Hari Bava (Telugu 11.06.2026)

⚛️🪷☀️🍃@🌳

వక్కలంక వారైన
గోపాల్ రేణుకా 
(అత్తయ్య మామయ్య)
దంపతులకు ద్వితీయ 
సంతానంగా, సంతోషంగా 
పశ్చిమ గోదావరిలో పుట్టి 
తల్లిదండ్రులతో తూర్పుగోదావరిజిల్లాకు  
చిద్విలాసంగా చేరి
గోదావరి గలగలల
రాజమండ్రిలో రూపాంతరం
చెంది చక్కగా చదువుకుని
మహానగరం ముందుకు 
వచ్చి వాలి
పట్టభద్రత పొంది 
ప్రఖ్యాత పత్రిక 
“ఈనాడు”లో హాయిగా ఈది
సత్యంలో సంతసంగా సాగి
పోటీ పరీక్షలలో 
ఉత్తీర్ణులై ఉండి, 
తృటిలో తప్పిన 
బృహత్ బ్యాంకు 
అధికారి అవకాశాలను 
మరిచి మరల 
వడివడిగా వృద్ధి
అవుతూ, ఆతర్వాత 
హైదరాబాదులో హృద్యంగా 
శంకరమఠంలో శుభశకున 
సమయాన, స్వామి సమక్షంలో 
భవ్యంగా భావించి 
నిశ్చయమైన నిశ్చితార్థంతో
నెల్లూరు నేలపై
కళ్యాణంతో జ్యోతిని కలిసి
భాగ్యనగరంలో భార్యాభర్తలుగా
చేరి చక్కగా
సాయిముకుంద్ శ్రీలహరి సంతానంతో 
సానుకూలంగా సాగుతున్న 
హరిబావ….

హార్దిక హేతుక హృదయంతో 
హృద్య హాస్యలను హారంగా
హేతుబద్ధ హామీతో 
హోదా పెంచే 
హుందాతన హరి(బావ)కి 
హార్దిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
📖11.06.2026✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)