Vamsi Krishna (Telugu 17.01.2026)

⚛️🪷🌳 

అష్టాచమ్మా చలనచిత్రంలో మహేష్ అంటే ఓ వైబ్రేషన్ అనే లాగా నా జీవితంలో “వంశీ” అనే పేరు వింటే నాలు సానుకూల తరంగాలు ప్రతిధ్వనించేవి. ఇలా మొదలవ్వడానికి కారణం నువ్వే వంశీ.
 
మన ఇద్దరికీ ముఖ పరిచయం అయ్యింది రెండో తరగతిలో అయినా, మనం పాఠశాల మారిపోవడం మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇద్దరం పాఠశాలలు మారి ఒకే పాఠశాలలో కలవడం, పాత ముఖ పరిచయం వల్ల, మనస్తత్వాలు కలవడం వల్ల నూతన పాఠశాలలో మన మధ్య స్నేహం తొందరగానే చిగురించింది. 

రెండు సంవత్సరాలు ఇద్దరం ఆదివారం అవ్వగానే ఉదయాన్నే వాకింగ్ అనుకుంటూ మనకు తెలిసిన కడప చుట్టూ ఉండే కొత్త ప్రదేశాలకు నడుచుకుంటూ తిరిగేవాళ్లం. ఆర్ట్స్ కాలేజ్, రాజీవ్ పార్కు, ఎల్ఐసి పార్కు, కలెక్టర్ బంగ్లా, దాని పక్క పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ దగ్గరున్న ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన వాటర్ ట్యాంక్, వివిధ కూడళ్ళు, కొన్ని దేవాలయాలు, తిరిగి వాళ్ళము. కొన్నిసార్లు మనకు తోడుగా మన తోబుట్టువులు కూడా మనతో పాటు వచ్చేవారు. 

అప్పుడు మనం బయట ఏమి తినేవాళ్ళం కాదు, కేవలం నడుచుకుంటూ కొత్త ప్రదేశాలు చూడటం, సరదాగా గడపడం కోసం మాత్రమే నడిచే వాళ్ళం. ఆ సమయంలో మనకు కొన్ని కొత్త పరిచయాలు కూడా అయ్యేవి. 

పాఠశాల రోజుల్లో జరిగే పరుగు పందెం సమయంలో నిన్ను ప్రోత్సహించడం, వేసవి సెలవులు పాల్గొన్న చిత్రలేఖనం, మీ ఇంట్లో ఉన్న చిలుకలు కుందేళ్లను చూడడం భలే వింతగా ఉండేది. కొత్త నీలం రంగు Axndx సైకిల్ కొనడం, దాని పైన ఎక్కించుకోవడం. రెడ్డి సాయి లోకేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి రావడం, ఇలా అన్ని ఆనాటి జ్ఞాపకాలు. 

ఇద్దరి ఇళ్లల్లోనూ ఇరువురి పట్ల గౌరవం ఉండడం, వేడుకలకు పిలవడం భలే మంచిగా అనిపించింది.

నువ్వు గుంటూరు భాష్యంలో చేరిన తర్వాత ఎన్నోసార్లు నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాని. అప్పటి నీ హాస్టల్ రూమ్ నెంబర్.111, ఫోన్ నెంబర్. 08632 260231 అప్పటిన నా అల్మర, పెట్టెలో రాసి అంటించుకున్నాను.

మన ఇద్దరి స్నేహంలో రెండవ దశ మొదలైంది 30 ఆగస్టు 2020, ఇద్దరం రైల్వే స్టేషన్ దగ్గర నడుచుకుంటూ మనకు ఉన్న సారూప్య అనుభవాల గురించి చర్చించుకున్నాము. ఇద్దరం మాస్టర్స్ లో డీటెయిన్ అనే విధానం, తిరిగి పుంజుకున్న విధానం చాలా ఆశ్చర్యానికి గురిచేసాయి. అది కరోనా సమయం అవ్వడం వల్ల, మాస్క్ ధరించి ఇద్దరం తరచూ కలిసి వాళ్ళం, ఉద్యోగం, భవిష్యత్తు గురించి చర్చలు చెప్పే వాళ్ళం. కారులో బండిలో తిరగడం మధుర జ్ఞాపకాలు.

ఇక నీ పెళ్లిలో స్నేహితుడి హోదాలో వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే అని తెలుసి నా ఆనందానికి అవధులు లేవు. మన ఇద్దరి స్నేహంలో ఎటువంటి ఎత్తు పళ్లాలు లేవు, కేవలం సరళమైన సంభాషణతో స్నేహం సంభావ్యంగా కొనసాగుతోంది. ఇప్పటికే మా మధ్య స్నేహం అలానే కొనసాగుతోంది.

హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వంశీ.
💭⚖️🙂📝@🌳 
 📖17.01.2026✍️





Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)