Sardar Vallabhbhai Patel (Telugu 31.10.2025)

⚛️🪷🌳 

 గుజరాత్ గడ్డపై పుట్టిన పటేల్, 
వృత్తిలో వృద్ధిచెందిన వల్లభాయ్,
బార్డోలి సంగ్రామంలో సర్దార్ బిరుదొందారు
 
న్యాయవాదిగా నిలదోక్కుకొని
మిత్రుని మాటల 
ప్రభావంతో ప్రభావితుడై 
వింటూ వెళ్లిన
ఘనమైన గాంధీ 
మాటలతో ముగ్ధుడై 
గాంధీ బాటలో గట్టి భవిష్యత్తుకై
సత్యాగ్రహ సంగ్రామంలో 
ప్రత్యక్షంగా పాల్గొని 
నిబద్ధతతో నిలబడి
ఉక్కు మనిషిగా ఉప ప్రధానిగా 
వీ.పీ మీనన్ వంటి మాహానుభావుల
సహాయంతో స్థిరంగా 
సామరస్య స్థాపనకై 
విభజితమయ్యే వీలున్న 
సంస్థానాలను సంభాషణలతో
వందలాది వాటిని విలీనం 
చేసిన చతురుడు, చిరస్మరణీయుడు
మిగిలిన మిగతా 
స్వతంత్ర సంస్థానాలను
పోరాట పటిమతో
పెద్ద పెద్ద హైదరాబాద్, 
జునాగఢ్‌ లాంటి జటిలమైన
వాటిని విలీనంజేసి
స్వాతంత్ర్యంలో, స్వతంత్ర 
రాజ్యాలను రాజ్యాంగ
విలువలతో విలీనంజేసి
పరాక్రమంతో ప్రజాస్వామ్యానికి 
పెద్ద పునాదిని పెట్టిన 
చిరస్మరణీయుడు చరితార్థుడు 
సర్దార్ వల్లభాయ్ పటేల్. 

మీ జన్మదినాన జాతి 
జ్ఞాపకార్థంగా జరుపుకునే 
దేశ ఐక్యత దినోత్సవానికి
ప్రజలందరికీ ప్రజ్వలమైన 
దేశ ఐక్యత దినోత్సవ 
శోభమైన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
📖31.10.2025✍️

📸: మైక్రోసాఫ్ట్ కో పైలెట్ సహాయంతో రూపొందించబడినది


Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)