అంతర్జాతీయ పులుల దినోత్సవం

⚛️ 🪷 📧

అంతర్జాతీయ పులుల దినోత్సవం (29 Jul 2022)
International Tiger Day (29 Jul 2023)

ప్రకృతి పులి అడవి మనుషులు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అడవులు ఉంటేనే స్వచ్ఛమైన గాలి, విస్తారమైన వర్షాలు పొందుతాం. అడవులు క్షీణిస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మానవ మనుగడ అడవులతోనే ముడిపడి ఉంది.

ఒక పులి ఉన్న పరిధిలో ఇంకొక పులి ఉండదు. ఒక్కొక్క పెద్దపులి అడవిలో నిత్యం సూమారు 40 నుంచి 70 కి.మీ. దూరం తిరుగుతుంది. పులులు ఎక్కువగా ఉన్నాయి అంటే అడవులు సమృద్ధిగా ఉన్నాయని అర్థం. 

అడవుల్లోని అరుదైన మొక్కలను చెట్లను కాపాడడానికి పులి శాకాహార జంతువులపై దాడి చేస్తూ వాటి సంఖ్యను నియంత్రిస్తుంది. పులులు శాకాహార జంతువులను నియంత్రించకపోతే అరుదైన మొక్కలు, వృక్షజాతులు అంతరించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. (పులి ఒక జంతువును వేటాడితే ఒకేసారి దాన్ని మొత్తం తినదు. ఒక స్థావరంలో భద్రపరుచుకుంటుంది. కొద్దికొద్దిగా వారం దాకా తింటుంది).
------------------
There is an inextricable relationship between nature, tiger, forest and humans. If there are forests only.. we will get clean air and abundant rains. Human survival becomes questionable if forests will degraded. Human survival is closely linked with forests.

Where there is one tiger in one range, there is no other tiger. Each tiger regularly travels about 40 to 70 km in the forest. The distance wanders. If there are More tigers means there is more forests.

The tiger controls the number of herbivore by attacking other animals and to save trees and rare plants in the forest. If the tigers do not control the herbivores, the rare plants and flora will become extinct and the ecological balance will be disturbed. (A tiger hunts an animal and does not eat it all at once. It stores it in a place. It eats bit by bit for a week).

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం






Comments

  1. పులి తన విశాల పరిధి చుట్టూ చెట్ల మీద మూత్రం పోసి, గోళ్లతో గీచి హద్దులు ఏర్పాటు చేసుకుంటుంది. మరో పులి ఆ ప్రాంతానికి చేరుకుంటే మూత్రం వాసన, గోళ్లతో గీచిన గుర్తులను గమనించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఒకవేళ శత్రువు పరిధి దాటి వస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది. అదే గనుక జరిగితే రెండింటిలో ఒకటి మృత్యువాత పడే వరకు పోరాటం కొనసాగుతుంది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao