Jyothi Akka Birthday ( Tel527.12.2025)
⚛️🪷🌳
పెద్దనాన్న పెద్దమ్మల
కనిష్ట కుమార్తెగా
నెల్లూరు నేపథ్యన
జన్మించిన జ్యోతక్క
తల్లిదండ్రులతో తూర్పుగోదావరి
జిల్లాలకు జాగ్రత్తగా
చిద్విలాసంగా చేరి
గోదావరి గలగలల
రాజమండ్రిలో రూపాంతరం
చెంది చక్కగా
విద్యా & వృత్తిలో
వడివడిగా వృద్ధి
అవుతూ, ఆతర్వాత
కడపకు కదిలి
ఉపాధ్యాయురాలుగా ఉంటూ
కుదురుకున్న కాలంలో
హైదరాబాదులో హృద్యంగా
శంకరమఠంలో శుభశకున
సమయాన, స్వామి సమక్షంలో
భవ్యంగా భావించి
నిశ్చయమైన నిశ్చితార్థంతో
నెల్లూరు నేలపై
హాయిగా హరి బావతో
కళ్యాణంతో కలిసి
భాగ్యనగరంలో భార్యాభర్తలుగా
చేరి చక్కగా
సాయిముకుంద్ శ్రీలహరి
సంతానంతో సానుకూలంగా
జీవిస్తున్న జ్యోతక్కకు
పుట్టినరోజు పండుగ
శోభనమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖27.12.2025✍️
Comments
Post a Comment