EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము "సనాతన ధర్మంపై యువ సమ్మేళనం" కార్యక్రమంలో వేదికపై మాట్లాడిన విషయాలు ఇంకొంచెం సంస్కరణతో విశిదీకరించి ఇక్కడ పంచుకుంటున్నాను. (అక్కడి సందర్బం, ఈ ఉపన్యాసం, నా వేషధారణ కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ, అది పారదర్శకమైనది మరియు దీని ఉద్దేశం మాత్రం మంచే) "యువతకు ఎందుకు అన్న కారణం తెలిస్తే, ఎలా అనేది వారే చూసుకుంటారు" #అపరిచితుడు (యువతనే కాదు సాధారణమైన మనుషులది అదే లక్షణం). నేను ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడయ్యాను అంటే, ఆ పారామార్థికమైన విషయానికి నాకు మధ్య ఉన్న సంబంధం, మా అమ్మ నాన్నలకు నాకు మధ్య ఉన్న సంబంధం లాంటిది. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల సదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వారు అవసరమైనవి, కావలసినవి సమకూరుస్తుంటారు, అందిస్తుంటారు. అందుకు వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాను. మన తల్లిదండ్రులకు మించిన తల్లితండ్రులు ఉంటారు, లేదా మనం మన తల్లితండ్రుల సంపూర్ణ సామర్ధ్యం మనకు తెలియకపోవచ్చు. తల్లితండ్రులు లాగా సంప్రదాయం కూడా అంతే. ప్రతి ఒక్కరికి వారి పరిధి చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన సదా ఉం...
Comments
Post a Comment