Krishna Vamsi Gari Birthday (Telugu 28.07.2023)
⚛️🪷🌳
పసుపులేటి వెంకట బంగారు రాజుగా పుట్టి
వరప్రసాద్ ద్వారా వచ్చి
వర్మ శిష్యునిగా వృత్తిలో
గులాబీతో దర్శకుడిగా వికసించి
వృద్ధి చెంది, పాత్రికేయుని ప్రాత
కారణంతో కొత్త కుటుంబ కథ
చిత్రం నిన్నే పెళ్ళాడుతా తో ప్రశంసలు పొంది....
సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం,
మురారి, ఖడ్గం, శ్రీఆంజనేయం, చక్రం,
డేంజర్, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం,
మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే,
నక్షత్రం, రంగమర్తాండ......
వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి,
క్రియేటివ్ డైరెక్టర్ పేరొందిన కృష్ణవంశీ గారు
ఈ సామాజిక మాధ్యమంలో
మా స్పందనలకు ప్రతిస్పందించే ప్రముఖులుగా....
చక్రం, రంగమార్తాండ, ఖడ్గం, మురారి,
నిన్నే పెళ్ళాడుతా (శ్రీఆంజనేయం, మహాత్మా
చిత్రల పాటలు 😊) వంటి నాకు నచ్చిన
కళాఖండాలు అందించిన దర్శకునిగా....
సిరివెన్నెల సీతారామశాస్త్రి దత్త పుత్రునిగా,
మనసుకు దగ్గరైన ఉన్న మీకు నా
హృదయపూర్వక హార్దిక
జన్మదిన శుభాకాంక్షలు....
💭⚖️🙂📝@🌳
📖28.07.2023✍️


Comments
Post a Comment