Vykunta Ekadashi (వైకుంఠ ఏకాదశి)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
తొలి ఏకాదశి, మరియు వైకుంఠ ఏకాదశి గురించి కోంచం తెలుసుకుని రాసినది ఈ వ్యాసం
--------
మురాసురునితో యుద్ధ సమయంలో అలసిపోయినా విష్ణుమూర్తి.. విశ్రమించడానికి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి యెగనిద్రకు ఉపక్రమిస్తారు. అక్కడ విష్ణుమూర్తి కంటి చూపు నుండి ఒక శక్తి ఉద్భవించింది అదే ఏకాదశి. విష్ణుమూర్తి నిద్రపోవడం వల్ల, నిద్రిస్తున్న సమయంలో ఏకాదశి జన్మించడం వల్ల శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. ఆషాడమాసంలో ఏకాదశి ఉద్భవించింది కాబట్టి ఆషాడమాసంలోనికి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు.
పుష్య శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి కంటి శక్తి (ఏకాదశి) మురాసురుని వధించి వైకుంఠం వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన ముక్కోటి దేవతలు, మరియు ఇద్దరు రాక్షసులు వైకుంఠ ప్రవేశానికి ప్రవేశం కోరగా వారిని ఆహ్వానిస్తారు. ఆలా పుష్య శుద్ధ ఏకాదశి రోజు వైకుంఠ/ముక్కోటి ఏకాదశి అయ్యింది. నా రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఏకాదశి కోరింది. విష్ణుమూర్తి తధాస్తు అన్నారు.
ఇది నేను అర్థం చేసుకున్న పురాణ వృత్తాంతాం
---------------------
ఏకాదశి అంటే పదకొండు.
ఒక నమ్మకం ప్రకారంగా.... అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన ఉపవాసంతో అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ దేవునికి నివేదన చేయాలి అనేది ఓ సందేశం.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment