అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
పార్వతీదేవి ఒంటికి రాసుకున్న పసుపు ద్వారా మానవ దేహం, గజాసురునికి మూషికసురునికి వచ్చిన వరదానం ప్రకారం ఏనుగు మస్తిష్కం, ఎలుక వాహనం, దేవతల ఆశీస్సులతో ద్విజత్వం పొందిన దైవం వినాయకుడు .......
ప్రకృతి పదార్థం (పసుపు, పిండి), మానవుడు, ఏనుగు, ఎలుక, రాక్షసుడు, దేవుడు, ఇలా భవ్యంగా భావ్యంగా బాహ్యంగా ఏర్పడిన భవ భగవంతుడు విగ్నేశ్వరుడు. స్వీయ భిన్నత్వంలో ఏకత్వానికి గల ఉదాహరణగా ఏకదంతునీ భావిస్తున్నాను.
గణాధిపత్యం కోసం కుమారస్వామితో జరిగిన పోటీలో తల్లితండ్రులే తన ప్రపంచం అని విశ్వసించి, వారికి ప్రదక్షణ చేసి, భూ ప్రదక్షిణ పూర్తి చేసిన , వాస్తవ విశ్వాస వ్యాఖ్యాన విగ్రహం వినాయకుడు.......
అలంకారాలలోని (ఉపమాన ఉపమేయ రూపక...) అస్తిత్వాన్ని విశ్వాసంతో అభివ్యక్తీకరించి "యద్భావం తద్భవతి" ఆనే సానుకూల సరళ సిద్ధాంతానికి, సాకారరూపంగా గణపతిని భావిస్తాను.
💭⚖️🙂📝@🌳
📖31.08.2022✍️
Comments
Post a Comment