శ్రీకృష్ణతత్వం
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
శ్రీకృష్ణతత్వం/ Sri Krishna's Philosophy
శ్రీకృష్ణుని స్వభావం మహా మహాసముద్రం లాగ అనిపిస్తుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా పడవ లాంటి మాధ్యమమైన అంతఃకరణంతో కొద్దీలో కొద్దీ కృష్ణ తత్వాన్ని ఊహిస్తూ ఆనందిస్తున్నాను.
కిరణాలకు మించి విభిన్న అసంఖ్యాత కోణాలతో పార్శ్వాలతో ద్వంద్వాలను ద్వంద్వాతీతాలను కలిగిన పరిపూర్ణడు శ్రీ కృష్ణుడు
ఎందరికో ఎన్నో భిన్నాభిప్రాయాలు కలిగించాడు. అన్నీ తానే అని భావన కలిగించాడు.
అహింసకు మించిన ధర్మం లేదన్నాడు. యుద్ధం కూడ ధర్మమే అని పోరాడమన్నాడు.
కర్మలు చేయమన్నాడు. కర్మ సన్యాసము చేయమన్నాడు.
ద్వంద్వాలలో ఉన్న సమతుల్య శక్తిని, అద్వైత స్థితిని పరిచయం చేశాడు
శ్రీకృష్ణుడు అన్ని పనులు చేశాడు, చేసిన తర్వాత వాటితో సంబంధం ఏర్పరచుకోలేదు.
బాగుంది నేను చదివి తీపి అనుభూతి పొందుతున్న నువ్వు రాసేవి 👍👏 Making Sense to me.
ReplyDelete-Valli Akka-
🙏
ReplyDeleteకృష్ణతత్వం చాలా బాగా రాశావు
ReplyDelete