Nanna (Telugu 31.01.2023)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
నిశ్చలమైన నారాయణుని,
రమణుని,శేషుని, 
నయన నీడలో 
నిండుగా నవ్వుతూ నడిచి 
రామనామంతో నిర్మలంగా రామనాథునిలో 
ఐక్యం అయిన నానమ్మకు 
97వ పుట్టినరోజు నాడు నివాళర్పిస్తు........ 

నానమ్మ దివ్యమైన అస్తిత్వాన్ని 
అంతర్లినం చేసుకొని 
నానమ్మ జన్మించిన తేదీ నాడే 
జన్మించిన నాన్న......

పూర్ణమైన పరమాత్ముని పారమార్థికమైన ప్రమాణాలు 
ప్రేరేపించిన ప్రాణంతో ప్రపంచ పరస్పర ప్రయాణ పరిధిలో 
పరమానందం పోందుతూ పావనమవుతున్న పితృదేవుని 
పరికిస్తూ పరవశ ప్రమోదాన్ని పోందుతూ 
పుట్టినరోజు పండగ పూట పలుకుతున్నా పదాలు........ 

ధన్యుడినై ధన్యవాదాలతో 
జన్మదిన శుభాకాంక్షలు నాన్న
💭⚖️🙂📝@🌳
📖31.01.2023✍️


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Earth Day (Telugu 22.04.2026)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం