World Environment Day (Telugu 05.06.2026)
⚛️🪷☀️🍃@🌳
మన ముందు
కనిపిస్తూ కనిపించకుండా,
ప్రాణంతో, ప్రాణరహితంగా
ప్రాణులు పదార్థాలు
ప్రకృతిలో పాలుపంచుకున్న
జీవులు: వృక్షాలు, జనాలు, జంతువులు,
నిర్జీవులుగా నిండున్న
ఘన ద్రవ వాయు
రూపాలలో రాళ్లు
ఖండాలుగా ఖనిజాలు
రసాయనాలు,
ఇంధనం ఇలా
ఉండి ఉన్న
సకల సమ్మేళనం
పర్యావరణం.
పర్యావరణంలో ప్రధానంగా
పంచభూతాలు
(నింగి, నేల,
నీరు, నిప్పు,
వాయువు) వున్నాయి.
దాని ద్వారా
విభాగాలుగా వున్న
“వాతావరణం (వాయువు),
జీవావరణం (జీవులు)
జలావరణం (జలం)
శిలావరణం (భూమి)”
నాలుగు నిశ్చయంగా
అంతర్లీనంగా అంతర్భాగం
అయ్యాయి.
పర్యావరణంతో ప్రజలు
పాలుపంచుకుంటూ పరస్పరం
ప్రయోజనం పొందుతూ
వస్తున్న వేళ,
పర్యావరణంలో భాగమైన ప్రజలు
పర్యావరణాన్ని విడి భాగంగా ప్రజలు
పర్యావరణాన్ని పరికిస్తూ..
ప్రయోజనాలు అధికంగా
ప్రయాసలు అత్యల్పంగా
ఉంచాలనుకునే ఉద్దేశంతో
మానవ మేధస్సు
పర్యావరణంలోని పదార్థాలను
పరాక్రమంతో, ప్రయోగాలతో
అనుకూలంగా అన్వయించుకునేందుకు
ప్రయత్నిస్తూ ఉత్తమ ఫలితాలు,
అందుకుంటోంది. అలాగే
ప్రతికూలతలను పొందుతోంది.
అయితే, ఆరంభంలో
ప్రయోజనాలు అధికంగా
ప్రయాసలు అత్యల్పంగా
ఉంచాలనుకునే ఉద్దేశం
మానవ కేంద్రీకృతంతో మొదలైతే..
దాని ద్వారా
పొందిన ప్రయోజనాలు ప్రయాసలు
ఒక్కటై ఓడిస్తూ
వస్తున్న వేళ…
తెలివి తెచ్చుకొని
వివేకంతో విశేషంగా
పరస్పర ప్రయోజనాలకై
ప్రయోగాలు ప్రారంభించి
అలవాటు పడిన ఆసరాలను
సడలించేందుకు సిద్ధమై
కొంచెం కష్టమైనా కొన్నింటిని
వదులుకునేందుకు ముందుకు వస్తూ
ప్రకృతి ప్రయోజనంతో
ముడిపడిన మన్నికైనవి,
ఖరీదైనవి ఖర్చుచేస్తూ
వాటిని విలీనం
చేసుకుని చక్కగా
నడుస్తున్న వారిని నేత్రాలతో
చూస్తూ చిద్విలాసం చిందిస్తున్నాను.
పర్యావరణంతో పరస్పరంగా
అనుసంధానం అవ్వడం, అంత
సులభం & సౌకర్యం
కాదు కాబట్టి,
పర్యావరణానికి పరోపకార
గుణం ఘనంగా
ఉదారంగా ఉన్న
కారణంగా
అందరం ఆలస్యంగానైనా
పర్యావరణంతో పాటు
అడుగులు వేస్తూ అనుసంధానమై
పరస్పర ప్రయోజనాలు
పుష్కలంగా పోందుతామని
పరితపిస్తూ, పర్యావరణాన్ని ప్రశంసిస్తూ
ప్రజలందరికీ పర్యావరణ
దినోత్సవ దినాన
శుభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖05.06.2026✍️
మన ముందు కనిపిస్తూ కనిపించకుండా, ప్రాణంతో, ప్రాణరహితంగా ప్రాణులు పదార్థాలు,ప్రకృతిలో పాలుపంచుకున్న జీవులు అంటే వృక్షాలు, జనాలు, జంతువులు, నిర్జీవులుగా నిండున్న ఘన ద్రవ వాయు
రూపాలలో రాళ్లు, ఖండాలుగా ఖనిజాలు, రసాయనాలు, ఇంధనం ఇలా ఉండి ఉన్న సకల సమ్మేళనం పర్యావరణం.
పర్యావరణంలో ప్రధానంగా పంచభూతాలు (నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు) ఉన్నాయి. దాని ద్వారా విభాగాలుగా వున్న “వాతావరణం (వాయువు), జీవావరణం (జీవులు), జలావరణం (జలం), శిలావరణం (భూమి)”, నాలుగు నిశ్చయంగా అంతర్లీనంగా అంతర్భాగం అయ్యాయి.
పర్యావరణంతో ప్రజలు పాలుపంచుకుంటూ, పరస్పరం ప్రయోజనం పొందుతూ వస్తున్న వేళ, పర్యావరణంలో భాగమైన ప్రజలు పర్యావరణాన్ని విడి భాగంగా చూస్తూ.. ప్రయోజనాలు అధికంగా, ప్రయాసలు అత్యల్పంగా ఉంచాలనుకునే ఉద్దేశంతో మానవ మేధస్సు పర్యావరణంలోని పదార్థాలను పరాక్రమంతో, ప్రయోగాలతో అనుకూలంగా అన్వయించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉత్తమ ఫలితాలు, అందుకుంటోంది. అలాగే ప్రతికూలతలను పొందుతోంది.
అయితే, ఆరంభంలో ప్రయోజనాలు అధికంగా, ప్రయాసలు అత్యల్పంగా ఉంచాలనుకునే ఉద్దేశం మానవ కేంద్రీకృతంతో మొదలైతే.. దాని ద్వారా పొందిన ప్రయోజనాలు ప్రయాసలు ఒక్కటై ఓడిస్తూ వస్తున్న వేళ… తెలివి తెచ్చుకొని వివేకంతో విశేషంగా పరస్పర ప్రయోజనాలకై ప్రయోగాలు ప్రారంభించి అలవాటు పడిన ఆసరాలను కొంచెం కష్టమైనా కొన్నింటిని వదులుకునేందుకు ముందుకు వస్తూ, ప్రకృతి ప్రయోజనంతో ముడిపడిన మన్నికైనవి, ఖరీదైనవి ఖర్చుచేస్తూ వాటిని భాగం చేసుకుంటూ చక్కగా నడుస్తున్న వారిని చూస్తూ చిద్విలాసం చిందిస్తున్నాను.
పర్యావరణంతో పరస్పరంగా అనుసంధానం అవ్వడం, అంత సులభం & సౌకర్యం కాదు కాబట్టి, పర్యావరణానికి పరోపకార గుణం ఘనంగా, ఉదారంగా ఉన్న కారణంగా అందరం ఆలస్యంగానైనా
పర్యావరణంతో పాటు అడుగులు వేస్తూ అనుసంధానమై, పరస్పర ప్రయోజనాలు పుష్కలంగా పోందుతామని పరితపిస్తూ, పర్యావరణాన్ని ప్రశంసిస్తూ ప్రజలందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖05.06.2026✍️


Excellent 👌
ReplyDelete❤️
ReplyDelete👌
ReplyDelete👍
ReplyDelete❤️
ReplyDeleteచాలా బాగా రాశావు, బాగా తెలుసుకుని తెలిసేలా ఊ
ReplyDelete💚
ReplyDelete