2) Swarna Atta (Telugu 09.10.2025)

⚛️🪷🌳 

ఇంట్లో ఇల్లాలుగా
పాఠశాల ప్రదేశంలో
ఉపాధ్యాయురాలిగా ఉండి
ప్రశాంతతను పండించిన 
కమలతత్వ కోమల కాంత.

గురువుగా గృహస్థిరాలిగా
సంక్షేమాన్ని సంకల్పించి
అన్నింటితో అనుసంధానమై 
సాంఘిక శాస్త్రంలో 
విద్యార్థి, విద్యార్థులను,
సపరివార సంధాన సారధిగా
అందరికి ఆనందాన్ని అందించి
కొవ్వొత్తిలా కరిగి 
కర్తవ్యాల కాంతి
ప్రసరింపచేసిన ప్రకాశాన్ని  
అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు.

స్వర్ణ కమల లక్షణాలు కలిగిన 
రాజహంస స్వర్ణత్తకు 
హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పర్వదినాన
శోభమైన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖09.10.2023(5)✍️




Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)