చదలవాడ ఉమేష్ చంద్ర IPS..
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి వాదాలకు తన పోలీస్ వాదం(ఇజంతో) సింహ స్వప్నం రుచి చూపించి "కడప పులి"గా కీర్తిగడించారు.
జన జాగృతి కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘంలోగల దురభిప్రాయాలు తొలగించి "ఫ్రెండ్లీ పోలీసింగ్"కు ఒక నిర్వచనంగా మిగిలారు. నక్సలైట్ల చేతిలో హతమైన హితడిగా చిరస్థాయిలో నిలిచిపోయారు చదలవాడ ఉమేష్ చంద్ర.
💭⚖️🙂📝@🌳
📖04.09.2022✍️
------------------
ఇక్కడి నుంచి
చదలవాడ ఉమేష్ చంద్ర IPS..
19 మార్చి 1966 నుండి 4 సెప్టెంబర్ 1999.
గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో 19 మార్చి 1966న వేణుగోపాల రావు, నయనతార దంపతులకు ఉమేశ్ చంద్ర జన్మించారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య. నిజాం కళాశాల నుండి B.A (1987), ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.A (1989) పట్టాలు పొందాడు. రెండింటిలోను ప్రథముడిగా నిలచి బంగారు పతకాలు సాధించాడు. 1991లో IPS కి ఎన్నికై, 1991-92 లో ‘జాతీయ పోలీస్ అకాడమీ’ లో శిక్షణ పొందారు.
మొదట 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ASP గా పని చేశారు. వరంగల్లులో పనిచేసిన కాలంలో “జనజాగృతి” అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లు గ్రామాల్లో పాతుకుపోయిన నక్సలిజాన్ని రూపుమాపడానికి కృషిచేస్తూ మొదటి పోస్టింగుతోనే నక్సల్స్ కు బద్దవిరోధి అయ్యారు.
తరువాత కడప జిల్లాలో ఫాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి గా బదిలీ చేయబడ్డారు, అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు, చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్రలేకుండా చేసారు, అర్ధరాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు, మామూలుగా సినిమా హీరోల పైన, రాజకీయనాయకుల పైన పాటలు వ్రాస్తారు అలాంటిది పోలీసు అధికారి పై పాటలు వ్రాసారు అదికూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియడానికి.
ఫిబ్రవరి 1995 లో వరంగల్లు ‘ప్రత్యేక విధుల అధికారి’ గా నియమితులయ్యారు, ఈసారి నక్సలిజం పై విరుచుకుపడ్డారు, వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు, ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు, ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములో గల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997 న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యారు, ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచిచేసింది, ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేసారు, ఆయన బదిలీ అయి వెళుతున్న రోజు ప్రజలు ఆయనికి పలికిన వీడ్కోలు అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ ఎక్కడా ఏ పోలీసు అధికారికి జరగలేదు, ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదు యస్సార్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు..
మూలం: Telugu Wikipedia
Yeah...he was a great police officer..
ReplyDelete👌👌👌🙏🙏🙏
ReplyDelete