తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం. తన పుట్టినరోజుని ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా జరుపుతోంది.
గద్య తిక్కనగా పేరొందిన కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు భాషా వ్యవహారానికి మూలపురుషుడు కాగా, గిడుగు వెంకట రామమూర్తి శిష్ట (ప్రమాణ, ప్రస్తుత) వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించి అందరికీ విద్యను చేరువ చేసిన కార్యదీక్షుడు.
పూర్వం తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని ప్రజలు మాట్లాడే భాష, పుస్తకాల భాష మధ్య తేడాలు ఉన్నాయని విద్యకు అవకాశం ఉన్నా చాలామంది విద్యకు దూరమవుతున్నారు అన్నది గిడుగు రామమూర్తి అనుభవంతో వల్ల కలిగిన భావన.
గురజాడ వెంకట అప్పారావు, గిడుగు వెంకట రామమూర్తి, శ్రీనివాస అయ్యంగారు, ఆంగ్ల అధికారి జె.ఎ. యేట్స్ ఈ నలుగురు కలిసి తెలుగు వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించారు. ఆ నలుగురిలో (గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, జె. ఏ. యేట్సు) గిడుగు వెంకట రామమూర్తి గారి పాత్ర కీలకమైంది, సుదీర్ఘమైంది.
గురజాడ వెంకట అప్పారావు గిడుగు రామమూర్తికి విద్యాభ్యాస సమయంలో తన సహాధ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులుగారు తన చివరి దశలో.. వీరందరు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉతంగా నిలిచారు.
గిడుగు రామమూర్తి తన సొంత ఖర్చుతో పాఠశాల ఏర్పాటు చేసి అధ్యాపకులకు జీతాలు చెల్లించి వ్యవహారిక భాషలోనే చదువు చెప్పే ప్రయత్నం చేశారు. భాషా అధ్యయనంలో, గ్రాంధికాన్ని వ్యవహారికంగా మార్చడంలో, విద్యని అందరికీ చేరువ చేయడంలో, తదితర సేవలను గుర్తించి తన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.
ప్రపంచీకరణలో ఆంగ్లభాష ప్రాముఖ్యం అధికం అవసరం కూడా..., కానీ వ్యక్తిగత భావవ్యక్తీకరణలో మాతృభాషకు మించిన మాధ్యమం లేదు అనేది బలమైన భావన. అందుకే ప్రపంచీకరణ సైతం మాతృభాషకు ప్రాధాన్యమిస్తుంది. దాని పరిణామమే వివిధ భాషలను అంతర్జాల పరిధిలోకి తీసుకొని రావడం. కొత్త భాష నేర్చుకోవడం అంటే మన అభిజ్ఞశక్తిని మెరుగుపరచుకొవడమే కదా!
ఎందరో గుప్త మహానుభావులు ఉన్నారు, వారిలో కొందరు కావాలనే అలాగే ఉండిపోతున్నారు. వారిని మనం గుర్తించలేము. బహిర్గతంగా ఉన్న వారు, గుప్తంగా ఉన్న వారిని స్మరించడానికి స్మారకం.
🙏
ReplyDeleteచాలా బాగా రాశావు
ReplyDelete🙏
ReplyDelete❤️
ReplyDelete👏
❤️
ReplyDelete🙏
ReplyDelete👏
ReplyDeleteపేదవారి సమర్దత పెంచి ధనవంతులుగా చేయటం కంటే ధనవంతులను దోచి అందరినీ పేదలుగా మార్చే సామాజిక నక్సలైట్ల సిద్దాంతం వలే పామరులను పండితులుగా మార్చుట కంటే పాండిత్యాన్ని పామరస్థాయికి తేవటం సులభం కదా.
ReplyDeleteఒకదానిలో ఇరువురి కృషి అవసరం రెండవ దానిలో ఒకరి ప్రయాశ శూన్యం. జనం తొందరగా అనుసరిస్తారు కూడా.