పోస్ట్‌లు

Sardar Vallabhbhai Patel (Telugu 31.10.2025)

చిత్రం
⚛️🪷🌳   గుజరాత్ గడ్డపై పుట్టిన పటేల్,  వృత్తిలో వృద్ధిచెందిన వల్లభాయ్, బార్డోలి సంగ్రామంలో సర్దార్ బిరుదొందారు   న్యాయవాదిగా నిలదోక్కుకొని మిత్రుని మాటల  ప్రభావంతో ప్రభావితుడై  వింటూ వెళ్లిన ఘనమైన గాంధీ  మాటలతో ముగ్ధుడై  గాంధీ బాటలో గట్టి భవిష్యత్తుకై సత్యాగ్రహ సంగ్రామంలో  ప్రత్యక్షంగా పాల్గొని  నిబద్ధతతో నిలబడి ఉక్కు మనిషిగా ఉప ప్రధానిగా  వీ.పీ మీనన్ వంటి మాహానుభావుల సహాయంతో స్థిరంగా  సామరస్య స్థాపనకై  విభజితమయ్యే వీలున్న  సంస్థానాలను సంభాషణలతో వందలాది వాటిని విలీనం  చేసిన చతురుడు, చిరస్మరణీయుడు మిగిలిన మిగతా  స్వతంత్ర సంస్థానాలను పోరాట పటిమతో పెద్ద పెద్ద హైదరాబాద్,  జునాగఢ్‌ లాంటి జటిలమైన వాటిని విలీనంజేసి స్వాతంత్ర్యంలో, స్వతంత్ర  రాజ్యాలను రాజ్యాంగ విలువలతో విలీనంజేసి పరాక్రమంతో ప్రజాస్వామ్యానికి  పెద్ద పునాదిని పెట్టిన  చిరస్మరణీయుడు చరితార్థుడు  సర్దార్ వల్లభాయ్ పటేల్.  మీ జన్మదినాన జాతి  జ్ఞాపకార్థంగా జరుపుకునే  దేశ ఐక్యత దినోత్సవానికి ప్రజలందరికీ ప్రజ్వలమైన...

Deepavali 2025 (Telugu 20.10.2025)

చిత్రం
⚛️🪷🌳  దేవాలయాన దేదీప్యమాన దీపావళి దీపాల దగ్గర  వెదజల్లుతున్న వెలుగుల  చెంత చేరి  కూర్చుని కాంతులను చూస్తూ చక్కగా  తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖20.10.2025✍️ సంవత్సరం తర్వాత సరదాగా  కాల్చిన కాకరపువత్తులు చాంతాడ్లు చిచ్చుబుడ్లు    💭⚖️🙂📝@🌳 📖 20.10.2025 ✍️

Varanasi (Telugu 11.10.2025)

చిత్రం
⚛️🪷🌳  కాశీ క్షేత్రమున క్షేత్రపాలకుడు  కాలభైరవుడు,  అన్నపూర్ణ అమ్మ  దర్శనం ద్వారా  తృష్ణ తీర్చుకొని  మార్గం మధ్యలో సాక్షిగణపతికి సుమాంజలులు  తెలిపి తర్వాత  విశ్వనాథుడు & విశాలాక్షి  ఆలయ ఆవరణలో  నిర్మలంగా నిలుచుని  తల్లి తండ్రితో తృప్తిగా తీసుకున్న  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖11.10.2025✍️ ⚛️🪷🌳 కాశీ క్షేత్రామున గంగాయానంలో గడుపుతూ  తృప్తిగా తీసుకున్న  చక్కని చిత్రాలు  💭⚖️🙂📝@🌳 📖11.10.2025✍️

2) Swarna Atta (Telugu 09.10.2025)

చిత్రం
⚛️🪷🌳  ఇంట్లో ఇల్లాలుగా పాఠశాల ప్రదేశంలో ఉపాధ్యాయురాలిగా ఉండి ప్రశాంతతను పండించిన  కమలతత్వ కోమల కాంత. గురువుగా గృహస్థిరాలిగా సంక్షేమాన్ని సంకల్పించి అన్నింటితో అనుసంధానమై  సాంఘిక శాస్త్రంలో  విద్యార్థి, విద్యార్థులను, సపరివార సంధాన సారధిగా అందరికి ఆనందాన్ని అందించి కొవ్వొత్తిలా కరిగి  కర్తవ్యాల కాంతి ప్రసరింపచేసిన ప్రకాశాన్ని   అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు. స్వర్ణ కమల లక్షణాలు కలిగిన  రాజహంస స్వర్ణత్తకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖09.10.2023(5)✍️ https://bharghavashyam.blogspot.com/2023/10/swarnaatta.html?m=1

