Sudha Atta (Telugu 04.01.2026)
⚛️🪷🌳
తల్లిగా తనయులతో తృప్తిగా
తల్లి & తమ్ముడుతో తీపిగా,
మరదలితో మందహాసంగా,
అత్తవై అల్లుడ్లతో అట్టహాసంగా
హుషారుగా, హార్దికంగా
వున్న వ్యక్తిత్వం.
సాంప్రదాయ సంస్కృతి
స్మృతిలో స్ఫూర్తిగా
తీర్థయాత్రలతో తాదాత్మ్యంగా
తిరిగే తారా
వస్త్ర వైఖరి వ్యాపారంలో
స్వయం సమృద్ధిగా
సాధికార స్వావలంబన
సాధించిన సాధ్వి
ఆధునికత ఆనందాన్ని
విస్తృత విశాల
ధృడ దృక్పథాన్ని
అందుకున్న అత్తకు
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖04.01.2026✍️

Thank you Bhargav 😍👏
ReplyDeleteLove it 😍 thanks 😊