దేశ భక్తి జ్ఞప్తి అజ్ఞాతం

Madhavrao: 
విచిత్రం గా ఒకటో నెల చివరలో దేశ భక్తి వచ్చి ముగుస్తుంది. మరల ఎనిమిదో నెల మొదలు మధ్య రోజులు వరకు విపరీతంగా ఎక్కడ లేని దేశ భక్తి వచ్చేస్తుంది అదేంటో 

Bharghav Shyam: 
దేశభక్తికి ప్రచారం అనవసరం కదా. ప్రజలు అలాంటి ప్రత్యేకమైన సమయాల్లోనే వ్యక్తపరుస్తారు అనిపిస్తుంది.

Madhavrao: 
దేశ భక్తి నీ వ్యక్త పరచడం లో ఏ మాత్రం తప్పులేదు. మిగతా రోజులు లో మాత్రం దేశ భక్తి శున్యం. స్కూల్ లో పాఠాలు చెప్పే టీచర్ నుండి కాలేజీ లో లెక్చరర్స్ వరకు చెప్పేవి చేసేది అంతా వేరు.

Bharghav Shyam: 
మిగతా రోజుల్లో శూన్యం అని ఎలా చెప్పగలరు. దేశభక్తిని మీరు ఎలా గ్రహిస్తారు

Madhavrao: 
భార్గవ్ గారు ఒక సారి బయట యువత నీ పరిశీలించిను. ఇంట్లో పెద్ద వాళ్లకు కనీసం గౌరవం కూడ ఇవ్వరు. అలాంటి చాలా మంది కేవలం DP మార్చి నాకు దేశ భక్తి ఉంది అనుకుంటున్నారు.
 జనవరి -26 & ఆగష్టు 15 ఆ రోజుల్లో సీటీ లో మద్యం దొరకడం లేదు అని పల్లేటూరో వైపు వెళ్లి మద్యం & మందు సేవించిన వాళ్ళని చూసాను. ఆ ముఖ్యమైన ఆ రెండు రోజుల్లో మంచి స్పీచెస్ ఇచ్చేవారు. తరువాత వాళ్ళని వీడియోస్ లో చూసి షాక్ అయ్యాను అలా చాలా మంది ఉన్నారు.
ఎందరో పెద్దల త్యాగ ఫలం ఈరోజు ఇలా ఉన్నాం.

Bharghav Shyam: 
సమ్మతిస్తున్నాను..... 
ఇందాక నేను అడిగిన ప్రశ్నకు నా జవాబు ఇది దేశభక్తి అనేది నైరుప్యమైనది. 
అది కనిపించేది కాదు. 
దేశమంటే మట్టి మరియు మనుషులు. ఇతర మనుషుల పట్ల ప్రవర్తించే తీరు దేశభక్తిని తెలియజేస్తుంది. మట్టిని మనుషుల్ని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తున్నట్టే.

ఇలాంటి రోజులు మనల్ని నియంత్రిస్తాయని నమ్ముతున్నాను

Madhavrao: 
ఉంటుంది కాని ఆ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పరిమితం అయ్యి మిగతా రోజులు మనల్ని ప్రభావం చేయటం లేదా అనిపిస్తుంది.

Bharghav Shyam: 
అది మనకు ఆలోచనలు కలిగిస్తాయి‌. 
మనం తెలిసి మానేయాలని ఉండి, శక్తి ధైర్యం చాలక తప్పదు అనే భావనతో కావాలనే తప్పు చేస్తాం. ఆలోచనలే మన శక్తికి ఇంధనం కదా. మార్పు అనే ఆలోచనతో మార్పు ఒక్కసారిగా రాకపోయినా కొంచెం కొంచెం వస్తుంది కదా. సానుకూలతతో వాళ్ళకు దేశభక్తి ఉండి కూడా వ్యక్తపరచడం లేదు అని అనుకుంటున్నాను.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao