Translation Day (అనువాద దినోత్సవం) (Telugu 30.09.2025)
⚛️🪷🌳
భావం ఒక భాషలో
పుట్టి, పదాల
పల్లకిలో ప్రయాణించి
వాక్యమనే వేదిక
ఎక్కి ఎగిరుతూ
పులకించే పరమార్థం
భావం, బహుముఖంగా
నిలబడుటకు నిచ్చెనయ్యే
సంకల్ప సాధనం
అనువాదం.
అనువాదం — అర్థానికి అర్ధాంగి
భాష భేదాలను
మనం మరుచుటకై,
అంతరంగాన అనువాదకులు
మేధోమదనంతో మలిచి
మురిపెంగా ముందుకు
తీసుకువచ్చే తత్వం
అనువాదం
మాతృ భాషలో పుట్టిన పరమార్ధం,
మరొక భాషను పరిమళింపజేసే
మహోన్నత మాధ్యమం
అనువాదం
అనువాదం అనునది
పదాల పునఃకల్పన కాదు,
పరమార్ధానికి పునర్జన్మ।
సంప్రదాయాల మధ్య సంభాషణ
సంస్కృతుల మధ్య సేతువు
అనువాదం అంటే
అనువాదంలో అర్థం
మారదు, రూపం మారుతుంది,
పలుకులు మారతాయి,
భావం నిలుస్తుంది.
అనువాదం
వున్న విషయాల
మార్పిడి మాత్రమే కాదు,
మనల్ని మరొకరితో
కృతజ్ఞతగా కలిపే
సంతృప్తినిచ్చే సాధనం
మాట్లాడే భాష
మాత్రమే మారుస్తుంది
అనుకోనే ఆస్కారం లేదు
అంతకుమించి అందరిని
పులకరింపజేసే పరమార్థం
విభిన్న విశేష విషయాల
మూలలతో మమేకమై
అంతర్లీనంగా అర్ధాన్ని
అర్థం చేసుకుని అర్థం చెప్పగల
అనువాదకులకు అభినందనలు
అంతర్లీనంగా అందరిలో ఉన్న
అనువాదకులకు అనువాద దినోత్సవ శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖 30.09.2025 ✍️
Comments
Post a Comment