Dhruthi PuttiVentrukalu (Telugu 06.10.2025)

చిత్రం
⚛️🪷🌳 మేనకోడలుకు మేనమామగా తిరుమలలో తలనీలాలు తీయించి (పుట్టువెంట్రుకలు) చెవి కుట్టించి చెవిపోగు పెట్టించి తదనంతరం తీసుకున్న చక్కని చిత్రం 💭⚖️🙂📝🌳 📖06.10.2025✍️  సపరివార సమేతంగా సాగిన తిరుమలేశుని దర్శన దారిలో తీరికగా తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖06.10.2025 ✍️  

2) Kirana Akka Birthday (Telugu 05.10.2025)

చిత్రం
⚛️🪷🌳  రాఘవేంద్ర పెద్దనాన్న  రాజేశ్వరి పెద్దమ్మల  పెద్ద పుత్రికగా  నెల్లూరు నేపథ్యమున పుట్టి పెరిగి మోహనుని మనువాడి మురిపెంగా ముగ్గురు  కూమారిలకు కన్నతల్లివై కళలతో కదిలించిన కాంత,  కాంతి కిరణం  కిరణక్కను కవిత్వంతో  కీర్తిస్తూ.....  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖05.10.2022(5)✍️ https://bharghavashyam.blogspot.com/2022/10/kirana-akka-blissful-birthday.html

Gandhi & Srikrishna (Telugu 02.10.2025)

చిత్రం
⚛️🪷🌳 గాంధీజీ నాకు కృష్ణుడు లాగా అనిపిస్తాడు, ఇద్దరు ఒక అద్భుతమైన ఆకర్షించే అస్తిత్వం గలవారు, నమ్మశక్యం కాని నిజం గాంధీ & కృష్ణుడు. ఇద్దరిలో నాకు చాలా సారూప్య అంశాలు కనిపించాయి.  అందరూ కష్టంగా భావించే సత్యవ్రతాన్ని ఇద్దరు సరళంగా పాటించడం అనితరసాధ్యం. శ్రీకృష్ణుడు భోగిలా కనిపించిన కానీ ఆయన యోగి & బ్రహ్మచారిగా ఉన్నట్లు, గాంధీ కూడా నిగ్రహాన్ని పరీక్షించుకొని బ్రహ్మచారిగా ఉండడం అసామాన్యం. ఇద్దరు, అటు మహాభారత కురుక్షేత్ర యుద్ధం, ఇటు స్వాతంత్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా ఉండి, పరోక్షంగా కనిపించి యావత్తు ప్రజలను ప్రభావితం చేయడం అనేది ఒక అద్భుతం. కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఆపగలిగే/వంటి చేత్తో (ముందే) గెలిపించ గల శక్తి సామర్థ్యాలు ఉన్నా రథసారథిగా పాల్గొని యుద్ధం చేయించడం, అలాగే గాంధీ కూడ తన సత్యాగ్రహ అహింస విధానంతో యావత్తు భారతావనిని ఒక తాటిపైకి తెచ్చి, ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులందరిని ఏకం చేసి, పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతున్నప్పుడు జరిగిన చౌరీ-చౌరా హింసకాండ మొత్తం బ్రిటిష్ వారిని భయభ్రాంతులను గురిచేసినప్పుడు, "మీరు ఇలాగే కొనసాగించండి" అనే ఒకేఒక్క పిలుపు ఇచ్చుంటే అప్...

Translation Day (అనువాద దినోత్సవం) (Telugu 30.09.2025)

చిత్రం
 ⚛️🪷🌳 భావం ఒక భాషలో పుట్టి, పదాల  పల్లకిలో ప్రయాణించి వాక్యమనే వేదిక ఎక్కి ఎగురుతూ పులకించే పరమార్థం భావం బహుముఖంగా  నిలబడుటకు నిచ్చెనయ్యే  సంకల్ప సాధనం  అనువాదం.  అనువాదం — అర్థానికి అర్ధాంగి భాష భేదాలను మనం మరుచుటకై,  అంతరంగాన అనువాదకులు మేధోమదనంతో మలిచి మురిపెంగా ముందుకు  తీసుకువచ్చే తత్వం  అనువాదం మాతృ భాషలో పుట్టిన పరమార్ధం, మరొక భాషను పరిమళింపజేసే  మహోన్నత మాధ్యమం  అనువాదం అనువాదం అనునది  పదాల పునఃకల్పన కాదు,   పదానికి పునర్జన్మ।   సంప్రదాయాల మధ్య సంభాషణ   సంస్కృతుల మధ్య సేతువు అనువాదం అంటే అనువాదంలో అర్థం  మారదు, రూపం మారుతుంది,   పలుకులు మారతాయి,  భావం నిలుస్తుంది. అనువాదం, వున్న విషయాల మార్పిడి మాత్రమే కాదు,   మనల్ని మరొకరితో  కృతజ్ఞతగా కలిపి   సంతృప్తినిచ్చే సాధనం మాట్లాడే భాష  మాత్రమే మారుస్తుంది   అని అనుకోగానే ఆస్కారం లేదు అంతకుమించి అందరిని  పులకరింపజేసే పరమార్థం  విభిన్న విశేష విషయాల మూలలతో మమేకమై  అంతర్లీనంగా అర...

Asia Cup Win (Telugu 28.09.2025 (GMT))

చిత్రం
 ⚛️🪷🌳 దాయాది ద్వయ దేశాలు సాగించిన సమరంలో ఉత్కంఠ ఉన్న ఆటలో అద్భుతంగా ఆడి ప్రత్యర్థి పాకిస్తాన్ పై పోరాట పటిమతో వికెట్లు తీసిన వరుణ్  చక్రవర్తి, చక్కగా  కులదీప్, అక్షర్ & బూమ్రా, బ్యాటింగులో నిలకడగా నిలబడి పరుగులు పారించిన తెలుగు తేజం తిలక్  వర్మ వరమై బలమైన భాగస్వామ్యాలను సంజు శివంతో కలుపుతూ కడదాకా ఆడిన ఆటగాడికి & అన్ని ఆసియాకప్పు  ఆటలలో అద్భుతంగా నిలకడగా నిలిచి వేగంగా విలువైన  పరుగులు పారించిన  అభిషేక్ కు అభినందనలు ఒకే ఖండంలోని  బహుళ జట్లపై  జయాల జైత్రయాత్రతో  అద్వితీయంగా అజేయంగా  ఆసియాకప్పు అందుకున్న  భారతదేశానికి భవ్యంగా శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖 28.09.2025 ✍️ (GMT)

Priya Akka Birthday (Telugu 13.09.2025)

చిత్రం
⚛️🪷🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల పెద్ద పుత్రికగా భాద్రపద బహుళ  నవమి నాడు  నెల్లూరు నేపథ్యంగా పుట్టి పెరిగి నాగప్రియదర్శిని నామంతో  ఆరుద్రనికి అక్కగా  ఆమంచర్ల ఆడపడుచుగా మలిగి, ముంగమూరి కోడలిగా కదిలి  శాండిల్య శకంలో కుదురుకొని కష్టార్జితంతో విప్రో వ్రుత్తిలో చక్కగా చేసి ఆక్సెంచరుకు మారి అమెరికాకు మాకం  మార్చి, మెరుగై స్వదేశానికి సాగి బెంగళూరులో బావతో కైరాతో కుతూహలంగా పరవశిస్తున్న ప్రియక్కకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 13.09.2025 ✍️

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

చిత్రం
⚛️🪷🌳 తల్లిభాషగా తేలికగా తనువులో తాదాత్మ్యంగా తేలి, తెలియకుండానే తళుక్కు తళుక్కుమంటు తీరుతో తీక్షణంగా తలపులు తెరిచి తొలిగా తేలికతనాన్ని తరువాత తాత్వికతను తీరుగా తెలియజేస్తూన్న తెలుగుకు తలవంచి తృప్తిగా తలుస్తున్నాను. తరతరాల తాత్విక తపస్సుతో తేజోమయమై తాత్వికంతో తడిసి  తారకమైన తీయని తల్లి తెలుగు 💭⚖️🙂📝@🌳 📖29.08.2025✍️ 2022 తెలుగు దినోత్సవం (గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగు వారి పాత్ర) గురించి రాసిన వ్యాసం https://bharghavashyam.blogspot.com/2022/08/blog-post_29.html

2) Raghavendra PeddaNanna Birthday (Telugu 27.08.2025)

చిత్రం
⚛️🪷🌳 వినాయక చవితి నాడు  విఘ్నేశ్వరుని చల్లని నీడలో  తిథితో తాదాత్మ్యంగా పుట్టినరోజు పర్వదినం  జరుపుకుంటున్న జ్యేష్ఠపితా  పలుకూరి పెద్దవారు  పాతపాటి పెద్ద అల్లుడు ఉత్తమ ఊత ఉన్నత ఉద్యోగి  "క్రమశిక్షణ కాంతి కిరణం" "సనాతన సంప్రదాయ సహవాసి" రాఘవేంద్ర పెద్దనాన్నకు రచనతో హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.08.2025✍️

Jubliee Journalist Colony Nature (Telugu 24.08.2025)

చిత్రం
⚛️🪷🌳 ఉదయాన్నే ఉద్యానవనాన చిరు కొండపై చేరి   వర్షం వలన  శుభ్రమైన శుద్ధ ప్రకృతి పరిచిన  పచ్చని పరిసరాలను  ఆనందంగా ఆస్వాదించి  తీసిన తాదాత్మ్య  చక్కని చిత్రాలు 💭⚖️🙂📝@🌳 📖24.08.2025✍️

Chiranjeevi Birthday (Telugu 22.08.2025)

చిత్రం
⚛️🪷🌳 మొగల్తూరు నుంచి మద్రాసుకు సానుకూలతతో సాగి ప్రతికూలతలను పారద్రోలి క్రమశిక్షణ క్రమపద్ధతిలతో శ్రీకరంగా శిక్షణ  తీసుకుని తెలుగు తెర  చలన చిత్రాలలో నాట్యం నటన  నైపుణ్యాలతో నిండుగా  అక్షౌహిణులంత అభిమానులను  సుసంపన్నంగా సంపాదించుకుని చిరస్థాయిగా చిరంజీవివై నిలిచిన నటకిషోర  సుప్రీంహీరో "మెగాస్టార్" పేరు ప్రఖ్యాతలను, పద్మభూషణ పద్మవిభూషణ  పౌర పురస్కారాలను  ఘనంగా గ్రహించిన  చిరంజీవిగారికి చక్కగా హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖22.08.2025✍️

3) Srilekha Akka Birthday (Telugu 23.08.2025)

⚛️🪷🌳 నెల్లూరు నివాసంగా ప్రాథమిక పాఠశాల విద్యను వంటపట్టించుకుని ఉన్నత విద్యకై  ఊరిని వదిలి చెన్నైలో చదువుకొని  ఎగిరి ఎదిగి  ఉన్నత ఉద్యోగం  చక్కగా చేస్తూ  బెంగళూరులో బసచేస్తూ  ఆమంచర్ల ఆడపడుచు దూపగుంటకు దగ్గరై  ప్రసాద్(బావ)ని పెళ్లి  చేసుకుని చక్కగా  అద్వైత స్మరణతో ఆనందంగా సాగుతున్న  శ్రీలేఖక్కకు   పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖21.08.2025✍️

Timeline (10.08.2025)

⚛️🪷🌳   00) 1994 (0-261) భవ   01) 1995 (262-626) భవ-యువ 02) 1996 (627-992) యువ-ధాత 03) 1997 (993-1357) ధాత- ఈశ్వర 04) 1998 (1358-1722) ఈశ్వర- బహుధాన్య   05) 1999 (1723-2087) బహుధాన్య-ప్రమాధి 06) 2000 (2088-2453) ప్రమాధి-విక్రమ 07) 2001 (2454-2818) విక్రమ -వృష 08) 2002 (2819-3183) వృష -చిత్రభాను 09) 2003 (3184-3548) చిత్రభాను-స్వభాను 10) 2004 (3549-3914) స్వభాను-తారణ 11) 2005 (3915-4279) తారణ-పార్థివ 12) 2006 (4280-4644) పార్థివ-వ్యయ 13) 2007 (4645-5009) వ్యయ-సర్వజిత్తు 14) 2008 (5010-5375) సర్వజిత్తు-సర్వధారి 15) 2009 (5376- 5740) సర్వధారి-విరోధి 16) 2010 (5741-6105)విరోధి - వికృతి 17) 2011 (6106-6470)  వికృతి-ఖర 18) 2012 (6471-6836)  ఖర-నందన 19) 2013 (6837-7201) నందన-విజయ 20) 2014 (7202-7566)  విజయ-జయ 21) 2015 (7567-7931) జయ-మన్మధ 22) 2016 (7932-8297)  మన్మధ-దుర్ముఖి 23) 2017 (8298-8662) దుర్ముఖి-హేవళంబి 24) 2018 (8663-9027) హేవళంబి-విళంబి 25) 2019 (9028-9392) విళంబి-వికారి 26) 2020 (9393-9758) వికారి-శార్వరి 27) 2021 (9759-10123)  శార్వరి-ప్లవ ...

Raghu Gari Birthday (Telugu 10.08.2025)

చిత్రం
⚛️🪷🌳 ఆనందంగా ఉండే అదృష్టవంతులు పరవశించే ప్రయత్నాలలో  లీనమై లంకించేవారు, విమర్శలను విస్మరించే వ్యక్తిత్వంతో, మిమ్మల్ని మీరు ఉన్నంతగా భావిస్తూ  సదా సంతోషంగా సాగుతున్నారు. ఉన్నతాలను ఉపదేశించడంలో మీకు ఉదాత్తమైన శక్తి ఉంది. కరుణామయుని కటాక్షంతో  సదా సుఖంగా సాగుతున్నారు  మీరు మరింత తృప్తితో తాదాత్మ్యంగా తిరగాలని తలుస్తూ హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  రఘుగారు 💭⚖️🙂📝@🌳 📖10.08.2025✍️

Puneri Amruttulya (Mutuals) (Telugu 06.08.2025)

చిత్రం
⚛️🪷🌳 హామీగా హిమవంత్, నిఖిల్, నరసింహ  చిన్నవాడైన చింటూ అశ్విన్ అందరూ  బలమైన భాగస్వామ్యంతో  ఏకమై ఏర్పరచుకున్న  బంధంతో బృందస్పూర్తిగా సహాకారంతో సాకారంగా  సంపదను సమిష్టిగా  సృష్టించుకొని సాదరంగా పునేరి ఫ్రాంచైజ్ పొందిన పరస్పరులు కలకాలం కలిసుంటూ వ్యాపారాన్ని విలువలతో నిబద్ధతగా నడుపుతారని  పరస్పర పదానికి చిరకాలం చిహ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నిత్యం నాణ్యమైన  తేనీరు తాగుతూ  ప్రజలు ప్రశాంతత  పుష్కలంగా పొందుతారని విశ్వసిస్తున్నాను.  💭⚖️🙂📝@🌳 📖06.08.2025✍️

Shiva Anna Birthday (Telugu 02.08.2025)

చిత్రం
⚛️🪷🌳 కొంకటి ఇంటి నామంతో  కొత్తగూడెం ఇల్లు నుండి  మహానగరం ముందుకు  వచ్చి వివిధ  వృత్తిలలో వుండి సాక్షి సంస్థలో  సానుకూలంగా సామర్ధ్యాన్ని  నిర్మించుకొని నిర్మలంగా ఆంధ్రజ్యోతిలో అడుగుపెట్టి వేలితో వేగంగా  పదాలను పరిగెత్తికిచ్చి సాంకేతిక పరికరాలను  సినిమా పేజీలకై ఉపయోగిస్తూ ఉన్నవారు  ప్రకటనలను ప్రశాంతతతో రూపొందిస్తూ రాణిస్తూ…. శోభాయమాన శక్తి శాంతి  శైలి శీలం గల శివ గారు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖02.08.2025✍️