొప్పదైతే గౌరవించాలి, గొప్పది కాకపోతే గొప్పగా చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఒక అద్భుతం. మన సంప్రదాయాన్ని పరిధిలో అధ్యయనం చేసినంతవరకు, ఇది వేగమైనది కాకపోయినా, దిశ సరైనదనిపించింది. 

నేను సనాతన ధర్మ సంప్రదాయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగానూ చాలావరకు పాటించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 

ఇక్కడ నాకు అనిపించిన ఇబ్బంది, అర్థం కాకపోయినా చేస్తూ వెళ్లిపోవడం, ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత నియమాలను పక్కనపెట్టి భావాల(సారాంశం)ను తలుచుకుంటూ వెళ్లిపోయాను. 

నా సంధ్యావందన ప్రయాణం (ఇది బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుంది అని అనుకునేందుకు లేదు) అలవాటైన తరువాత సరళంగా కనిపించే ఈ మార్గం చాలా కష్టంగా అనిపించింది, సులభంగా కనిపించిన వేరే మార్గం క్లిష్టంగా అనిపించింది. అంటే, మంత్రాల అర్థాలు తెలియనంత వరకు ఆ మంత్రాలతోనే నిత్యం సంధ్యావందనం చేశాను, ఎప్పుడైతే సంధ్యావందనం మంత్రాలకు అర్థం (సారాంశం) అర్థమైందో అప్పటి నుంచి ఆ సంధ్యావందన భావనల(సారాంశం)ను తలచుకుంటూనే సంధ్యావందనం చేశాను. ఆ భావత్మక సంధ్యావందనం చాలా ప్రశాంతతను కలిగించింది, కానీ భావనలకు మూలమైన మంత్రాలను వదలడం వలన దారితప్పినట్టు అనిపించింది. అప్పటినుంచి, ఏర్పరచుకున్న అవకాశాల అనుసారం రెండిటిని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నాను.

సనాతన ధర్మంతో ఏర్పడిన సంబంధం, నాలో ఒక సానుకూల దృక్పథం, సమతుల్యం, సామరస్యాలకు బీజం వేసింది. జరుగుతున్న ప్రతి మంచి చెడు కాలానుగుణంగా సారాంశప్రాయంగా సంతోషానికి, ఆనందానికే అన్న భావన అనుభవపూర్వకంగా కలిగించింది.

దేవుడు ఏర్పరచిన చెడు సైతం, మంచి కోసమే అన్న భావన కలిగింది. ఎప్పుడు చల్లగాలి క్రింద ఉంటే, దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేం. ఎండనపడి చెమటతో వచ్చిన తర్వాత చల్లని గాలి మన మీదకు వస్తే ఆ అనుభూతి ఆస్వాదన అద్భుతంగా ఉంటుంది. మంచి ఆస్వాదించాలంటే చెడ్డపై కష్టపడాలి. చెడు లేదంటే మంచికి విలువ లేదు. చెడును కల్మషాన్ని ఎదుర్కొన్నప్పుడు మంచి నిజాయితీ నిరూపణకు వస్తుంది అవగతం అవుతుంది. కేవలం ఒకటి కావాలంటే కుదరదు. రెండిటిని ఒకేలా చేసే దృక్పథం ఉండాలి. ప్రయత్నిద్దాం! (ప్రయత్నిస్తున్నాం).

💭⚖️🙂📝@🌳
📖17.09.2024✍️
⚛️EnTREE 🪷కల్పవృక్షము📧 





Comments

  1. ఎంత బాగా చెప్పావు కన్నయ్య 😘

    ReplyDelete
  2. ఆ గాయత్రీ దేవి నిన్ను సదా కాపాడుతూ రక్షిస్తూ అభివృద్ధి పథంలో నడిచేటట్టు చేస్తుంది శుభాశీస్సులు

    ReplyDelete
  3. Aysuman bava

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao